సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్‌సీఎస్‌ఎం)కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ప్రతిపాదన వచ్చిందని కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేశ్ శర్మ వెల్లడించారు. దేశంలో సైన్స్‌సిటీల ఏర్పాటుపై లోక్‌సభలో సోమవారం ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సైన్స్ సిటీ ఏర్పాటుపై ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ కింద స్వయం ప్రతిపత్తి గల ఎన్‌సీఎస్‌ఎం దేశంలో సైన్స్ సిటీ, కేంద్రాల నిర్వహణను చూసుకుంటోందని అన్నారు. సైన్స్ సిటీల ఏర్పాటుకు హైదరాబాద్ సహా హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రతిపాదనలు పంపాయని మంత్రి వెల్లడించారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే సైన్స్ సిటీ ప్రతిపాదన
Published Tue, Dec 16 2014 2:57 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM
Advertisement
Advertisement