మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులను విమానాశ్రయాల్లోనే పూలదండలతో స్వాగతించి వారికి చక్కని వాతావరణం...
న్యూఢిల్లీ: మన దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులను విమానాశ్రయాల్లోనే పూలదండలతో స్వాగతించి వారికి చక్కని వాతావరణం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. భారతీయత ఉట్టిపడేలా ‘అతిథి దేవోభవ’ అనే సంప్రదాయాన్ని నెలకొల్పే ప్రయత్నం చేయనున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి మహేష్ శర్మ ఆదివారం వెల్లడించారు. విమానాశ్రయాల్లో ఆహ్వాన కేంద్రాల ఉద్యోగులు టూరిస్టులను ఆహ్వానించి వారు దేశంలో ఉండి తమ పర్యటన ముగించే తిరుగు ప్రయాణం అయ్యేంత వరకూ సహకరిస్తారన్నారు.