అటు ఫ్యాషన్‌ని, ఇటు ఫిట్‌నెస్‌ని... మిళితం చేసి ఫ్యాషనబుల్ ఫిట్‌నెస్ డివైజ్‌లపై ఆసక్తి ప్రదర్శిస్తోంది యువతరం. స్మార్ ్టరింగ్స్ నుంచి ఫిట్‌నెస్ ట్రాకర్‌ల వరకు ఎన్నో డివైజ్‌లను ఇష్టపడుతున్నారు యువత.
యువతరంలో పెరుగుతున్న సెల్ఫ్–ట్రాకింగ్ కల్చర్, బయోఫీడ్ బ్యాక్‌ను దృష్టిలో పెట్టుకొని శాంసంగ్, యాపిల్ లాంటి దిగ్గజ సంస్థలు ఫిట్‌నెస్ డివైజ్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి...
బాలీవుడ్ నటి ఆలియా భట్‌ను ఫిట్‌నెస్ డివైజ్‌ల గురించి అడిగితే బోలెడు విషయాలు చెబుతుంది. ఆమెకు ఇష్టమైనది ఒరా రింగ్. ఫిన్‌ల్యాండ్‌లో తయారైన ఈ సెన్సర్–లోడెడ్ టైటానియమ్ రింగ్‌కు యువతరంలో ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. తన బయో–ట్రాకింగ్ సామర్థ్యంతో ‘ఒరా’కు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడింది.
దీన్ని దృష్టిలో పెట్టుకొని యాపిల్, శాంసంగ్‌లాంటి టెక్ దిగ్గజాలు తమదైన సొంత వెర్షన్‌ను సిద్ధం చేస్తున్నాయి.
స్మార్ట్ రింగ్‌లకు యువతంలోని క్రేజ్‌ను గమనించి నాయిస్, అల్ట్రాహ్యుమన్, పై రింగ్‌లాంటి ఎన్నో కంపెనీలు రంగంలోకి దిగాయి. ‘మా స్మార్ట్‌రింగ్స్ లాంచ్ అయిన 24 గంటల్లోనే అమ్ముడు అయ్యాయి’ అంటున్నాడు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ ‘బోట్’ కో–ఫౌండర్ అమన్ గురై.
వివిధ కంపెనీల స్మార్ట్‌రింగ్‌లు హార్ట్‌రేట్ నుంచి ఆక్సిజన్ ఫ్లో వరకు మానిటర్ చేస్తాయి.
నాయిస్, అల్ట్రాహ్యుమన్, పీ రింగ్‌లాంటి కంపెనీలు అందుబాటు ధరల్లో ఉండే స్మార్ట్ రింగ్స్, గ్లూకోజ్ మానిటరింగ్ డివైజ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. మన దేశంలో యువతరాన్ని భయపెడుతున్న వ్యాధి డయాబెటిస్.
మన దేశంలో యువతరంలో డయాబెటిస్ పెరుగుతున్న నేపథ్యంలో టైప్ 1, టైప్ 2 డయాబెటిస్‌ను దృష్టిలో పెట్టుకొని అల్ట్రాహ్యూమన్, కంటూర్ ప్లస్‌లాంటి గ్లూకోజ్ మానిటర్ డివైజ్‌లు వచ్చాయి.
‘వ్యక్తిగత ఆరోగ్యం గురించి శ్రద్ధ పెరిగినప్నుడు హెల్త్‌కేర్ టూల్స్‌కు ప్రాధాన్యత పెరగడం అనేది సహజ విషయం’ అంటున్నాడు అమన్ గురై.
ఫిట్‌నెస్ టూల్స్ గురించి యూత్‌లో ఆసక్తి పెరగడం ఆహ్వానించదగిన పరిణామం అంటుంది నేషనల్ ఫుట్‌బాల్ టీమ్ గోల్‌కీపర్, షీ కిక్స్ ఫుట్‌బాల్ అకాడమీ వ్యవస్థాపకురాలు అదితి చౌహాన్.
‘వ్యాయామ సమయంలో నా శరీరం పనితీరును, నిద్రను పర్యవేక్షించడానికి నేను యాపిల్ వాచ్‌ను ఉపయోగిస్తాను. సమయానికి నిద్రపోవడం లాంటి వాటిని ఇది సూచిస్తుంది’ అంటుంది అదితి.
స్టెప్స్, ఫిజికల్ యాక్టివిటీలను ట్రాక్ చేసే ఫిట్‌నెస్ వాచ్‌లను ధరించడానికి యువతరం ఆసక్తి ప్రదర్శిస్తోంది.
‘ఒకప్పుడు నాకు ఆరోగ్య విషయాలపై శ్రద్ధ ఉండేది. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చిన తరువాత నాలో మార్పు వచ్చింది. బయోఫీడ్ బ్యాక్‌పై ఆసక్తి పెరిగింది. దీంతో రకరకాల గ్యాడ్జెట్స్‌ను వాడుతున్నాను’ అంటుంది బెంగళూరుకు చెందిన ఎంసీఏ స్టూడెంట్ సజిత.
హెల్త్‌గ్యాడ్జెట్స్‌ను ప్రేమించేవారితో ΄ాటు వాటి అతి వినియోగాన్ని విమర్శిస్తున్న వారు కూడా యూత్‌లో ఉన్నారు.
‘పందశాతం కచ్చితత్వం కోసం సర్టిఫైడ్ టూల్స్ మాత్రమే వాడాలి. లేక΄ోతే అనవసర ఆందోళనకు దగ్గర కావాల్సి వస్తుంది. గ్యాడ్జెట్‌ల వాడకంలో ఆచితూచి వ్యవహరించాలి’ అంటున్నారు నిపుణులు.
‘వెల్‌నెస్ వేరబుల్ టెక్నాలజీదే భవిష్యత్’ అనే మాట వినిపిస్తున్నప్పటికీ వేలం వెర్రి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా యువతరంపై ఉంది.
Comments
Please login to add a commentAdd a comment