Former Minister Narayana Arrested by AP CID Police at Hyderabad - Sakshi
Sakshi News home page

Ex-Minister Narayana Arrested: ఏపీ సీఐడీ అదుపులో మాజీ మంత్రి నారాయణ

May 10 2022 11:35 AM | Updated on May 10 2022 5:15 PM

Former Minister Narayana Arrested by AP CID Police at Hyderabad  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణ అరెస్ట్‌ అయ్యారు. కొండాపూర్‌లోని ఆయన నివాసంలో ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గత 4 రోజులుగా ఫోన్‌ స్విచ్ఛాప్‌ చేసి నారాయణ అజ్ఞాతంలో ఉన్నారు. ఇదిలా ఉంటే, చిత్తూరు జిల్లాలో నారాయణ స్కూల్‌ నుంచి టెన్త్‌ పేపర్లు లీకైన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఇప్పటికే వైస్‌ ప్రిన్సిపల్‌ గిరిధర్‌తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement