న్యూఢిల్లీ : తాజ్‌మహల్, హుమాయన్ సమాధిని సందర్శించడానికి వచ్చే పర్యాటకుల కోసం ఈ టికెట్ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కేంద్ర పర్యాట, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ అన్నారు. పెలైట్ ప్రాజెక్టుకింద శుక్రవారం ఈ టికెట్ సౌకర్యాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులకోసం హెల్ప్‌లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. పరిశుభ్రత ఉద్యమం, మెరుగైన ఆస్పత్రుల నిర్వహణ, పర్యాటక రంగ అభివృద్ధిని ప్రజలు కోరుకొంటున్నారని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని అన్నారు. భారత్‌కు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు సరైన చర్యలు చేపడుతున్నామని అన్నారు. ముఖ్యంగా విదేశీ పర్యాటకుల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని అన్నారు.
ఇందులో భాగంగానే హెల్ప్‌లైన్ నంబర్ రెండు భాషల్లో(హిందీ-ఇంగ్లిష్) 6 లైన్లు అందుబాటులో ఉంచామని అన్నారు. అంతర్జాతీయ భాషలైన జర్మనీ, రష్యా,ఫ్రెంచ్‌లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. తాజ్‌మహల్, హుమాయన్ సమాధి సందర్శన టిక్కెట్లను 90 రోజుల ముందుగానే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. డెబిట్‌కార్డు, క్రెడిట్‌కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు చెల్లించే సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. సందర్శకులను మూడు కేటగిరీలు విభజించారు. విదేశీ పర్యాటకులు, సార్క్ సందర్శకులు, దేశీయ సందర్శకులుగా విభజించారు.అదేవిధంగా ఢిల్లీలోని చారిత్రక ప్రదేశాల గురించి బ్రెయిలీ లిపిలో రూపొందించిన పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.
సందర్శకుల సౌకర్యార్థం ఈ-టికెట్
Published Sat, Dec 27 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM
Advertisement