’కురచ దుస్తులు వేసుకోవద్దు’
ఆగ్రా: కురచ దుస్తులు ధరించవద్దని, రాత్రి సమయంలో ఒంటరిగా తిరగొద్దని టూరిస్టులకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సూచించారు. పర్యాటల భద్రత గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ...
‘విమానాశ్రయంలో దిగగానే పర్యాటకులకు వెల్కం కిట్ అందజేస్తాం. పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కార్డు కూడా ఇందులో ఉంటుంది. చిన్న పట్టణాల్లో రాత్రి సమయంలో ఒంటరిగా తిరగొద్దు. కురచ దుస్తులు ధరించొద్దు. మీరు వినియోగించే కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఫొటో తీసి మీ స్నేహితులకు పంపాలనే జాగ్రత్తలు ఇందులో రాసివుంటాయ’ని మహేశ్ శర్మ తెలిపారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. సమాజ్వాది పార్టీ రెండుగా చీలిపోయిందన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి అవినీతిలో కూరుకుపోయారని, ఆమెకు జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు.