ఈ మధ్య స్పెయిన్‌లో ఓ ఉద్యమం ఊపందుకుంటోంది. ఓ స్కూల్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు లింగ సమానత్వం పేరుతో ఓ వినూత్న సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. అది ఓ ఉద్యమంగా అక్కడ కొనసాగుతోంది.
Wear a Skirt to School campaign: యూకే మిర్రర్ నివేదిక ప్రకారం.. కొన్ని నెలల ముందు ఎడన్‌బర్గ్‌లోని కాసిల్‌వ్యూ ప్రైమరీ స్కూల్‌కి చెందిన 15 ఏళ్ల మైకెల్ గొమెజ్ అనే విద్యార్థి స్కర్టు ధరించి పాఠశాలకు వచ్చినందుకు స్కూల్ యాజమాన్యం బయటికి వెళ్లగొట్టింది. దీంతో ధరించే దుస్తులకు లింగ భేదం ఉండదనే స్లోగన్‌తో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు అందరూ స్కూలుకు స్కర్టులతో రావడం ప్రారంభించారట. ఇదంతా సదరు విద్యార్ధికి మద్ధతు తెల్పాలనే ఉద్దేశ్యంతో ‘వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్’ను ఉద్యమంగా చేపట్టారు.
మూస పద్ధతులను బద్ధలు కొట్టాలనే నెపంతో ఈ చర్యకు పూనుకున్నట్లు అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. బలవంతంగా స్కర్టులు ధరించమని ఎవ్వరికీ చెప్పం. అది పూర్తిగా విద్యార్ధుల ఇష్టానికే వదిలివేశామని అంటున్నారు. ఐతే ఈ వింత పోకడను కొందరు తల్లిదండ్రులు ప్రశంసిస్తుంటే, మరికొందరేమో బుగ్గలు నొక్కుకుంటున్నారు.
చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే..
Comments
Please login to add a commentAdd a comment