HYD: పాస్‌పోర్టు స్కామ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరి అరెస్టు | Passport Scam Case Investigation, CID Arrest 14 Accused | Sakshi
Sakshi News home page

HYD: పాస్‌పోర్టు స్కామ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం.. మరో ఇద్దరి అరెస్టు

Published Sat, Jan 27 2024 10:09 AM | Last Updated on Sat, Jan 27 2024 2:52 PM

Passport Scam Case Investigation CID Arrest 14 Accused - Sakshi

( ఫైల్‌ ఫోటో )

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన పాస్‌పోర్టుల కుంభకోణం కేసులో తెలంగాణ సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి అనర్హులకు పాస్‌ పోర్టులు జారీ చేసిన వ్యవహారంలో సీఐడీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. అనంతపురానికి చెందిన ఏజెంట్‌తో పాటు మరొకరిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి పాస్‌పోర్టులు సహా పలు నకిలీ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. 

ఇప్పటి వరకు ఈ కేసులో 12 మందిని సీఐడీ అరెస్టు చేయగా.. తాజా అరెస్టులతో ఈ సంఖ్య 14కి చేరింది. నిందితులందరిని కస్టడీకి తీసుకొని విచారించనుంది. ఇప్పటికే 92 నకిలీ పాస్‌పోర్టులను సీఐడీ గుర్తించింది. అరెస్టయిన ఏజెంట్ల నుంచి సేకరించిన సమాచారంతో 35కి పైగా పాస్‌పోర్టులు రద్దు చేసింది.  దేశంలోని అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. పలువురు నిందితులు ఇప్పటికే విదేశాలకు పారిపోయినట్లు గుర్తించింది.. మిగతావారినైనా దేశం దాటకుండా ఉండేందుకు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేస్తోంది.

పాస్‌పోర్టుల జారీలో కీలక పాత్ర పోషించిన స్పెషల్‌ బ్రాంచ్‌ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు సీఐడీ అధికారులు రంగం సిద్ధం చేశారు.  పాస్‌పోర్టు జారీ, ప్రక్రియ పూర్తయ్యేందుకు ఏజెంట్లు.. అధికారులకు లంచాలు ఇచ్చారని సీఐడీ ఆధారాలు సేకరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement