science city
-
‘స్థలం కేటాయిస్తే సైన్స్ సిటీ ఏర్పాటు’
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో 25 ఎకరాల స్థలం కేటాయిస్తే సైన్సు సిటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. బేగంపేటలోని హరిత ప్లాజాలో శనివారం జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ సమితి (దిశ) సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నగరంలో జరుగుతున్న వివిధ పథకాలను సమీక్షించారు. ఇళ్ల నిర్మాణ వివరాలను జీßæచ్ఎంసీ అధికారులను అడిగి తెలుసుకొన్నారు. త్వరగా పూర్తి చేయాలని సూచించారు. జేఎన్‌యూహెచ్ స్కీమ్‌లో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. త్వరగా అందజేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన వెల్నెస్ సెంటర్ల గురించి ప్రశ్నించగా.. 152 బస్తీ దవాఖానాలు, యుహెచ్‌సీలను వెల్నెస్ సెంటర్లుగా మార్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. నగరంలోని టీబీ పేషంట్లను తాను దత్తత తీసుకుంటానని మంత్రి తెలిపారు. పీఎం స్వయంనిధి, ముద్ర రుణాలు అందరికీ అందేట్లు చూడా లని బ్యాంకు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హెచ్ఎండబ్ల్యూ ఎండీ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి, సంయుక్త సంచాలకులు ఎన్.సురేందర్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: నిలబడి.. కలబడేదెలా?.. భవిష్యత్తు కార్యాచరణపై టీపీసీసీ -
తిరుపతి, విశాఖలో సైన్స్ సిటీలు!
సాక్షి, అమరావతి: ప్రజల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచేందుకు రెండు సైన్స్ సిటీ సెంటర్లు, రెండు ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. తిరుపతి, విశాఖల్లో సైన్స్ సిటీలు, పులివెందుల, నెల్లూరులో ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న పెనుమార్పులపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు నిష్ణాతులతో చర్చావేదికలు, ప్రదర్శనలు.. యూనివర్సిటీలు, కళాశాలల్లోని విద్యార్థులకు వక్తృత్వ, వ్యాస రచన పోటీలను సైన్స్ సిటీలు నిర్వహిస్తాయి. అలాగే సైన్స్ మ్యూజియమ్స్, త్రీడీ ప్లానిటోరియమ్స్, 9 డీ థియేటర్లు, సైన్స్ క్లబ్‌లను ఏర్పాటు చేస్తాయి. దేశంలో అసోం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సైన్స్ సిటీలు ఏర్పాటై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అక్కడి ప్రజలు వీటి కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో మిగిలిన రాష్ట్రాలూ వీటి ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్‌కు ఆదేశాల మేరకు అధికారులు తిరుపతి, విశాఖ నగరాల్లో సైన్స్ సిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పని చేయనున్న సైన్స్ సిటీలు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మూజియమ్స్ (స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ) సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తాయి. కేంద్రం రూ. 30 కోట్లు,రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లు సైన్స్ సిటీలను 50 లక్షల జనాభా కలిగిన నగరాల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 50 కోట్లతో ఏర్పాటు కానున్న ఒక్కో సైన్స్ సిటీకి కేంద్ర ప్రభుత్వం రూ. 30 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లు అందజేస్తుంది. తిరుపతి, విశాఖల్లో వీటిని నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. అలాగే పులివెందుల, నెల్లూరులో ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు పులివెందులలో త్రీ–డీ ప్లానిటోరియం ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేస్తాం. ముఖ్యమంత్రి సైన్స్ సిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 17న కోవిడ్–19ను ఎదుర్కోవడానికి యోగా ప్రాముఖ్యత అనే అంశంపై వెబినార్‌ను నిర్వహించనున్నాం. – సైన్స్ సిటీ సీఈవో జయరామిరెడ్డి -
అచ్చం.. అంగారకుడిలానే..!?
అంగారకుడిని మనం ఇప్పట్లో చేరుకుంటామో లేదో తెలియదుకానీ.. మన భూమ్మీదనే అంగీరకుడి వాతావరణాన్ని యూఏఈ సైంటిస్టులు సృష్టిస్తున్నారు. ఎమరాతి ఎడారిలో సైన్స్ సిటీ పేరుతో ఒక భారీ 3డీ నగరాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లే యూఏఈ ప్రకటించింది. అచ్చం అంగారకుడి ఉపరితలం మీద ఎటువంటి వాతావరణం.. ఎటువంటి పరిస్థితులు ఉంటాయో.. అలాగే ఎమరాతి ఎడారిలో రూపొందిస్తున్నట్లు సైంటిస్టులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను 2117 నాటికి అంటే నేటికి వందేళ్లలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూఏఈ ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నిధులను వెచ్చించనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాదాపు 1.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ గోళాకృతిలో నిర్మించే ఈ నగరంలో.. అన్ని రకాల సదుపాయాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గోళాకృతి బయట అమర్చే సౌరఫలకాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, లోపలే ఆహార పదార్థాల ఉత్పత్తి, నీరు.. ఇలా అన్నింటిని రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ కాలాల్లో భూమిమీద ఏర్పడే సవాళ్లను ఎదుర్కోవడం గురించి ఇందులో ప్రధానంగా అధ్యనం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. -
హైదరాబాద్‌లో సైన్స్ సిటీ
హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ద్వారా 5-డీ థియేటర్లు తదితరాల ఏర్పాటునకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు అటవీ, పర్యావరణ, శాస్త్ర,సాంకేతికశాఖల మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ ప్రాజెక్టులో భాగంగా వివిధ పెవిలియన్లు ఏర్పాటు చేయనున్నట్లు, పిల్లల్లో సైన్స్ పట్ల అవగాహన, భౌతిక, రసాయన, జీవ శాస్త్రాలు, అంతరిక్ష పరిశోధన, రాకెట్ మోడల్స్, పవన, జీవశక్తి, భూగోళశాస్త్ర వివరాలను పొందపరచనున్నట్లు తెలియజేశారు. వివిధ ప్రాంతాల్లో సైన్స్ సెంటర్లు, ప్రజోపయోగకరమైన పరిశోధన, సైంటిస్టులు, అధ్యాపకులు, రిసెర్చీ స్కాలర్లు, విద్యార్థులకు వివిధ శాస్త్ర సాంకేతిక కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పించిందన్నారు. గురువారం సచివాలయంలో తెలంగాణ స్టేట్ శాస్త్ర, సాంకేతిక శాఖ వెబ్‌సెట్, లోగోను ఆవిష్కరించారు. ఈ శాఖ సభ్యకార్యదర్శి వై.నగేశ్‌కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జోగురామన్న విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.160 కోట్లు కాగా అందులో కేంద్ర ప్రభుత్వం రూ.66 కోట్లు, హెచ్ఎండీఏ రూ.40 కోట్ల వరకు భరించనుండగా, మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్,పబ్లిక్ పద్ధతిలో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ, పర్యాటక, సాంస్కృతిక శాఖల ద్వారా ఈ సైన్స్ సిటీ ఏర్పాటునకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఉమ్మడి రాష్ర్టంలో 2014లో రంగారెడ్డి జిల్లాలోన బుద్వేల్ సమీపంలో సుమారు 80 ఎకరాల స్థలాన్ని గుర్తించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారన్నారు. ఈ ప్రాజెక్టు సాధన కోసం తమ ప్రభుత్వం వచ్చాక వివిధ రూపాల్లో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో సాంకేతికపరంగా చోటుచేసుకునే మార్పుచేర్పులకు సంబంధించిన అంశాలు, శాస్త్ర, సాంకేతిక శాఖ ద్వారా చేపట్టే కార్యక్రమాలు, వర్క్‌షాపు వివరాలు తదితర అంశాలను www.tscost.telangana.gov.in వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు తెలియజేశారు. కొత్త పరిశోధనలు.. ఈ శాఖ ద్వారా కొమరం భీమ్ జిల్లా కెరమెరి మండలం ఎగువప్రాంతాల్లో ఆపిల్, మల్బరీ సాగుకు గల అవకాశాలపై సీసీఎంబీ సహకారంతో పరిశీలన, ఆముదం పంటకు వచ్చే గ్రేమోల్డ్ రోగ నివారణ పద్ధతులను రూపొందించడంపై మహబూబ్‌నగర్ జిల్లాలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ రిసెర్చీ ద్వారా వర్షపు నీటి వినియోగించి ఫ్లోరైడ్ సమస్యను తగ్గించేందుకు నల్లగొండ జిల్లాలో జేఎన్టీయూ, సెంటర్ వాటర్ రిసోర్సెస్ ద్వారా పరిశోధనలు, రైతులు, వినియోగదారుల ప్రయోజనార్దం తృణ ధాన్యాల నిల్వ కాలాన్ని పెంపొందించడంపై ఓయూ, ఇక్రిశాట్ల సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు జోగురామన్న తెలిపారు. -
జ్ఞానతృష్ణను తీర్చే ఒయాసిస్సు
నీరున్న చోట, పచ్చదనం ఉన్న చోట జ్ఞానం మొలకెత్తుతుంది. చిగురిస్తుంది. ఆకులు, కొమ్మలు వేస్తుంది. ఊడలు కూడా దిగుతుంది. అది ఎడారి అయినా సరే, జ్ఞానం ఒయాసిస్సై దాహాన్ని తీరుస్తుంది. అలాంటి ఒక విజ్ఞాన ఒయాసిస్సు ఈజిప్టు ఎడారిలో నిర్మాణం కాబోతోంది. ఈజిప్టు పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది.... భారీ సైజు పిరమిడ్లు... ఇసుక తిన్నెలతో కూడిన ఎడారి. అంతేనా? మరి... ఇసుక ఎడారి మధ్యలో పచ్చటి ఓ ఒయాసిస్సు ఉంటే? ఈ ఆలోచనకు రూపమిస్తే పక్క ఫొటోల్లో చూపినట్టుగా ఉంటుంది. విషయమేమిటంటే... ఈజిప్టు రాజధాని కైరో సమీపంలో ఓ అత్యాధునిక పరిశోధనశాల, మ్యూజియమ్ ఒకదాన్ని నిర్మించాలని బిబిలోథికా అలెక్సాండ్రినా అనే సంస్థ సంకల్పించింది. కైరోకు పశ్చిమ దిక్కున ఎడారిలో కట్టబోయే ఈ సైన్స్ సిటీ డిజైనింగ్‌కు ఓ పోటీ నిర్వహించింది. దాదాపు 446 సంస్థలు పోటీపడగా... వాటిల్లో వెస్టన్ విలియమ్సన్ ఆర్కిటెక్చర్ సంస్థ ప్రతిపాదించి, పోటీలో విజయం సాధించిన డిజైన్లు ఇవి. జ్ఞానతృష్ణను తీర్చే ఒయాసిస్సు ఇదీ అన్న విధంగా వీరు దీన్ని డిజైన్ చేశారు. మొత్తం 13.49 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. దూరం నుంచి చూస్తే తెల్లటి పైకప్పుల్లా కనిపిస్తున్నాయి చూడండి... వాటిల్లోనే ఓ ప్లానెటోరియం, ఇంకో మ్యూజియమ్, అబ్జర్వేషన్ టవర్లతోపాటు కాన్ఫరెన్స్ సెంటర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సౌకర్యాలు ఉంటాయి. అంతేకాదు... ఈ గుండ్రటి పైకప్పుల ద్వారా వాననీటిని ఒడిసిపట్టడంతోపాటు... సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్తు కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. -
ఉమ్మడి రాష్ట్రంలోనే సైన్స్ సిటీ ప్రతిపాదన
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుపై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ (ఎన్సీఎస్ఎం)కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే ప్రతిపాదన వచ్చిందని కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేశ్ శర్మ వెల్లడించారు. దేశంలో సైన్స్‌సిటీల ఏర్పాటుపై లోక్‌సభలో సోమవారం ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత సైన్స్ సిటీ ఏర్పాటుపై ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ కింద స్వయం ప్రతిపత్తి గల ఎన్సీఎస్ఎం దేశంలో సైన్స్ సిటీ, కేంద్రాల నిర్వహణను చూసుకుంటోందని అన్నారు. సైన్స్ సిటీల ఏర్పాటుకు హైదరాబాద్ సహా హరియాణా, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రతిపాదనలు పంపాయని మంత్రి వెల్లడించారు.