అబ్బాయిలకు స్కర్ట్ లు.. అమ్మాయిలకు ప్యాంట్లు!
ప్రభుత్వ పాఠశాలల్లో అబ్బాయిలు, అమ్మాయిలు వారికి నచ్చిన దుస్తులను వేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ యూకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో అక్కడి ట్రాన్స్ జండర్స్ భారీ ఊరట లభించనుంది. గత కొంతకాలంగా యూకేలో నువ్వు అబ్బాయివా? అమ్మాయివా? అనే వేధింపులు వీరిపై పెరిగిపోతుండటంతో అక్కడ కొన్ని సామాజిక సంస్థలు పాఠశాలల్లో బట్టలపై నిబంధనలు తీసేయాలని లింగసమానత్వం పేరుతో డిమాండ్ పెరిగింది.
అయిదేళ్లు దాటిన పాఠశాలకు వెళ్లే అమ్మాయైనా, అబ్బాయైనా.. వారికి నచ్చిన దుస్తులు అంటే, అబ్బాయిలు స్కర్ట్ లు, అమ్మాయిలు ప్యాంట్లు వేసుకోవచ్చు. అంతేకాదు ప్రభుత్వం నిర్వహించే దాదాపు 80 స్కూళ్లలో దీనిని అమలు కూడా చేస్తోంది. దీంతో స్కూళ్లలో నలుపు, బూడిద రంగుల స్కర్ట్ లను, అమ్మాయిలు ప్యాంట్లను వేసుకునేందుకు వీలు ఏర్పడింది.