fashions
-
ఇంకొంచెం ఇస్మార్ట్‌గా...
అటు ఫ్యాషన్‌ని, ఇటు ఫిట్‌నెస్‌ని... మిళితం చేసి ఫ్యాషనబుల్ ఫిట్నెస్ డివైజ్‌లపై ఆసక్తి ప్రదర్శిస్తోంది యువతరం. స్మార్ ్టరింగ్స్ నుంచి ఫిట్నెస్ ట్రాకర్ల వరకు ఎన్నో డివైజ్‌లను ఇష్టపడుతున్నారు యువత.యువతరంలో పెరుగుతున్న సెల్ఫ్–ట్రాకింగ్ కల్చర్, బయోఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకొని శాంసంగ్, యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు ఫిట్నెస్ డివైజ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి...బాలీవుడ్ నటి ఆలియా భట్‌ను ఫిట్నెస్ డివైజ్‌ల గురించి అడిగితే బోలెడు విషయాలు చెబుతుంది. ఆమెకు ఇష్టమైనది ఒరా రింగ్. ఫిన్‌ల్యాండ్‌లో తయారైన ఈ సెన్సర్–లోడెడ్ టైటానియమ్ రింగ్‌కు యువతరంలో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. తన బయో–ట్రాకింగ్ సామర్థ్యంతో ‘ఒరా’కు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.దీన్ని దృష్టిలో పెట్టుకొని యాపిల్, శాంసంగ్‌లాంటి టెక్ దిగ్గజాలు తమదైన సొంత వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నాయి.స్మార్ట్ రింగ్‌లకు యువతంలోని క్రేజ్‌ను గమనించి నాయిస్, అల్ట్రాహ్యుమన్, పై రింగ్‌లాంటి ఎన్నో కంపెనీలు రంగంలోకి దిగాయి. ‘మా స్మార్ట్రింగ్స్ లాంచ్ అయిన 24 గంటల్లోనే అమ్ముడు అయ్యాయి’ అంటున్నాడు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘బోట్’ కో–ఫౌండర్ అమన్ గురై.వివిధ కంపెనీల స్మార్ట్రింగ్లు హార్ట్‌రేట్ నుంచి ఆక్సిజన్ ఫ్లో వరకు మానిటర్ చేస్తాయి.నాయిస్, అల్ట్రాహ్యుమన్, పీ రింగ్‌లాంటి కంపెనీలు అందుబాటు ధరల్లో ఉండే స్మార్ట్ రింగ్స్, గ్లూకోజ్ మానిటరింగ్ డివైజ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మన దేశంలో యువతరాన్ని భయపెడుతున్న వ్యాధి డయాబెటిస్.మన దేశంలో యువతరంలో డయాబెటిస్ పెరుగుతున్న నేపథ్యంలో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను దృష్టిలో పెట్టుకొని అల్ట్రాహ్యూమన్, కంటూర్ ప్లస్లాంటి గ్లూకోజ్ మానిటర్ డివైజ్‌లు వచ్చాయి.‘వ్యక్తిగత ఆరోగ్యం గురించి శ్రద్ధ పెరిగినప్నుడు హెల్త్‌కేర్ టూల్స్‌కు ప్రాధాన్యత పెరగడం అనేది సహజ విషయం’ అంటున్నాడు అమన్ గురై.ఫిట్నెస్ టూల్స్ గురించి యూత్‌లో ఆసక్తి పెరగడం ఆహ్వానించదగిన పరిణామం అంటుంది నేషనల్ ఫుట్‌బాల్ టీమ్ గోల్‌కీపర్, షీ కిక్స్ ఫుట్‌బాల్ అకాడమీ వ్యవస్థాపకురాలు అదితి చౌహాన్.‘వ్యాయామ సమయంలో నా శరీరం పనితీరును, నిద్రను పర్యవేక్షించడానికి నేను యాపిల్ వాచ్‌ను ఉపయోగిస్తాను. సమయానికి నిద్రపోవడం లాంటి వాటిని ఇది సూచిస్తుంది’ అంటుంది అదితి.స్టెప్స్, ఫిజికల్ యాక్టివిటీలను ట్రాక్ చేసే ఫిట్నెస్ వాచ్‌లను ధరించడానికి యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది.‘ఒకప్పుడు నాకు ఆరోగ్య విషయాలపై శ్రద్ధ ఉండేది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చిన తరువాత నాలో మార్పు వచ్చింది. బయోఫీడ్ బ్యాక్‌పై ఆసక్తి పెరిగింది. దీంతో రకరకాల గ్యాడ్జెట్స్‌ను వాడుతున్నాను’ అంటుంది బెంగళూరుకు చెందిన ఎంసీఏ స్టూడెంట్ సజిత.హెల్త్గ్యాడ్జెట్స్ను ప్రేమించేవారితో ΄ాటు వాటి అతి వినియోగాన్ని విమర్శిస్తున్న వారు కూడా యూత్‌లో ఉన్నారు.‘పందశాతం కచ్చితత్వం కోసం సర్టిఫైడ్ టూల్స్ మాత్రమే వాడాలి. లేక΄ోతే అనవసర ఆందోళనకు దగ్గర కావాల్సి వస్తుంది. గ్యాడ్జెట్ల వాడకంలో ఆచితూచి వ్యవహరించాలి’ అంటున్నారు నిపుణులు.‘వెల్నెస్ వేరబుల్ టెక్నాలజీదే భవిష్యత్’ అనే మాట వినిపిస్తున్నప్పటికీ వేలం వెర్రి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా యువతరంపై ఉంది. -
ముఖేష్ అంబానీ చేతికి మరో దిగ్గజ సంస్థ, 80శాతం వాటా కొనుగోలు!
న్యూఢిల్లీ: ప్రీమియం లోదుస్తుల రిటైల్ సంస్థ క్లోవియాలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. క్లోవియా మాతృసంస్థ పర్పుల్ పాండ్ ఫ్యాషన్స్‌లో 89 శాతం వాటాలను రూ. 950 కోట్లకు దక్కించుకుంది. మిగతా వాటాలు కంపెనీ వ్యవస్థాపక సభ్యులు, మేనేజ్మెంట్ దగ్గర ఉంటుంది. రెండు సంస్థలు ఒక సంయుక్త ప్రకటనలో ఈ విషయాలు తెలిపాయి. ఇప్పటికే జివామె, అమాంటే బ్రాండ్లను దక్కించుకున్న ఆర్‌ఆర్‌వీఎల్‌కు తాజాగా క్లోవియా కొనుగోలుతో .. ఇన్నర్ వేర్ సెగ్మెంట్లో స్థానం మరింత పటిష్టం చేసుకోవడం సాధ్యపడనుంది. పంకజ్ వెర్మాని, నేహా కాంత్, సుమన్ చౌదరి కలిసి 2013లో క్లోవియాను ప్రారంభించారు. వినియోగదారులకు అత్యుత్తమ ఉత్పత్తులు అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని, అందులో భాగంగానే క్లోవియా బ్రాండ్‌ను కూడా తమ పోర్ట్‌ఫోలియోలో చేర్చామని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఈషా అంబానీ తెలిపారు. రిలయన్స్ భారీతనం, రిటైల్ అనుభవంతో తమ కార్యకలాపాలు మరింతగా విస్తరించగలమని క్లోవియా వ్యవస్థాపకుడు, సీఈవో పంకజ్ వెర్మాని పేర్కొన్నారు. -
మరో కంపెనీలో భారీగా వాటాను కొనుగోలు చేసిన రిలయన్స్ రిటైల్!
ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్ఆర్వీఎల్) పర్పుల్ పాండా ఫ్యాషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 89 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేసింది. వాటాల కొనుగోలులో భాగంగా రిలయన్స్ రూ.950 కోట్ల పెట్టుబడులు పెట్టింది. పంకజ్ వర్మానీ, నేహా కాంత్ & సుమన్ చౌదరి 2013లో లాంఛ్ చేసిన క్లోవియా మహిళల ఇన్నర్ వేర్, లాంజ్ వేర్ తయారు చేయడంలో ఒక ప్రీమియం కంపెనీ. రిలయన్స్ ఇప్పటికే జీవామే, అమంటే వంటి బ్రాండ్లను కొనుగోలు చేసింది. బీడీఏ పార్టనర్స్ క్లోవియాకు ప్రత్యేక ఆర్థిక సలహాదారుగా వ్యవహరించగా, శార్దూల్ అమర్ చంద్ మంగళ్ దాస్ లీగల్ కౌన్సెల్'గా వ్యవహరించారు. "పంకజ్ వర్మాని, నేహా కాంత్, సుమన్ చౌదరి 2013లో ప్రారంభించిన క్లోవియా భారతదేశంలో ప్రముఖ బ్రిడ్జ్-టు-ప్రీమియం డీ2సీ బ్రాండ్" అని రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. క్లోవియా కింద 3,500+ ప్రొడక్ట్ స్టైల్స్ ఉన్నాయి. (చదవండి: మీ ఆధార్ కార్డులో ఫోటో మార్చుకోండి ఇలా..!) -
దేశాయ్ డిజైన్స్ వెరీ ట్రెండీ!
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో సోషల్ మీడియా చూడని వారు ఎవరూ ఉండరు. సోషల్ మీడియా వేదికను కొందరు కొత్త విషయాలను చెప్పడానికి వాడితే, మరికొందరు తమ టాలెంట్‌ను ప్రదర్శించే వేదికగా వినియోగిస్తున్నారు. దేశాయ్ తల్లీ కూతుళ్లు మాత్రం.. వాళ్ల సృజనాత్మకతను వీడియోల రూపంలో పోస్టుచేసి ఎంచక్కా వ్యాపారం చేస్తున్నారు. సోషల్ మీడియా ఇచ్చిన ప్రోత్సాహంతో బిజినెస్‌ను మరింతగా విస్తరిస్తూ పోతున్నారు. అది 2016. ముంబైలో ఉంటోన్న హీతల్ దేశాయ్ (తల్లి), లేఖినీ దేశాయ్ (కూతురు)లు ఇద్దరు హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్‌కు షాపింగ్ చేసేందుకు వెళ్లారు. అక్కడ చేనేత వస్త్రాలను చూసిన వాళ్లకు ‘ చేనేత వస్త్రంతో వివిధ రకాల డిజైన్లతో డ్రెస్సులు అమ్మితే ఎలా ఉంటుంది? అనే బిజినెస్ ఐడియా వచ్చింది. అలా ఆలోచన రాగానే వెంటనే ఎగ్జిబిషన్లో సహజసిద్ధ రంగులతో తయారయ్యే అజ్రాఖ్ ప్రింట్ ఉన్న 50 మీటర్ల ఫ్యాబ్రిక్‌ను కొన్నారు. ఇంటికి వచ్చిన తరువాత ఆ వస్త్రాన్ని వాళ్ల ఇంటిపక్కనే ఉన్న ఒక టైలర్‌కు ఇచ్చి వివిధ రకాల సైజుల్లో కుర్తీ్తలను కుట్టించారు. వీటిని ఎలా విక్రయించాలా... అని ఆలోచించినప్పుడు లేఖినికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెంటనే ఫేస్బుక్ పేజీ ఒకటి క్రియేట్ చేసి ఆ కుర్తీల ఫోటోలను అందులో పోస్టు చేసింది. ఆ ఫోటోలు ఫేస్బుక్ ఫ్రెండ్స్‌కు నచ్చడంతో తమకు కావాలని అడిగారు. అలా రెండేళ్లపాటు సాగిన వ్యాపారం లో మంచి లాభాలు వస్తుండడంతో ‘ద ఇండియన్ ఎథినిక్ కోడాట్’ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ప్రారంభంలో ఏడాదికి పాతిక లక్షల బిజినెస్ నడిచేది. ప్రస్తుతం కోట్ల టర్నోవర్‌తో దూసుకుపోతున్నారు. బిజినెస్ ప్రారంభంలో లేఖిని ఎంబీఏ చదువుతూ మరోపక్క సోషల్ మీడియాలో మార్కెటింగ్‌ను నిర్వహించేది. ఎంబీఏ పూర్తయిన తరువాత కోల్‌కతాలోని ఐటీసీలో లేఖినీకి ఉద్యోగం వచ్చింది. అప్పుడు ఫ్యామిలీ బిజినెస్‌లో కొనసాగాలా? కార్పొరేట్ కెరీర్‌ను ఎంచుకోవాలా అన్న ప్రశ్న ఉదయించినప్పుడు ఉద్యోగానికే ఓటేసింది. ఆ సమయంలో హీతల్ దేశాయ్.. కంప్యూటర్ నేర్చుకుని వెబ్‌సైట్‌ను ఆపరేట్ చేసేవారు. వ్యాపారం మంచిగా సాగుతుండడంతో.. లేఖిని ఉద్యోగం వదిలేసి పూర్తిస్థాయిలో వ్యాపార కార్యక్రమాల్లో పాల్గొనేది. ప్రస్తుతం ద ఇండియన్ ఎథినిక్ డాట్‌కు మూడు కార్యాలయాలతోపాటు, ఒక స్టూడియో ఉన్నాయి. మొదట్లో కుర్తీలతో ప్రారంభమైన దేశాయ్ వ్యాపారం క్రమంగా చేనేత చీరలను సరికొత్త డిజైన్లతో రూపొందించి, వాటిని వీడియోల రూపంలో మార్కెట్లో వదలడంతో మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రముఖ చేనేత వస్త్రాల బ్రాండ్లలో ఇండియన్ ఎథినిక్ ఒకటిగా నిలవడం విశేషం. లేఖినీ దేశాయ్ మాట్లాడుతూ...‘‘నా చిన్నప్పటినుంచి నాకు మా చెల్లికి ఏ డ్రెస్ అయినా అమ్మ మార్కెట్లో మెటిరియల్ కొని మాకు నప్పే విధంగా వివిధ రకాల డిజైన్లలో కుట్టేది. చిన్నప్పటి నుంచి అలా పెరిగిన నేను.. అమ్మ కుట్టే డ్రస్సులు మాకే కాదు అందరికి నచ్చుతాయి. వీటిని ఎవరైనా కొంటారు అనిపించేది. అలా అమ్మ కుట్టినవి కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో మంచి స్పందన వచ్చేది. ఈ రోజు పెట్టిన ఫోటోలు, వీడియోలలో ఉన్న చీరలు డ్రెస్‌లు మరుసటి రోజుకు అమ్ముడయ్యేవి. వేరే బ్రాండ్లు తమ వ్యాపారాన్ని ప్రమోట్ చేసేందుకు మోడల్స్‌తో మోడలింగ్ చేయిస్తుంటారు. కానీ మేము అలాకాదు. మానాన్న గారి ప్రోత్సహంతో మేము డిజైన్ చేసిన బట్టలను వేసుకుని డ్యాన్స్ వేస్తూ మార్కెటింగ్ చేసేవారం. దీనికోసం గతేడాది ఒక స్టూడియో తీసుకున్నాం. దాన్లో నా ఫ్రెండ్స్ కొంతమందితో రూపొందించినlవస్త్రాలు కుట్టి పదినుంచి పదిహేను నిమిషాల వీడియోను షూట్ చేసేవాళ్లం. వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో కస్టమర్ల నుంచి లైక్‌లతోపాటు వేలాది ఆర్డర్లు వచ్చేవి. దీంతో ఈ ఐడియా వర్క్ అవుట్ అవుతుందనిపించింది. ఇక అప్పటి నుంచి అలా కొనసాగిస్తున్నాము’’ అంటూ మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి చెప్పింది లేఖిని. -
మెడలో మెరిసే ఫ్యాబ్రిక్ పెయింటింగ్
ఫ్యాబ్రిక్ పెయింటింగ్ గురించి మనకు తెలిసిందే. కానీ, పెయింటింగ్‌ను ఇలా మెడలో వేసుకోవడం మాత్రం కొత్తగానే ఉంటుంది. అందుకే ఆధునికత కోరుకునేవారి మెడలో పెయింటింగ్ అందంగా ఇమిడిపోయింది. ఏదైనా ఒక పలచని కార్డ్ బోర్డును ఎంచుకోవాలి. దానికి అందంగా ముఖాకృతులు, పువ్వులు, లతలు, దేవతామూర్తులు.. ఇలా ఇష్టానుసారం పెయింటింగ్ వేసుకోవాలి. దానికి గట్టి దారాలు, రంగు రంగుల పూసలు, గవ్వలు, చిన్న చిన్న అద్దాలు, మువ్వలు.. జత చేస్తే.. ఇలా అందమైన హారాలు సిద్ధం అయిపోతాయి. మీరూ వీటిని సులువుగా తయారుచేసుకోవచ్చు. లేదంటే.. ఆన్లైన్, హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్లలో కొనుగోలు చేయచ్చు. డిజైన్ అమరికను బట్టి వంద రూపాయల నుంచి వీటి ధరలు ఉన్నాయి. -
అర్వింద్ ఫ్యాషన్స్ లిస్టింగ్
న్యూఢిల్లీ: అర్వింద్ కంపెనీ నుంచి విడివడిన(డీమెర్జ్ అయిన) అర్వింద్ ఫ్యాషన్స్ స్టాక్ మార్కెట్లో శుక్రవారం లిస్ట్ అయింది. లాల్‌భాయ్ గ్రూప్‌నకు చెందిన ఈ దుస్తులు, యాక్సెసరీల కంపెనీ రూ.592 వద్ద స్టాక్ మార్కెట్లో లిస్టయింది. 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.621 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,603 కోట్లుగా నమోదైంది. అంతర్జాతీయ బ్రాండ్లు–టామీ హిల్ఫిగర్, కాల్విన్ క్లెయిన్, యూస్ పోలో, అసోసియేషన్, యారో తదితర అంతర్జాతీయ బ్రాండ్ల దుస్తులను ఈకంపెనీ విక్రయిస్తోంది. ఈ కంపెనీ అన్లిమిటెడ్ పేరుతో దుస్తుల రిటైల్ చెయిన్‌ను, సెఫోరా పేర్లతో సౌందర్య ఉత్పత్తుల విక్రయాలను నిర్వహిస్తోంది. అర్వింద్ కంపెనీ.. బ్రాండెడ్ దుస్తుల వ్యాపారాన్ని అర్వింద్ ఫ్యాషన్స్ పేరుతో, ఇంజినీరింగ్ విభాగాన్ని అనుప్ ఇంజినీరింగ్ పేరుతో డీమెర్జ్ చేసింది. ఈ నెల 1న అనుప్ ఇంజినీరింగ్ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్టయింది. ఫెయిర్ వేల్యూ నిర్ణయంలో గందరగోళం.. కొత్తగా ఒక కంపెనీ స్టాక్ ఎక్సే్చంజ్‌లో లిస్ట్ అయ్యేటప్పుడు స్టాక్ ఎక్సే్చంజ్‌లు ‘ప్రి–ఓపెన్ యూజింగ్ కాల్ ఆక్షన్’ను నిర్వహిస్తాయి. 45 నిమిషాల పాటు జరిగే ఈ ధర అన్వేషణ ప్రక్రియలో ఇన్వెస్టర్లు ఎంత ధరకు ఈ షేర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో బిడ్లు దాఖలు చేస్తారు. ఎక్కువ మంది బిడ్ చేసిన ధరను ప్రారంభ ధరగా నిర్ణయిస్తారు. ఈ కంపెనీ ప్రారంభ ధరను స్టాక్ ఎక్సే్చంజ్‌లు రూ.590గా నిర్ణయించాయి. కాగా అర్వింద్ ఫ్యాషన్స్ షేర్‌కు సరైన విలువ(ఫెయిర్ వేల్యూ) నిర్ణయంలో కొంత గందరగోళం నెలకొన్నది. ఈ కంపెనీ ఫెయిర్ వేల్యూ రూ.900 నుంచి రూ.1,300 రేంజ్లో ఉండగలదని అంచనాలున్నాయి. అయితే ధర అన్వేషణ ప్రక్రియలో లోపాల వల్ల ఫెయిర్ వేల్యూ చాలా తక్కువగా రూ.331గా నిర్ణయమైందని బ్రోకరేజ్ సంస్థలు అంటున్నాయి. ఫెయిర్ వేల్యూ మరింత ఎక్కువగా ఉండాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. ఫెయిర్ వేల్యూ రూ.1,400 గా ఉండాలని యాక్సిస్ క్యాపిటల్ పేర్కొంది. ఈ విషయమై కంపెనీ స్టాక్ ఎక్సే్చంజ్‌లకు ఫిర్యాదు చేసింది. -
న్యూ ఇయర్ స్టయిల్స్
►న్యూ ఇయర్ స్టయిల్స్కొత్త ఏడాదికి కొత్త లుక్‌ను ఇచ్చే స్టెయిల్ స్టేట్మెంట్ అమ్మాయిల ఫ్యాషన్స్లోనే ఉంటుంది. ఈ జనవరి ఫస్ట్‌కి మీరేమిటో చూపించండి. ►బాటమ్‌లలో ఇప్పటికీ చుడీ లెగ్గింగ్స్దే ఫస్ట్ ప్లేస్ అయినప్పటికీ ప్రత్యేక వేడుకలలో టులిప్ ప్యాంట్ అనే ధోతీ సందడి చేస్తోంది. పెప్లమ్ టాప్, కఫ్తాన్, షార్ట్ కుర్తీ.. ఇలా ధోతీ ప్యాంట్ విభిన్నరకాల టాప్స్‌కి మంచి కాంబినేషన్ అవుతుంది. ►కుచ్చుల గౌన్ అంటే మనదగ్గర వెస్ట్రన్వేర్గానే ప్రసిద్ధి. పాశ్చాత్య వివాహ వేడుకలలో కనిపించే ఈ తరహా గౌనులు ఇప్పుడు మన దగ్గరా కనువిందుచేస్తున్నాయి. ఇవి వెస్ట్రన్ పార్టీలలోనే కాకుండా ఎంగేజ్మెంట్, సంగీత్ వంటి సంప్రదాయ వివాహ వేడుకల్లో డిజైనర్ కుచ్చులు గౌన్లు వావ్ అనిపిస్తున్నాయి. -
ఇవాంక ఇలవంక
ఇప్పుడు అంతటా ఇవాంక ఫీవర్ రన్ అవుతోంది. ఆమె వస్త్రధారణ ఆ దేశంలోనే కాదు ఈ దేశం వారినీ కట్టిపడేస్తోంది. వంకలు పెట్టడానికి వీలులేని విధంగా ఉండే ఆమె స్టైల్ ఫ్యాషన్ వేదికల మీదా వహ్వా అనిపిస్తోంది. ఇవాంక ట్రంప్ నగరానికి వస్తున్నవేళ ఆమె వస్త్రధారణపై మనమూ ఓ లుక్కేద్దాం. మన స్టైల్లోనూ కొన్ని మార్పులు చేసుకుందాం. ఇది చలి కాలం కాబట్టి చాలా వరకు స్వెటర్‌తో సరిపెట్టేస్తారు. స్వెటర్ ఎంపికలోనూ మనదైన ముద్ర కనిపించాలి. ఇందుకు ఇప్పుడు ఎన్నో స్వెటర్ డిజైన్స్ మన ముందుంటున్నాయి. ఒక షర్ట్ టైప్వి మాత్రమే కాకుండా శాలువాతో చేసే డిజైన్స్, లాంగ్ స్లీవ్స్ మాత్రమే వచ్చే మిగతా భాగాన్ని కప్పి ఉంచేలాంటివి ఎంచుకోవాలి. రంగులు, ప్రింట్లు, కట్, డిజైన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఫ్రాక్లా కనిపిస్తున్న ప్లెయిన్ ఊలు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ట్రెంచ్ కోటు ఇది. దీనికి బంగారు రంగు పెద్ద పెద్ద బటన్స్ ఉపయోగించడం, నేవీ బ్లూ కలర్ కావడంతో రాయల్ లుక్ వచ్చేసింది. బాటమ్‌గా వైట్ స్లాక్స్ ధరించారు. ఈ కాంబినేషన్ అఫీషియల్ వర్క్స్‌కి బాగా సూటవుతుంది. ఇది పూర్తిగా క్యాజువల్‌వేర్. క్లాస్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్న ప్యాంట్, లాంగ్‌స్లీవ్స్ ఉన్న వైట్ టాప్ సింపుల్‌గానూ గ్రేస్గానూ ఉంటుంది. సింపుల్ యాక్ససరీస్ ధరిస్తే హైలైట్ అవుతారు. గ్రే కలర్ ప్యాంట్‌సూట్ డ్రెస్ ఇది. వైట్ కాలర్, మోనోక్రామ్ కలర్, చిన్న చిన్న పోల్కాడాట్ ప్రింట్లు ఉన్న స్లింగ్ బ్యాక్ హీల్స్ ఈ గెటప్‌ని హైలైట్ చేశాయి. సాయంకాలాలు హాజరయ్యే గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ పార్టీలకు ఈ స్టైల్ బాగుంటుంది. నేవీ బ్లూ, గ్రీన్ కాంబినేషన్లతో డిజైన్ చేసిన స్కర్ట్, దీనికి ఇచ్చిన హై స్లిట్, బ్లౌజ్ ప్యాటర్న్లు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి మీదకు వాడే యాక్ససరీస్ కూడా ఫంకీ, స్టైలిష్ జువెల్రీని ఎంచుకోవాలి. ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ లుక్‌కి స్ట్రాపీ బ్లాక్ శాండల్స్, లెదర్ బెల్ట్ ఈ లుక్‌ని హైలైట్ చేసింది. ఫ్లోరల్ లేదా త్రీడీ ప్రింట్ డిజైన్స్ ప్రపంచమంతటా ట్రెండ్‌లో ఉన్నవే. ఇలాంటి సింగిల్ పీస్ గ్లౌన్లు క్యాజువల్ వేర్‌గానూ, చిన్న చిన్న గెట్ టుగెదర్ పార్టీలకు స్టైలిష్‌గానూ, కంఫర్ట్గానూ ఉంటాయి. ఫ్యాబ్రిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇవన్నీ కార్పోరేట్ లుక్స్. క్యాజువల్ మీటింగ్స్, ఆఫీస్ మీటింగ్స్‌కి ఈ తరహా డ్రెస్సింగ్ బాగుంటుంది. ఇలా ఎంచుకున్న వాటిలో డార్క్, సాలీడ్ కలర్స్ ముఖ్యంగా గ్రీన్, నేవీ బ్లూ, బ్లాక్.. ఉంటాయి. వీటిలోనూ మళ్లీ బ్రైట్ కలర్స్ తీసుకుంటారు. ఈ డ్రెస్‌కి బూడిద, పసుపు రంగు ఫ్యాబ్రిక్స్‌తో డిజైన్ చేశారు. ఇది క్యాజువల్ వేర్‌గా పనికి వచ్చే సింగిల్‌పీస్ డ్రెస్ ఇది. షర్ట్ టైప్ మోడల్ కట్ని దీనికి అప్లై చేశారు. స్లీవ్‌లెస్, షర్ట్ బటన్స్, లెదర్ బెల్ట్ ఈ గెటప్‌ని హైలైట్ చేశాయి. ప్లెయిన్, లైట్ కలర్ పెన్సిల్ కట్ స్కర్ట్. దీనికి కాంట్రాస్ట్‌గా బ్లాక్ సీక్వెన్స్ తో ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. దీని మీదకు హై కాలర్ నిటెడ్ షర్ట్ ధరిస్తే ఆఫీస్ మీటింగ్స్‌లో అదరహో అనిపిస్తారు. అలాగే సింపుల్ జువెల్రీ, హై హీల్స్ ధరిస్తే అందంగా కనిపిస్తారు. -
అమ్మో.. బాపుగారి బొమ్మో..