ఇప్పుడు అంతటా ఇవాంక ఫీవర్ రన్ అవుతోంది. ఆమె వస్త్రధారణ ఆ దేశంలోనే కాదు ఈ దేశం వారినీ కట్టిపడేస్తోంది. వంకలు పెట్టడానికి వీలులేని విధంగా ఉండే ఆమె స్టైల్ ఫ్యాషన్ వేదికల మీదా వహ్‌వా అనిపిస్తోంది. ఇవాంక ట్రంప్ నగరానికి వస్తున్నవేళ ఆమె వస్త్రధారణపై మనమూ ఓ లుక్కేద్దాం. మన స్టైల్‌లోనూ కొన్ని మార్పులు చేసుకుందాం.
ఇది చలి కాలం కాబట్టి చాలా వరకు స్వెటర్‌తో సరిపెట్టేస్తారు. స్వెటర్ ఎంపికలోనూ మనదైన ముద్ర కనిపించాలి. ఇందుకు ఇప్పుడు ఎన్నో స్వెటర్ డిజైన్స్ మన ముందుంటున్నాయి. ఒక షర్ట్ టైప్‌వి మాత్రమే కాకుండా శాలువాతో చేసే డిజైన్స్, లాంగ్ స్లీవ్స్ మాత్రమే వచ్చే మిగతా భాగాన్ని కప్పి ఉంచేలాంటివి ఎంచుకోవాలి. రంగులు, ప్రింట్లు, కట్, డిజైన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఫ్రాక్‌లా కనిపిస్తున్న ప్లెయిన్ ఊలు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ట్రెంచ్ కోటు ఇది. దీనికి బంగారు రంగు పెద్ద పెద్ద బటన్స్ ఉపయోగించడం, నేవీ బ్లూ కలర్ కావడంతో రాయల్ లుక్ వచ్చేసింది. బాటమ్‌గా వైట్ స్లాక్స్ ధరించారు. ఈ కాంబినేషన్ అఫీషియల్ వర్క్స్‌కి బాగా సూటవుతుంది.
ఇది పూర్తిగా క్యాజువల్‌వేర్. క్లాస్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్న ప్యాంట్, లాంగ్‌స్లీవ్స్ ఉన్న వైట్ టాప్ సింపుల్‌గానూ గ్రేస్‌గానూ ఉంటుంది. సింపుల్ యాక్ససరీస్ ధరిస్తే హైలైట్ అవుతారు.
గ్రే కలర్ ప్యాంట్‌సూట్ డ్రెస్ ఇది. వైట్ కాలర్, మోనోక్రామ్ కలర్, చిన్న చిన్న పోల్కాడాట్ ప్రింట్లు ఉన్న స్లింగ్ బ్యాక్ హీల్స్ ఈ గెటప్‌ని హైలైట్ చేశాయి.
సాయంకాలాలు హాజరయ్యే గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ పార్టీలకు ఈ స్టైల్ బాగుంటుంది. నేవీ బ్లూ, గ్రీన్ కాంబినేషన్‌లతో డిజైన్ చేసిన స్కర్ట్, దీనికి ఇచ్చిన హై స్లిట్, బ్లౌజ్ ప్యాటర్న్‌లు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటి మీదకు వాడే యాక్ససరీస్ కూడా ఫంకీ, స్టైలిష్ జువెల్రీని ఎంచుకోవాలి. ప్రత్యేకంగా కనిపిస్తారు. ఈ లుక్‌కి స్ట్రాపీ బ్లాక్ శాండల్స్, లెదర్ బెల్ట్ ఈ లుక్‌ని హైలైట్ చేసింది.
ఫ్లోరల్ లేదా త్రీడీ ప్రింట్ డిజైన్స్ ప్రపంచమంతటా ట్రెండ్‌లో ఉన్నవే. ఇలాంటి సింగిల్ పీస్ గ్లౌన్లు క్యాజువల్ వేర్‌గానూ, చిన్న చిన్న గెట్ టుగెదర్ పార్టీలకు స్టైలిష్‌గానూ, కంఫర్ట్‌గానూ ఉంటాయి. ఫ్యాబ్రిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఇవన్నీ కార్పోరేట్ లుక్స్. క్యాజువల్ మీటింగ్స్, ఆఫీస్ మీటింగ్స్‌కి ఈ తరహా డ్రెస్సింగ్ బాగుంటుంది. ఇలా ఎంచుకున్న వాటిలో డార్క్, సాలీడ్ కలర్స్ ముఖ్యంగా గ్రీన్, నేవీ బ్లూ, బ్లాక్.. ఉంటాయి. వీటిలోనూ మళ్లీ బ్రైట్ కలర్స్ తీసుకుంటారు. ఈ డ్రెస్‌కి బూడిద, పసుపు రంగు ఫ్యాబ్రిక్స్‌తో డిజైన్ చేశారు.
ఇది క్యాజువల్ వేర్‌గా పనికి వచ్చే సింగిల్‌పీస్ డ్రెస్ ఇది. షర్ట్ టైప్ మోడల్ కట్‌ని దీనికి అప్లై చేశారు. స్లీవ్‌లెస్, షర్ట్ బటన్స్, లెదర్ బెల్ట్ ఈ గెటప్‌ని హైలైట్ చేశాయి.
ప్లెయిన్, లైట్ కలర్ పెన్సిల్ కట్ స్కర్ట్. దీనికి కాంట్రాస్ట్‌గా బ్లాక్ సీక్వెన్స్ తో ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. దీని మీదకు హై కాలర్ నిటెడ్ షర్ట్ ధరిస్తే ఆఫీస్ మీటింగ్స్‌లో అదరహో అనిపిస్తారు. అలాగే సింపుల్ జువెల్రీ, హై హీల్స్ ధరిస్తే అందంగా కనిపిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment