
అంగారకుడిని మనం ఇప్పట్లో చేరుకుంటామో లేదో తెలియదుకానీ.. మన భూమ్మీదనే అంగీరకుడి వాతావరణాన్ని యూఏఈ సైంటిస్టులు సృష్టిస్తున్నారు. ఎమరాతి ఎడారిలో సైన్స్ సిటీ పేరుతో ఒక భారీ 3డీ నగరాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లే యూఏఈ ప్రకటించింది. అచ్చం అంగారకుడి ఉపరితలం మీద ఎటువంటి వాతావరణం.. ఎటువంటి పరిస్థితులు ఉంటాయో.. అలాగే ఎమరాతి ఎడారిలో రూపొందిస్తున్నట్లు సైంటిస్టులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను 2117 నాటికి అంటే నేటికి వందేళ్లలో దీనిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యూఏఈ ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నిధులను వెచ్చించనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
దాదాపు 1.9 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ గోళాకృతిలో నిర్మించే ఈ నగరంలో.. అన్ని రకాల సదుపాయాలు ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. గోళాకృతి బయట అమర్చే సౌరఫలకాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, లోపలే ఆహార పదార్థాల ఉత్పత్తి, నీరు.. ఇలా అన్నింటిని రూపొందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్ కాలాల్లో భూమిమీద ఏర్పడే సవాళ్లను ఎదుర్కోవడం గురించి ఇందులో ప్రధానంగా అధ్యనం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.

