న్యూఢిల్లీ: దేశంలోని అన్ని జాతీయ స్మారక చిహ్నాల వద్ద ఆదివారం నుంచి పాలిథీన్ వాడకంపై నిషేధం విధించారు. స్వచ్ఛభారత్ పథకం ప్రారంభమై ఆదివారానికి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా అందుకు గుర్తుగా ఈ నిషేధం అమలులోకి తేనున్నారు. గాంధీ జయంతి కూడా ఈ రోజే కావడం విశేషం. ‘స్వచ్ఛ భారత్ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ అన్ని జాతీయ స్మారక చిహ్నాల వద్ద, పర్యాటక ప్రదేశాలలో గాంధీ జయంతి రోజు నుంచి పాలిథీన్‌ను వాడడాన్ని నిషేధిస్తున్నాం’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ చెప్పారు.
అయితే ప్లాస్టిక్ బాటిళ్లను మాత్రం అనుమతిస్తారు. స్మారకచిహ్నాల నుంచి 100 మీటర్ల లోపు పాలిథీన్ వాడరాదు. నిబంధనలు అతిక్రమించే వారికి జరిమానా విధించాలా వద్దా అనే విషయంపై మరో నెల తర్వాత సమీక్ష జరిపి నిర్ణయం తీసుకుంటారు. 50 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉండే ప్లాస్టిక్ సంచులను తయారుచేయడాన్ని ప్రభుత్వం మార్చిలోనే నిషేధించింది.
జాతీయ స్మారకాల వద్ద పాలిథీన్ నిషేధం
Published Sun, Oct 2 2016 8:35 PM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM
Advertisement
Advertisement