
ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి మనకు తెలిసిందే. కానీ, పెయింటింగ్‌ను ఇలా మెడలో వేసుకోవడం మాత్రం కొత్తగానే ఉంటుంది. అందుకే ఆధునికత కోరుకునేవారి మెడలో పెయింటింగ్ అందంగా ఇమిడిపోయింది. ఏదైనా ఒక పలచని కార్డ్ బోర్డును ఎంచుకోవాలి. దానికి అందంగా ముఖాకృతులు, పువ్వులు, లతలు, దేవతామూర్తులు.. ఇలా ఇష్టానుసారం పెయింటింగ్ వేసుకోవాలి.
దానికి గట్టి దారాలు, రంగు రంగుల పూసలు, గవ్వలు, చిన్న చిన్న అద్దాలు, మువ్వలు.. జత చేస్తే.. ఇలా అందమైన హారాలు సిద్ధం అయిపోతాయి. మీరూ వీటిని సులువుగా తయారుచేసుకోవచ్చు. లేదంటే.. ఆన్‌లైన్, హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లలో కొనుగోలు చేయచ్చు. డిజైన్ అమరికను బట్టి వంద రూపాయల నుంచి వీటి ధరలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment