ఆఫ్‌ వైట్‌..  ఫుల్‌ బ్రైట్‌ | New fashion dress in this week | Sakshi
Sakshi News home page

ఆఫ్‌ వైట్‌..  ఫుల్‌ బ్రైట్‌

Published Fri, Oct 12 2018 12:23 AM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

New fashion dress in this week - Sakshi

మన ఆడపిల్లలు అందంగా ఉంటారుఆ అందానికి నగిషీయే ఆఫ్‌వైట్‌ శారీ! పూజకు తేజంవేడుకకు ఆకర్షణీయంఆ సౌందర్యానికి చిరునామాయే  ఆఫ్‌వైట్‌ శారీ! 

ఆఫ్‌వైట్‌ శారీ సంప్రదాయానికి చిరునామా. అందుకే వివాహ వేడుకలకు, పండగలప్పుడు తప్పనిసరిగా ఈ కళ సందడి చేస్తుంటుంది. పాలమీగడలా ఉండే ఫ్యాబ్రిక్‌కి ఏ రంగు జత చేసినా చక్కగా నప్పుతుంది. బ్రైట్‌గా వెలిగిపోతుంది. కొంత తెలుపు–మరికొంత ఎరుపు లేదా పసుపు, నీలం లేదా నలుపు, ఎరుపు లేదా పింక్‌.. ఇలా ఏ రంగు కాంబినేషన్‌తో అయినా అందమైన అంచులతో చక్కగా కలుపుకొనే రంగు తెలుపుది. అందుకే బాలీవుడ్‌ టు టాలీవుడ్‌ భామలు సైతం ఈవెంట్స్‌కి ఆఫ్‌వైట్‌ని కోరి మరీ ఎంచుకుంటారు. వేడుకలలో ఫుల్‌ బ్రైట్‌గా వెలిగిపోతున్నారు.  మన చుట్టూ ఉన్నవారితో మనం కూడా అంతే అందంగా కలిసిపోవాలని, అప్పుడే జీవితం కళవంతంగా తయారవుతుందని తెలుపురంగు చెప్పకనే చెబుతుంటుంది. కొంత ముతక తెలుపు కాంబినేషన్‌తో డిజైనర్లు కాటన్, సిల్క్, పట్టు చీరలను అందంగా నేస్తున్నారు. ఆఫ్‌ వైట్‌ శారీని «ఎంచుకోవాలంటే కాటన్‌ చీర రూ.300/ నుంచి అదే పట్టు చీర అయితే 30 వేల రూపాయల పైబడే ధరలు ఉన్నాయి. అభిరుచి, బడ్జెట్‌ను అనుసరించి ఆఫ్‌వైట్‌ కాంబినేషన్‌ శారీని పండగలకు ఎంచుకోవచ్చు. 


∙ఎరుపు, పసుపు, పచ్చ, ఆరెంజ్‌.. ఈ కాంతిమంతమైన అంచులున్న ఆఫ్‌వైట్‌ చీరలు సంప్రదాయ వేడుకలలో ప్రత్యేకంగా నిలుస్తాయి. ∙ఆఫ్‌వైట్‌ శారీకి వైవిధ్యమైన, కాంతిమంతమైన అంచులున్న బ్లౌజలను ధరించవచ్చు ∙వేడిగా, చల్లగా ఉన్న వాతావరణంలోనూ ఈ రంగులు కంటికి హాయినిస్తాయి. ∙తెలుపు లేదా క్రీమ్‌ రంగు చీరకు సిల్వర్‌ లేదా బంగారు రంగు అంచులు లేదా బ్లౌజ్‌ ధరిస్తే స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తారు ∙మోడల్స్, సెలబ్రిటీలు ఆఫ్‌వైట్‌ను ఒక స్టైల్‌ స్టేట్‌మెంట్‌లా తీసుకుంటారు ∙తెలుపు రంగు బ్లౌజ్‌ వేసుకోవాలంటే చికున్, లక్నో వర్క్‌ చేసిన బ్లౌజ్‌లను ధరించాలి. ముచ్చటగొలిపే మగ్గం వర్క్‌ లేదా హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌లను ధరిస్తే లుక్‌ బ్రైట్‌గా కనిపిస్తుంది ∙ఆఫ్‌వైట్‌శారీకి ఇండోవెస్ట్రన్‌ లుక్‌ తీసుకురావాలంటే ఫ్రిల్డ్‌ స్లీవ్స్‌ బ్లౌజ్, క్రాప్‌టాప్స్, జాకెట్స్, పెప్లమ్‌ బ్లౌజ్‌.. లాంటి వెస్ట్రన్‌ స్టైల్‌ బ్లౌజ్‌లను ధరించాలి ∙ఆఫ్‌ వైట్‌ శారీలో ఎక్కువ రంగులు లేవు మరీ ప్లెయిన్‌గా ఉందని అనిపించినా సరే బ్లౌజ్‌ డిజైన్‌లో తక్కువ ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, ప్రింట్లు.. ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ∙ఈ రంగు చీరకు ఉన్న ప్రత్యేకత బ్లౌజ్‌ డిజైన్లలో ట్రెండ్‌ను అనుసరించి ఎంపిక చేసుకుంటే ఆభరణాల అలంకరణ పట్ల ఆందోళన అవసరం లేదు. చీరకట్టుతోనే స్పెషల్‌ స్టైల్‌ని క్రియేట్‌ చేయవచ్చు.

►ప్లెయిన్‌ ఆఫ్‌వైట్‌ పట్టు చీరకు నీలం రంగు బ్లౌజ్‌ ఓ ఆకర్షణ. సింపుల్‌గా అనిపించే ఫ్యాబ్రిక్‌ పెయింట్‌ లేదా హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్‌ ధరించడంతో అందం రెట్టింపు అవుతుంది.

►సంప్రదాయ కంచిపట్టు ఆఫ్‌వైట్‌ శారీకి మోడ్రన్‌ లుక్‌ తీసుకురావాలంటే ఓ చిన్నమార్పు చాలు. స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌ బెస్ట్‌ ఆప్షన్‌.

►ఆఫ్‌వైట్‌ శారీకి అదే రంగు బ్లౌజ్‌ ప్రత్యేక ఆకర్షణతో ఆకట్టుకుంటుంది. వేదిక ఏదైనా, వేడుక ఏదైనా గ్రాండ్‌గా వెలిగిపోతుంది.

►ముంజేతులు దాటిన త్రీ బై ఫోర్త్‌ బ్లౌజ్‌ ఆఫ్‌వైట్‌ శారీకి కొత్త హంగును తీసుకువచ్చింది. 

►సింపుల్‌ కాటన్‌ ఆఫ్‌ వైట్‌ శారీ స్టైల్‌ సూపర్బ్‌ అనిపించాలంటే కాంట్రాస్ట్‌ క్రాప్‌టాప్‌ సరైన ఎంపిక అవుతుంది. 

►ఆఫ్‌వైట్‌ పట్టు చీర, కొంగును పోలీ ఉండే బ్లౌజ్‌ రంగు, పెద్ద అంచు సంప్రదాయ వేడుకకు నిండుతనాన్ని తీసుకువస్తుంది.

►ఆభరణాల అలంకరణ లేకున్నా సంప్రదాయ కళను నట్టింటికి తీసుకువచ్చే తేజం ఆఫ్‌వైట్‌ శారీస్‌ది. ఇదే రంగు లెహంగా, కుర్తాలకీ  వర్తిస్తుంది. ఆఫ్‌వైట్‌ని ఏ రూపంగా ధరించినా వేడుకలో అమ్మాయిలు కళగా వెలిగిపోతారు.  
– కీర్తికా గుప్త, డిజైనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement