Mahesh Sharma
-
‘దేశంలో ఏ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లేదు’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఏ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ లేదని పర్యావరణ శాఖ సహాయ మంత్రి డాక్టర్ మహేష్ శర్మ సోమవారం రాజ్య సభలో స్పష్టం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా మంత్రి ఈ విషయం వెల్లడించారు. డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్ఈఈ) అనే అంతర్జాతీయ సంస్థ ఈ సర్టిఫికేషన్‌ను ప్రదానం చేస్తుందని మంత్రి చెప్పారు. 33 అంశాల ప్రాతిపదికన ఆ సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పుడే బీచ్‌కు బ్లూఫ్లాగ్ సర్టిఫికేషన్ లభిస్తుంది. అందులో నీటి నాణ్యత, పర్యావరణ నిర్వహణ, రక్షణ, భద్రతా చర్యలు, పర్యావరణంపై చైతన్యం వంటివి ప్రధాన ప్రాతిపదకలుగా ఉంటాయని తెలిపారు. సమగ్ర కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ కింద దేశంలోని బీచ్‌లను అంతర్జాతీయ స్థాయికి అభివృద్ధి చేసే ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం 13 కోస్తా తీర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల సమ్మతి, సంప్రదింపులతో రాష్ట్రానికి ఒక బీచ్‌ను పైలట్ ప్రాజెక్ట్ గా అభివృద్ధి చేయడం జరుగుతుందని వివరించారు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే పనులకు అనుమతులు రావాలి ‘అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే పనులకు పర్యావరణ, అటవీ, వన్యప్రాణులు ఇతర అనుమతులు రావలసి ఉంది. అవసరమైన అనుమతులన్నింటినీ పొందిన తర్వాత ఎక్స్‌ప్రెస్‌వే పనులు ప్రారంభమవుతాయి’ అని రోడ్డు రవాణా, రహదారుల శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయాన్ని తెలిపారు.చట్టబద్దమైన అనుమతులన్నింటినీ సంపాదించుకోవడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు ఆయన చెప్పారు. రావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే అభివృద్ధికి సంబంధించి గత ఏడాది ఆగస్టు 13, అక్టోబర్ 23 తేదీలలో తమ మంత్రిత్వ శాఖ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాధికారులతో రెండు దఫాలుగా చర్చలు జరిపినట్లు మంత్రి చెప్పారు. ‘ఎక్స్‌ప్రెస్‌వే మొదట 100 మీటర్ల వెడల్పుతో నాలుగు లేన్ల రహదారిగా 384 కిలోమీటర్ల మేర నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. భవిష్యత్తులో పెరిగే ట్రాఫిక్ దృష్ట్యా దీనిని 8 లేన్ల రహదారిగా విస్తరించే సౌలభ్యం కూడా కల్పించడం జరిగింది. ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి అవసరమైన భూసేకరణ ఖర్చులో 50 శాతం భరించడానికి, ఇందులో ప్రభుత్వ భూమిని ఉచితంగా కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది’ అని మంత్రి చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాలలో చేపడతున్న ఈ తరహా ప్రాజెక్ట్‌లకు డీపీఆర్ సిద్ధం అయ్యేనాటికి రాష్ట్ర ప్రభఉత్వం 50 శాతం భూమిని సేకరించి ఉంటే ప్రాజెక్ట్‌ను సత్వరమే చేపట్టడం జరుగుతుందని మంత్రి తెలిపారు. అలాగే ప్రాజెక్ట్ పనులు ప్రారంభించే నాటికి కనీసం 90 శాతం భూసేకరణ జరిగి ఉండాలని కూడా తెలిపారు. -
13 ‘జూ’ల గుర్తింపు రద్దు
న్యూఢిల్లీ: రెండు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు సహా వివిధ రాష్ట్రాల్లోని మొత్తం 13 జంతు ప్రదర్శన శాల (జూ)ల గుర్తింపు రద్దయ్యింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈ జంతు ప్రదర్శన శాలలు పనిచేయకపోవడం, అక్కడి జంతువుల ఆరోగ్యం కోసం కేంద్ర జూ సంస్థ (సీజెడ్ఏ) వాటి గుర్తింపును రద్దు చేసిందని పర్యావరణ శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ శుక్రవారం లోక్‌సభకు చెప్పారు. గుర్తింపు రద్దయిన వాటిలో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఉన్న డీర్ పార్క్ ఎన్సీఎఫ్ఎల్, తెలంగాణలోని డీర్ పార్క్ కేశోరాం సిమెంట్, సంఘీ మినీ జూ, కర్ణాటకలోని తుంగభద్ర మినీ జూ, శ్రీ క్షేత్ర సొగల్ సౌండట్టి, తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న వీఓసీ పార్క్ మినీ జూ మొదలగునవి ఉన్నాయి. -
ఏడాదిలో పీఎంల మ్యూజియం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో దేశ ప్రధానమంత్రులతో కూడిన మ్యూజియం ఏడాదిలోగా పూర్తవనుంది. దీనిని తీన్‌మూర్తి ఎస్టేట్స్‌లో ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ప్రధానమంత్రిగా మోదీ హయాంలో చేపట్టిన కార్యక్రమాల వివరాలను కూడా పొందుపరచనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మహేశ్ శర్మ సోమవారం వెల్లడించారు. దీనిని రూ. 271 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. 10,975,36 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ మ్యూజియం ఇప్పటిదాకా ఫ్రధానమంత్రి పదవుల్లో ఉన్నవారు చేపట్టిన కార్యక్రమాల వివరాలకు వేదికవనుంది. బేస్మెంట్ కలిపి మొత్తం మూడు ఫ్లోర్లను నిర్మిస్తారు. ఇందులో ప్రతి ఫ్లోర్లోనూ గ్యాలరీలు ఉంటాయి. ‘సంవత్సరంలోగా దీనిని నిర్మిస్తాం. చరిత్ర అంతా ఇందులో అందుబాటులో ఉంటుంది’ అని శర్మ ఈ సందర్బంగా చెప్పారు. దీనిని ఇప్పటిదాకా పీఎం పదవుల్లో కొనసాగినవారందరికీ అంకితం చేస్తారా అని అడగ్గా అందుకు అవునని ఆయన జవాబిచ్చారు. మన్మోహన్ అభ్యంతరం చెప్పినా... మ్యూజియం నిర్మాణ ప్రతిపాదనపై మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. గత నెలలో ప్రధానమంత్రి మోదీకి ఓ లేఖ కూడా రాశారు. తీన్‌మూర్తి భవన్... వాస్తవానికి నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్)అని, ఇప్పుడు మ్యూజియాన్ని నిర్మించడమంటే ఈ మెమోరియల్ ఏర్పాటు ఉద్దేశాన్ని దెబ్బతీయడమే అవుతుందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఎన్ఎంఎంఎల్ జోలికి వెళ్లొద్దని కోరారు. ప్రస్తుతమున్న మ్యూజియం... చరిత్రకు, వారసత్వ సంపదకు ప్రతీక అని మన్మోహన్ తన లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఆయన విన్నపాన్ని ఖాతరు చేయలేదు. పీఎంలు వ్యక్తులు కాదు: శర్మ అయితే కాంగ్రెస్ అభ్యంతరాన్ని కేంద్ర మంత్రి శర్మ తోసిపుచ్చారు. ప్రధానులు వ్యక్తులు కాదని, వారు సంస్థల వంటివారని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ముగ్గురు మాజీ ప్రధానులకే స్మారకాలు ఉన్నాయని, జవహర్లాల్ నెహ్రూ, లాల్‌బహదుర్ శాస్త్రి, ఇందిరాగాంధీలకు మాత్రమే పరిమితమయ్యాయని అన్నారు. ఈ మ్యూజియం భావి ప్రధానులకు కూడా చోటు కల్పిస్తుందని ఆయన వివరించారు. ఈ స్థలం ప్రభుత్వానిదని, కొంతభాగాన్ని ఎన్ఎంఎంఎల్కు కేటాయించారని, 23 ఎకరాల భూమి ఇంకా ఉందని, అందువల్ల ఆ స్థలాన్ని వాడుకోవాలని నిర్ణయించామని, ఇందులో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. -
దాల్మియాకు ఎర్రకోట
న్యూఢిల్లీ: ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట నిర్వహణ బాధ్యతలను దాల్మియా భారత్ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అడాప్ట్ ఎ హెరిటేజ్ (ఓ చారిత్రక కట్టడాన్ని దత్తత తీసుకోండి) పథకంలో భాగంగా ఎర్రకోట, వైఎస్సార్ కడప జిల్లా ‘గండికోట’ కోట నిర్వహణ బాధ్యతలను నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక శాఖ, పురావస్తు శాఖలతో దాల్మియా భారత్ గ్రూపు ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పంద కాలం ఐదేళ్లు. ఎర్రకోట కోసం తీవ్రమైన పోటీ నెలకొనగా.. ఇండిగో, జీఎంఆర్ గ్రూపులను వెనక్కు నెట్టి రూ. 25కోట్లకు (ఈ మొత్తాన్ని ఎర్రకోట నిర్వహణకు వెచ్చించాలి) దాల్మియా ఈ కాంట్రాక్టు దక్కించుకుంది. ‘ ఎర్రకోట నిర్వహణ బాధ్యతలు పొందటం ఆనందంగా ఉంది. 30 రోజుల్లో మేం పనిని ప్రారంభించాలి. భారత్‌తో దాల్మియా బ్రాండ్‌ను పెంచుకునేందుకు ఈ అవకాశం దోహదపడుతుంది. ఎర్రకోట వైశాల్యంతో పోలిస్తే చాలా చిన్నగా ఉండే యూరప్‌లోని కొన్ని కట్టడాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తారు. ఆ పద్ధతిలోనే మేం ఎర్రకోటను ప్రపంచ ఉత్తమ కట్టడాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం’ అని దాల్మియా భారత్ సిమెంట్స్ గ్రూప్ సీఈవో మహేంద్ర సింఘీ తెలిపారు. చారిత్రక కట్టడాల నిర్వహణలో ప్రైవేటు, పబ్లిక్ భాగస్వామ్యాన్ని తీసుకువచ్చేందుకు గతేడాది కేంద్ర ప్రభుత్వం అడాప్ట్ ఎ హెరిటేజ్ పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 70 ఏళ్లు ఏం చేశారు?: కేంద్రం ఈ పథకంలో భాగస్వాములైన కంపెనీలు కేవలం డబ్బులు ఖర్చుపెట్టి సదుపాయాలను మెరుగుపరుస్తాయే తప్ప.. పర్యాటకుల నుంచి డబ్బులు వసూలు చేయబోవని కేంద్ర సాంస్కృతిక మంత్రి మహేశ్ శర్మ స్పష్టం చేశారు. కట్టడాలను ప్రైవేటీకరించే ఆలోచన అర్థరహితమని పర్యాటక మంత్రి కేజే అల్ఫోన్స్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ 70 ఏళ్లుగా ఏం చేసింది? అన్ని కట్టడాలు, వాటిలోని వసతులు చాలా దారుణంగా ఉన్నాయి. కొన్ని చోట్ల అసలు వసతులే లేవు. అలాంటిది ఇప్పుడు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. కట్టడాల నిర్వహణ కాంట్రాక్టుల జాబితాలో కుతుబ్ మినార్ (ఢిల్లీ), హంపి (కర్ణాటక), సూర్య దేవాలయం (ఒడిశా), అజంతా గుహలు (మహారాష్ట్ర), చార్మినార్ (తెలంగాణ), కజిరంగా నేషనల్ పార్క్ (అస్సాం) వంటి 95 ప్రముఖ పర్యాటక ప్రాంతాలున్నాయి. కాంగ్రెస్ మండిపాటు ప్రముఖ కట్టడం నిర్వహణను ఓ ప్రైవేటు కంపెనీకి ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్, తృణమూల్, వామపక్ష పార్టీలు ప్రశ్నించాయి. భారత స్వాతంత్య్ర ప్రతీకైన ఎర్రకోట బాధ్యతలను ఇతరులకు ఎలా అప్పగిస్తారని మండిపడ్డాయి. ‘ప్రైవేటు సంస్థకు చారిత్రక కట్టడాన్ని నిర్వహించే బాధ్యతను ఎలా అప్పజెబుతారు? ఇది మీరు (ప్రభుత్వం) చేయలేరా? భారత చరిత్ర పరిరక్షణపై ప్రభుత్వ విధానమేంటి? నిధుల కొరత ఉందా? భారతీయ పురావస్తు విభాగం (ఏఎస్ఐ)కి కేటాయించిన నిధులు మురిగిపోతున్నాయి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రశ్నించారు. -
హరితహారం.. దేశానికే ఆదర్శం
సాక్షి, హైదరాబాద్: తాను హెలికాప్టర్లో వస్తుంటే తెలంగాణలో గ్రీనరీ కనిపించిందని కేంద్ర అటవీ, పర్యావరణ, కల్చరల్ శాఖల మంత్రి డాక్టర్ మహేశ్‌శర్మ అన్నారు. తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అని, రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. శనివారం ఆర్ఎఫ్సీలోని హోటల్లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి క్యాలెండర్, స్టిక్కర్స్‌ను, ఈపీటీఆర్ఐ వార్షిక నివేదికలను మహేశ్‌శర్మ, రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్నతో కలసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్‌శర్మ మాట్లాడుతూ, చారిత్రక ఘట్టాలకు తెలంగాణ నిలువుటద్దమనీ, అందుకే తెలంగాణ రాష్ట్రం పట్ల ప్రధాని నరేంద్రమోదీకి ప్రత్యేక అభిమానం అని చెప్పారు. హరితహారం కార్యక్రమం తెలంగాణ మెడలో మణిహారమని, ఈ కార్యక్రమం దేశానికే ఆదర్శమన్నారు. నాలుగేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటడం అంటే మామూలు విషయం కాదని ఆయన అన్నారు. టూరిజానికి మంచి భవిష్యత్తు ఉందని, టూరిజం ద్వారా తెలంగాణ భవిష్యత్ మార నుందన్నారు. మంత్రి జోగు రామన్న మాట్లా డుతూ సీఎం కేసీఆర్ చేపడుతున్న పథకాలతో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో లైవ్ స్టాక్ హెరిటేజ్ ఫాం నెలకొల్పాలని జోగు రామన్న కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్, పీసీబీ మెంబర్ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ కల్యాణ చక్రవర్తి, పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా పాల్గొన్నారు. -
బడ్జెట్ కోసమే అలా చేశారు!
► ఎంపీ మృతిపై పార్లమెంటరీ కమిటీ విచారణకు విపక్షాల డిమాండ్ ► ముందే అహ్మద్ చనిపోయినట్లు సమాచారం ఉందన్న ఆజాద్ ► లోక్‌సభలో ‘పాతనోట్లుంటే శిక్ష–జరిమానా’ బిల్లు న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశాలు శుక్రవారం గందరగోళంగా మారాయి. గుండెపోటుతో మాజీ మంత్రి, ఐఎంయూఎల్ చీఫ్, ఎంపీ ఈ అహ్మద్ మృతిచెందిన విషయంలో ప్రభుత్వం తీరు సరిగా లేదని, బడ్జెట్ కొనసాగించేందుకే వైద్యులతో తప్పుడు ప్రకటనలు చెప్పించారంటూ విపక్షాలు మండిపడ్డాయి. అటు రోజ్‌వాలీ చిట్‌ఫండ్ స్కాంలో తమ ఎంపీలను అరెస్టు చేయటంతోపాటు సీబీఐని దుర్వినియోగం చేస్తున్నారని తృణమూల్ తీవ్రంగా విరుచుకుపడింది. దీంతో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్య సభ వాయిదా పడింది. శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే.. తృణమూల్ సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. కేంద్రం తమ ఎంపీలపై సీబీఐ ద్వారా ఒత్తిడి పెంచుతోందని నినాదాలు చేశారు. ‘సీబీఐ ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా మారింది. రాజకీయ అవసరాల కోసం కేంద్రం సీబీఐని వినియోగించుకుంటోంది’ అని తృణమూల్ ఎంపీలు విమర్శించారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభమైన వెంటనే ఎంపీ, ఐఎంయూఎల్ అధ్యక్షుడు అహ్మద్‌కు సరైన చికిత్స అందలేదని.. ఆయన మృతిపై కూడా ప్రభుత్వ స్పందన సరిగా లేదని కేరళ ఎంపీలు పార్టీలకు అతీతంగా డిమాండ్ చేశారు. వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. ఈ గొడవ మధ్యే.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు స్పీకర్ ఆదేశించారు. కేంద్ర మంత్రి మహేశ్ శర్మ చర్చను ప్రారంభిస్తుండగానే మళ్లీ సభలో గందరగోళం నెలకొంది. రెండుసార్లు వాయిదా పడినా పరిస్థితిలో మార్పు లేకపోవటంతో.. స్పీకర్ సుమిత్ర మహాజన్ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేశారు. లోక్‌సభ ముందు ‘పాతనోట్లుంటే శిక్ష’ బిల్లు నవంబర్8 నిర్ణయంతో రద్దుచేసిన పాతనోట్లను దాచుకున్నా, బదిలీ చేసినా, తీసుకున్నా క్రిమినల్ చర్యలతోపాటు రూ.10వేల జరిమానా విధించే బిల్లును ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కాగా ఈ బిల్లు అనైతికం, దేశ వ్యతిరేకమని తృణమూల్ కాంగ్రెస్ నేత సుగత రాయ్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై జైట్లీ కూడా ఘాటుగానే స్పందించారు. ఏ ప్రాతిపదికన తృణమూల్ దీన్ని వ్యతిరేకిస్తుందో చెప్పాలన్నారు. అయితే.. ఈ బిల్లు లోక్‌సభ నిబంధనలకు విరుద్ధమని జైట్లీ లోక్‌సభ సభ్యుడు కానందున ఆయనకు నిబంధనలేమీ తెలియవని సుగత రాయ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై అధికార పక్షం అభ్యంతరం వ్యక్తం చేసింది. 70వేల మంది చిన్నారులకు మధుమేహం 2015లో భారతదేశంలో 70వేలకు పైగా చిన్నారులు మధుమేహం బారిన పడ్డారని ప్రభుత్వం లోక్‌సభలో వెల్లడించింది. అటు, ఉగ్రవాదానికి సహకరించే దేశాలపై కఠినంగా వ్యవహరించాలని ఆ దేశాలతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని రాజ్యసభ ఎంపీ ఒకరు ఓ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మద్దతు తెలిపారు. ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలంటూనే.. ‘56 అంగుళాల ఛాతీ ఎక్కడికెళ్లింది’ అని విమర్శించారు. ప్రభుత్వానికి ముందే తెలుసు! జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగం జరుగుతుండగా సెంట్రల్ హాల్లోనే ఎంపీ అహ్మద్ కుప్పకూలిపోయారు. ఫిబ్రవరి 1న ఆయన కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలున్నందున.. సమావేశాలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయన ముందురోజే చనిపోయినా ఇంకా బతికే ఉన్నాడనే సందేశాన్ని ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయని ఖర్గే ఆరోపించారు. అహ్మద్ కూతురు, అల్లుడికి ఆసుపత్రి లోపలకు అనుమతించలేదన్నారు. ఆసుపత్రికి తీసుకెళ్లేటప్పటికే అతను మృతిచెందినట్లు కొందరు డాక్టర్లు తనతో చెప్పారని ఆజాద్ అన్నారు. -
ఆ ప్రధాని పేరు.. మెక్ కల్లమ్ అట!
న్యూజిలాండ్ క్రికెట్ జట్టు భారత దేశంలో పర్యటిస్తోంది. టీమిండియాతో టెస్టు సిరీస్ ముగించుకుని వన్డే సిరీస్ ఆడుతోంది. సరిగ్గా ఇదే సమయంలో అదే దేశ ప్రధానమంత్రి జాన్ కీ కూడా మన దేశంలో పర్యటిస్తున్నారు. రెండు దేశాల మధ్య పర్యాటక సంబంధాల గురించి ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇదే సమావేశంలో మన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ కూడా పాల్గొన్నారు. ఈయన క్రికెట్ మ్యాచ్‌లు మరీ ఎక్కువగా చూస్తున్నారో ఏమో గానీ, ఆ దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి మాట్లాడబోయి.. ''హిజ్ ఎక్సలెన్సీ ప్రైమ్ మినిస్టర్ మెక్ కల్లమ్' అని సంబోధించారు. అది కూడా ఒకసారి కాదు.. రెండుసార్లు అలా అనడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దాని గురించి మాట్లాడుకుంటూ బిజీ అయిపోయారు. న్యూజిలాండ్‌కు పర్యాటక రాయబారి అయిన బాలీవుడ్ స్టార్ సిద్దార్థ మల్హోత్రా మంత్రిగారి చెవిలో ఈ విషయాన్ని ఊదాడు. అయితే న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ మాత్రం ఈ విషయాన్ని పెద్దంత సీరియస్‌గా పట్టించుకోలేదు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య డైరెక్ట్ విమానం నడిపిస్తే రెండు దేశాల పర్యాటకులకు బాగా ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. సదస్సుకు వచ్చినవారికి అచ్చమైన భారతీయ శైలిలో 'నమస్తే.. సత్ శ్రీ అకాల్' అంటూ ఆయన వందనాలు పలికారు. సిద్దార్థ మల్హోత్రా లాంటి యువ నటులు తమ దేశ పర్యాటక రాయబారి కావడం పట్ల సంతోషం ప్రకటించారు. భారత దేశం నుంచి ప్రతియేటా 43 వేల మంది న్యూజిలాండ్ సందర్శనకు వస్తున్నారని చెబుతూ, ఈ సంఖ్య మరింత పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
రామాయణ మ్యూజియానికి 25 ఎకరాలు
న్యూఢిల్లీ: కేంద్రం తలపెట్టిన ‘రామాయణ మ్యూజియం’ ఏర్పాటుకు అయోధ్యలో 25 ఎకరాల స్థలాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. రామజన్మభూమి-బాబ్రీ మసీదు ప్రాంగణానికి 15 కి.మీ. దూరంలో దీన్ని సేకరించింది. కేంద్ర పర్యాటక మంత్రి మహేశ్‌శర్మ మంగళవారం ఈ స్థలాన్ని పరిశీలించే అవకాశముంది. ‘రామాయణ సర్క్యూట్ అడ్వైజరీ బోర్టు’తో పాటు మత పెద్దలతో సమావేశమవుతారు. ఈ మ్యూజియం రాబోయే యూపీ ఎన్నికల్లో బీజేపీ హిందూ ఓట్లను కొల్లగొట్టడానికేనన్న చర్చ జరుగుతోంది. -
జాతీయ స్మారకాల వద్ద పాలిథీన్ నిషేధం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని జాతీయ స్మారక చిహ్నాల వద్ద ఆదివారం నుంచి పాలిథీన్ వాడకంపై నిషేధం విధించారు. స్వచ్ఛభారత్ పథకం ప్రారంభమై ఆదివారానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందుకు గుర్తుగా ఈ నిషేధం అమలులోకి తేనున్నారు. గాంధీ జయంతి కూడా ఈ రోజే కావడం విశేషం. ‘స్వచ్ఛ భారత్ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ అన్ని జాతీయ స్మారక చిహ్నాల వద్ద, పర్యాటక ప్రదేశాలలో గాంధీ జయంతి రోజు నుంచి పాలిథీన్‌ను వాడడాన్ని నిషేధిస్తున్నాం’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ చెప్పారు. అయితే ప్లాస్టిక్ బాటిళ్లను మాత్రం అనుమతిస్తారు. స్మారకచిహ్నాల నుంచి 100 మీటర్ల లోపు పాలిథీన్ వాడరాదు. నిబంధనలు అతిక్రమించే వారికి జరిమానా విధించాలా వద్దా అనే విషయంపై మరో నెల తర్వాత సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటారు. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులను తయారుచేయడాన్ని ప్రభుత్వం మార్చిలోనే నిషేధించింది. -
’కురచ దుస్తులు వేసుకోవద్దు’
ఆగ్రా: కురచ దుస్తులు ధరించవద్దని, రాత్రి సమయంలో ఒంటరిగా తిరగొద్దని టూరిస్టులకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్ శర్మ సూచించారు. పర్యాటల భద్రత గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ... ‘విమానాశ్రయంలో దిగగానే పర్యాటకులకు వెల్కం కిట్ అందజేస్తాం. పర్యాటక ప్రాంతాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే కార్డు కూడా ఇందులో ఉంటుంది. చిన్న పట్టణాల్లో రాత్రి సమయంలో ఒంటరిగా తిరగొద్దు. కురచ దుస్తులు ధరించొద్దు. మీరు వినియోగించే కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఫొటో తీసి మీ స్నేహితులకు పంపాలనే జాగ్రత్తలు ఇందులో రాసివుంటాయ’ని మహేశ్ శర్మ తెలిపారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతూ.. సమాజ్‌వాది పార్టీ రెండుగా చీలిపోయిందన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి అవినీతిలో కూరుకుపోయారని, ఆమెకు జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు. -
క్షమాపణ చెప్పిన కేంద్రమంత్రి
తన వ్యక్తిగత సిబ్బంది ఓ సొసైటీ వాచ్‌మన్‌ను కొట్టడంతో కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేష్ శర్మ క్షమాపణలు చెప్పారు. రాఖీ రోజున తన సోదరి ఇంటికి వెళ్లినప్పుడు ఘజియాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వాచ్‌మన్‌ను కొట్టిన తన వ్యక్తిగత భద్రతాధికారిని వెంటనే సస్పెండ్ చేసినట్లు మహేష్ శర్మ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా పోయింది. ఘజియాబాద్‌లోని ఆషియానా గ్రీన్స్ అనే సొసైటీ వాచ్‌మన్‌ను శర్మ సెక్యూరిటీ అధికారి కొడుతున్న దృశ్యాలను ఫేస్బుక్, వాట్సప్ లాంటి సోషల్ మీడియాలో పలువురు షేర్ చేశారు. దీనిపై క్షమాపణ చెప్పిన కేంద్ర మంత్రి.. తన సెక్యూరిటీ అధికారిని కూడా సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనలను తాను ఎప్పుడూ సమర్థించబోనని, తనకు ఈ విషయం తెలియగానే ఎవరిది తప్పో తెలుసుకోడానికి ప్రయత్నించానని, విషయం తెలియగానే తన సెక్యూరిటీ గార్డును సస్పెండ్ చేసి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను కోరానని చెప్పారు. వాళ్లిద్దరి మధ్య గొడవకు కారణం కూడా తనకు తెలియదని.. అది తెలుసుకుని, చర్య తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులదని అన్నారు. అయితే.. అకారణంగానే తనను కొట్టాడని వాచ్‌మన్ అజయ్ యాదవ్ చెప్పాడు. -
అధికార మదం..!
-
ఏపీలో మూడు విమానాశ్రయాలకు సైటు క్లియరెన్స్
♦ గుజరాత్లో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు సూత్రప్రాయ ఆమోదం ♦ కేంద్ర మంత్రి మహేష్ శర్మ వెల్లడి న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన మూడు విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం సైటు క్లియరెన్సు(ఆయా ప్రాంతాల్లో గుర్తించిన స్థలాలకు అనుమతి)లను ఈ ఏడాది జనవరిలోనే మంజూరు చేసింది. పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ మంగళవారం రాజ్యసభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. సైటు క్లియరెన్స్ లభించిన వాటిలో భోగాపురం(విజయనగరం), దగదర్తి(నెల్లూరు), ఓర్వకల్లు(కర్నూలు) ఉన్నాయి. రాజస్తాన్‌లోని భివాండి(అల్వార్) ఎయిర్‌పోర్టుకు కూడా ఇదే విధమైన అనుమతులు ఇచ్చినట్లు శర్మ తెలిపారు. అదేవిధంగా గుజరాత్‌లోని ధోలెరాలో మరో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. కాగా, భోగాపురంలో కొత్త ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయి, అందుబాటులోకివస్తే... ఇప్పుడున్న విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పౌర విమానయాన కార్యకలాపాలను నిలిపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా మంత్రి తెలిపారు. కేంద్రానికి కొత్తగూడెం ప్రతిపాదన... కాగా, పలు రాష్ట్రాల్లో కొత్త విమానాశ్రయాలకు సంబంధించి తమకు ప్రతిపాదనలు వచ్చాయని శర్మ చెప్పారు. వీటిలో తెలంగాణ రాష్టంలోని కొత్తగూడెం(ఖమ్మం జిల్లా) కూడా ఉంది. ఇంకా మహారాష్ట్రలోని షోలాపూర్, బోలెరా(అమరావతి); గుజరాత్‌లోని ద్వారక, కేరళలోని అన్నాకర(ఇడుక్కి), మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, సింగ్రౌలి, ఉత్తరప్రదేశ్‌లోని జేవర్, తమిళనాడులో చింగ్లేపుట్(చెన్నై), లక్షద్వీప్‌లో అంధ్రోత్ ఈ జాబితాలో ఉన్నాయి. -
ఆవు ప్లస్ ఆ నలుగురు
న్యూఢిల్లీ: సమాజంలో మంచికైనా, చెడుకైనా సంచలనం సృష్టించిన అంశాలు ఈ ఏడాది ప్రధానంగా ఐదు ఉన్నాయి. అందులో ఆవు అంశం ఒకటి. హిందువుల ఆరాధించే ఆవు మాంసాన్ని ఎవరూ కలిగి ఉండరాదని, తినకూడదని, అలా చేస్తే పదేళ్లు జైలు శిక్ష విధిస్తామంటూ మహారాష్ట్రలోని బీజేవీ ప్రభుత్వం కఠిన చట్టాన్ని తీసుకొచ్చి సంచనలం సృష్టించింది. అదే తరహాలో హర్యానా కూడా కఠిన చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించడమే కాకుండా దేశవ్యాప్తంగా పలువురు ముస్లింల హత్యలకు దారి తీశాయి. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రిలో ఓ ముస్లిం కుటుంబం ఆవు మాంసం భద్రపర్చారనే మిషతో ఆ ఇంటిమీద కొంత మంది దాడులు జరిపి ఇంటి యజమానిని కొట్టి చంపారు. మరోచోట ఆవులను ఎత్తుకుపోతున్నారన్న ఆరోపణలతో ఓ ట్రక్కు డ్రైవర్‌ను హతమార్చారు. ఆవు మాంసం వడ్డిస్తున్నారన్న ఫిర్యాదుపై ఢిల్లీలోని కేరళ హౌస్‌పై ఢిల్లీ పోలీసులు దాడులు జరిపారు. దీనిపై రాజకీయ దుమారం కూడా రేపింది. ఇది చివరకు దేశంలో అసహనం పెరిగిపోతోందన్న ఆందోళనకు దారితీసింది. రెండో అంశం షీనా బోరా 24 ఏళ్ల షీనా బోరా హత్య కేసు. మూడేళ్ల క్రితం జరిగిన ఆమె హత్య కేసు రోజుకో మలుపుతిరుగుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మీడియాకు ప్రధాన కథాంశంగా మారింది. ఈ కేసులో అరెస్టయిన ఇందిరాణి ముఖర్జీ చుట్టూ పలు కథనాలు వెలువడ్డాయి. ఊహంచని విధంగా గత నవంబర్ మారు తండ్రి, మీడియా బిగ్‌విగ్ పీటర్ ముఖర్జీ కూడా అరెస్టయ్యారు. 500 నుంచి 600 కోట్ల రూపాయల లావా దేవీలకు సంబంధించిన ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా బదిలీ అవడంతో కేసు దర్యాప్తు బలహీనపడినట్టు కనిపిస్తోంది. ఏదే మైనా వార్తలపరంగా ఈ కేసు 2015 సంవత్సరానికి ‘గాసిప్ ఇయర్’ అన్న పేరును తెచ్చింది. మూడో అంశం హార్థిక్ పటేల్ హార్థిక్ పటేల్ కూడా ఈ ఏడాది దేశంలో సంచలనం సృష్టించారు. వ్యాపారంలోనూ వ్యవసాయంలోనూ రాణిస్తున్న పటేళ్ల వర్గానికి బీసీ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని చేపట్టిన పటేల్ అనతి కాలంలోనే ఏ రాజకీయ నాయకుడికిరానంత పేరు తెచ్చుకున్నారు. నాలుగైదు లక్షల మందితో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం గుండెల్లో గుబులు పుట్టించారు. సోషల్ మీడియాలో కూడా హీరో అనిపించుకున్నారు. అయితే, ఎంత వేగంగా హీరో అయ్యారో, అంతేవేగంగా జీరో అయ్యారు. ఇది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యమే! మహేశ్ శర్మ ఆరెస్సెస్‌లో సుదీర్ఘకాలంగా సభ్యుడిగా ఉన్న డాక్టర్ మహేశ్ శర్మ ఊహించని విధంగా మంత్రిపదవి దక్కించుకొని చ ర్చల్లో వ్యక్తి అయ్యారు. లోక్‌సభకు మొదటిసారి ఎన్నికైన ఆయన సాంస్కృతిక, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా స్వతంత్య్ర బాధ్యతలు నిర్విహ స్తూ ‘దాద్రి’ సంఘటనలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా సంచలనం సృష్టించారు. దాద్రి సంఘటన యాదృశ్ఛికంగా జరిగిందే తప్పా ఎవరు ఉద్ధేశపూర్వకంగా చేసింది కాదంటూ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఎవరినైనా కొడితే శరీరానికే గాయాలవుతాయని, ఆవును చంపితే మాత్రం మనిషిలోని గుండెకాయకు గాయం అవుతుందనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతిగా అబ్దుల్ కలాంకు కేటాయించిన బంగాళాను దక్కించుకోవడం ద్వారా కూడా శర్మ సంచలనం సృష్టించారు. మొదటిసారి ఎంపీ అయినావారెవరికి ఇలాంటి బంగళాను కేటాయించిన చరిత్ర దేశంలో లేదు. పహ్లాజ్ నెహ్లాని 2015, జనవరిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) చైర్మన్‌గా నియమితులైన పహ్లాజ్ నెహ్లాని తన వివాదాస్పద నిర్ణయాలతో సంచలనం సృష్టించారు. బాంబే అనే పదంతోపాటు 13 ఆంగ్ల పదాలను, 11 హిందీ పదాలను సినిమాల్లో వాడకూడదంటూ నిషేధం విధించారు. ఇటీవల వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం ‘స్పెక్టర్’ చిత్రంలో ముద్దు సీన్‌ను కుదించారు. ఎందుకు ఇలా చేశారంటూ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్లు ప్రశ్నించగా ‘మీరు ఇంట్లో తలుపులు తెరచుకొని అందరికి కనపడేలా సెక్స్‌లో పాల్గొంటారా?’ లాంటి వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనం సృష్టించారు. -
కలాం బంగ్లా.. కయ్యాల మంత్రికి?
న్యూఢిల్లీ: కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖా సహాయ మంత్రి మహేష్ శర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. రాజాజీ మార్గ్ లోని టైప్ VIII కేటగిరీకి చెందిన నెం.10 బంగ్లాకు ఆయన యజమాని కానున్నారు. ఇటీవలే మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజె అబ్దుల్ కలాంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శల పాలైన మహేష్ శర్మ ఇపుడు అబ్దుల్ కలాం బంగ్లాను సొంతం చేసుకోనున్నారు. ఈ నెలాఖరుకు ఆయన ఆధీనంలోకి రానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వివాదం చెలరేగింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ఆప్ మండిపడుతోంది. అంతటి మహనీయుడు నివసించిన భవనాన్ని వివాదాస్పద మంత్రికి కేటాయించడంపై ఆప్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అటు తమిళనాడుకు సీనియర్ జర్నలిస్టు భగవాన్ సిగ్ దీనిపై ఇప్పటికే చేంజ్.ఆర్గ్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. మిసైల్ మ్యాన్ నివసించిన బంగ్లాను ఒక విజ్ఞాన కేంద్రంగా కానీ, మ్యూజియంగా కానీ తీర్చిదిద్దాలని కోరారు ఆయన వినియోగించిన వేలాది పుస్తకాలు, డాక్యుమెంట్లు, వాడిన వీణ అక్కడ ఉంచాలని కోరారు. కలాంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి మహేష్ శర్మ ఆయన భవనాన్ని కేటాయించి కలాంను అవమానించొద్దని కోరారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం టైప్ viii భవనాలను కేబినెట్ స్థాయి ర్యాంక్ ఉన్న మంత్రులకు మాత్రమే కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన సామన్లను ప్యాక చేసి ఉంచిన ఈ బంగ్లాను ఈ అక్టోబర్ 31కి ఖాళీ చేయనున్నారని సమాచారం. కాగా ఇటీవల అబ్దుల్ కలాం ఆకస్మిక మరణం తరువాత కలాం ముస్లిం అయినా కూడా జాతీయవాది , మానవతావాది అంటూ మంత్రి వ్యాఖ్యానించి వివాదంలో ఇరుక్కున్నారు. దీంతోపాటు, మత ఘర్షణల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు, ఇండియాలో అమ్మాయిలు అర్థరాత్రి రోడ్లపై ఎందుకు తిరుగుతారంటూ మాట్లాడి విమర్శల పాలయ్యారు. -
'సాంస్కృతిక మంత్రి అనాగరిక వ్యాఖ్యలు'
న్యూఢిల్లీ: కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహేశ్ శర్మ అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సాంస్కృతిక శాఖ మంత్రి అనాగరిక వ్యాఖ్యలు చేస్తున్నారని ట్విటర్ లో మండిపడ్డారు. కేంద్ర సాహిత్య అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నరచయితలపై తీరుపై అనుమానం కలుగుతోందని మహేష్ శర్మ అంతకుముందు వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. రచయితలు తమ నిరసనను సరైన వేదిక ద్వారా తెలపాలని మాత్రమే తాను అన్నానని... రచనలు చేయడం, చేయకపోవడం వారి ఇష్టమని పేర్కొన్నారు. సాహిత్య అవార్డు గ్రహీతలు వాటిని తమ దగ్గర ఉంచుకోవాలా, వద్దా అనేది వారి వ్యక్తిగత విషయమన్నారు. అవార్డులు వెనక్కు ఇచ్చేయడం ద్వారా నిరసన తెలపడం తానెన్నడూ చూడలేదని చెప్పారు. Mahesh Sharma Culture Minister-"Let Writers stop writing then we would see" Arrogance Personified! Uncultured Statement of Culture Minister — digvijaya singh (@digvijaya_28) October 13, 2015 -
'రామాయణ టూరిస్ట్ సర్క్యూట్లో భద్రాచలాన్ని చేర్చండి'
న్యూఢిల్లీ: రామాయణ టూరిస్ట్ సర్క్యూట్లో భద్రాచలాన్ని చేర్చాలని కేంద్రపర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మకు ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో మంగళవారం మంత్రిని కలిసిన కవిత, బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ ప్రాముఖ్యత వచ్చేలా కేంద్రం సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మహేశ్ శర్మను బతుకమ్మ పండుగ ఉత్సవాలకు కవిత ఆహ్వానించారు. -
టూరిస్టులు మున్ముందు కుప్పలుగా వస్తారు
న్యూఢిల్లీ: భారత దేశాన్నిసందర్శించే పర్యాటకుల సంఖ్య ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలతో మరింత రెట్టింపు అవనుందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి మహేశ్ శర్మ అన్నారు. బుధవారం ఆయన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(ఐఏటీవో) సమావేశంలో మాట్లాడుతూ మోదీ అమెరికా పర్యటన వల్ల అక్కడి నుంచి భారత్‌ను సందర్శించడానికి వచ్చిన అమెరికన్ పర్యాటకుల సంఖ్య 10.3శాతానికి చేరిందన్నారు. అలాగే, బ్రెజిల్ పర్యాటకుల సంఖ్య 13.7 శాతానికి పెరిగిందని అలాగే జర్మనీ నుంచి 5శాతం, కెనడా నుంచి 7శాతం, ఉజ్బెకిస్థాన్ నుంచి 49శాతం, మ్యాన్ మార్ నుంచి 30శాతం పర్యాటకులు పెరిగారని చెప్పారు. ఇది మన ప్రధాని మోదీకి ఉన్న దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. ఆయన ఆలోచనలతో టూరిజంశాఖ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచేలా చూస్తున్నారని అన్నారు. ఐఏటీవో 31వ ఆవిర్భావ దినోత్సవం ఇండోర్‌లో ఆగస్టు 20 నుంచి 23 మధ్య నిర్వహించనున్నామని, అప్పటిలోగా ఏవైనా మార్పులు వస్తే ముందే సూచిస్తామని తెలిపారు. -
సందర్శకుల సౌకర్యార్థం ఈ-టికెట్
న్యూఢిల్లీ : తాజ్‌మహల్, హుమాయన్ సమాధిని సందర్శించడానికి వచ్చే పర్యాటకుల కోసం ఈ టికెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర పర్యాట, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ అన్నారు. పెలైట్ ప్రాజెక్టుకింద శుక్రవారం ఈ టికెట్ సౌకర్యాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. పరిశుభ్రత ఉద్యమం, మెరుగైన ఆస్పత్రుల నిర్వహణ, పర్యాటక రంగ అభివృద్ధిని ప్రజలు కోరుకొంటున్నారని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. భారత్‌కు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని అన్నారు. ఇందులో భాగంగానే హెల్ప్‌లైన్ నంబర్ రెండు భాషల్లో(హిందీ-ఇంగ్లిష్) 6 లైన్లు అందుబాటులో ఉంచామని అన్నారు. అంతర్జాతీయ భాషలైన జర్మనీ, రష్యా,ఫ్రెంచ్‌లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. తాజ్‌మహల్, హుమాయన్ సమాధి సందర్శన టిక్కెట్లను 90 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించే సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. సందర్శకులను మూడు కేటగిరీలు విభజించారు. విదేశీ పర్యాటకులు, సార్క్ సందర్శకులు, దేశీయ సందర్శకులుగా విభజించారు.అదేవిధంగా ఢిల్లీలోని చారిత్రక ప్రదేశాల గురించి బ్రెయిలీ లిపిలో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. -
ప్రభుత్వానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్... సర్వీసుల పునరుద్ధరణకు వీలుగా రూపొందించిన ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే ఈ ప్రణాళిక ఆమోదంపై తుది నిర్ణయం తీసుకునేముందు సంబంధిత చమురు కంపెనీలు, బ్యాంకులతో ప్రభుత్వం చర్చించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. సర్వీసుల పునరుద్ధరణ దిశలో స్పైస్‌జెట్ ఇప్పటికే పౌర విమానయాన శాఖకు ప్రణాళికను అందజేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు రుణ చెల్లింపులకు వీలుగా 15-30 రోజులపాటు గడువు ఇవ్వాల్సిందిగా చమురు కంపెనీలను కోరినట్లు తెలిపాయి. కాగా, మరోపక్క కంపెనీ తొలి ప్రమోటర్ అజయ్ సింగ్ అమెరికాకు చెందిన రెండు ప్రయివేట్ ఈక్విటీ సంస్థలతో చర్చలు నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల ప్రతినిధులను కంపెనీ బోర్డులోకి తీసుకురావాలన్నది అజయ్ ప్రణాళిక. రూ. 1,230 కోట్లకు బకాయిలు..: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ బకాయిలు డిసెంబర్ 10కల్లా రూ. 1,230 కోట్లకు చేరాయి. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు 18 రోజుల్లో రూ. 990 కోట్ల నుంచి రూ. 1,230 కోట్లకు ఎగశాయి. ఈ వివరాలను పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ లోక్‌సభలో వెల్లడించారు. -
ఉమ్మడి రాష్ట్రంలోనే సైన్స్ సిటీ ప్రతిపాదన
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్సీఎస్ఎం)కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ప్రతిపాదన వచ్చిందని కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేశ్ శర్మ వెల్లడించారు. దేశంలో సైన్స్‌సిటీల ఏర్పాటుపై లోక్‌సభలో సోమవారం ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సైన్స్ సిటీ ఏర్పాటుపై ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ కింద స్వయం ప్రతిపత్తి గల ఎన్సీఎస్ఎం దేశంలో సైన్స్ సిటీ, కేంద్రాల నిర్వహణను చూసుకుంటోందని అన్నారు. సైన్స్ సిటీల ఏర్పాటుకు హైదరాబాద్ సహా హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రతిపాదనలు పంపాయని మంత్రి వెల్లడించారు. -
ఇక విమానాశ్రయాలనుంచే ‘అతిథి దేవోభవ’
న్యూఢిల్లీ: మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులను విమానాశ్రయాల్లోనే పూలదండలతో స్వాగతించి వారికి చక్కని వాతావరణం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. భారతీయత ఉట్టిపడేలా ‘అతిథి దేవోభవ’ అనే సంప్రదాయాన్ని నెలకొల్పే ప్రయత్నం చేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి మహేష్ శర్మ ఆదివారం వెల్లడించారు. విమానాశ్రయాల్లో ఆహ్వాన కేంద్రాల ఉద్యోగులు టూరిస్టులను ఆహ్వానించి వారు దేశంలో ఉండి తమ పర్యటన ముగించే తిరుగు ప్రయాణం అయ్యేంత వరకూ సహకరిస్తారన్నారు. -
మహేశ్ శర్మకు మంత్రి పదవి
ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకుడు మహేశ్ శర్మకు నరేంద్ర మోదీ కేబినెట్ లో సహాయమంత్రి(స్వతంత్ర హోదా) దక్కింది. వైద్యునిగా వృతిజీవితం ప్రారంభించిన ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో గౌతమ్‌బుద్ధ నగర్ నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 55 ఏళ్ల మహేశ్ శర్మకు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీతో అనుబంధం ఉంది. విద్యార్థి రాజకీయాల తర్వాత బీజేపీలో చేరారు. ఎంబీబీఎస్ చదివిన ఆయన నోయిడాలోని కౌలాష్ హెల్త్ కేర్ ఆస్పత్రికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. వైద్య, కుటుంబ సంరక్షణకు సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో 2014 సెప్టెంబర్ 1 నుంచి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎనిమిది పర్యాయాలు గౌతమ్‌బుద్ధ నగర్ నుంచి లోక్‌సభ, యూపీ అసెంబ్లీకి పోటీ చేశారు. 2012లో నోయిడా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. అమిటీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఉత్తమ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి విభాగంలో 2009-2010 సంవత్సరానికి గానూ బిజినెస్ స్పియర్ అవార్డు అందుకున్నారు. వీటితో పాటు జాతీయ,అంతర్జాతీయ పురస్కారాలు ఆయనను వరించాయి.