సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ప్రకాశం బ్యారేజ్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్‌ను ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎంపిక చేసింది. నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖలో జరిగే ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌లో ప్రకాశం బ్యారేజ్‌కి ఇచ్చే అవార్డును రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అందుకోనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌కు ఐసీఐడీ డైరెక్టర్ అవంతివర్మ తాజాగా లేఖ రాశారు. ప్రకాశం బ్యారేజ్‌తో కలిపి రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించిన ప్రాజెక్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇప్పటికే కేసీ (కర్నూలు–కడప) కెనాల్, కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువులను 2020లో.. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్‌ను 2022లో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
ప్రపంచవ్యాప్తంగా జలవనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించే విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలాలను దేశాలకు అందించడమే లక్ష్యంగా 1950, జూన్ 24న ఐసీఐడీ ఏర్పాటైంది. పురాతన కాలంలో నిరి్మంచి.. ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్లందిస్తున్న సాగునీటి కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment