Mirror Media
-
‘మీడియా దాడితో ఈ క్షణం దాకా బాధపడుతున్నా!’
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలో వందేళ్ల తర్వాత ఓ కీలక పరిణామం జరిగింది. సుమారు 130 ఏళ్ల తర్వాత.. తొలిసారి ఈ రాజకుటుంబానికి చెందిన ఓ వ్యక్తి కోర్టుకు హాజరయ్యారు. అతనే ప్రిన్స్ హ్యారీ(38). కింగ్ ఛార్లెస్ రెండో తనయుడు. ఫోన్ హ్యాకింగ్‌కు సంబంధించిన కేసులో ఓ వార్తా సంస్థకు వ్యతిరేకంగా మంగళవారం కోర్టు బోనులో నిలబడి సాక్ష్యం చెప్పాడు హ్యారీ. మీడియా దాడితో నేను జీవితాంతం బాధపడుతున్నా. కొన్ని టాబ్లాయిడ్లు, ఛానెల్స్, వెబ్సైట్లు.. తమ చేతులకు రక్తపు మరకలు అంటించుకుని తిరుగుతున్నాయి. వాళ్ల నిరంతర టీఆర్పీ రేటింగ్.. రీడర్‌షిప్‌ల దాహార్తికి నన్ను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. అది నేటి వరకు.. ఈ క్షణం దాకా కూడా.. అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారాయన. తనను చెడ్డొడిగా చూపిస్తూ బ్రిటన్ మీడియా లాభపడుతోందంటూ ఆరోపించారాయన. ప్రత్యక్ష సాక్షి హోదాలో కోర్టు బోనెక్కిన ప్రిన్స్ ఛార్లెస్.. ఎవరైనా ఈ మీడియా పిచ్చికి అడ్డుకట్ట వేయకముందే వాళ్ల టైపింగ్ వేళ్లను ఎంత రక్తం ముంచేస్తుందో అంటూ తనపై వస్తున్న కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారాయన. ప్లేబాయ్ ప్రిన్స్, ఫెయిల్యూర్, డ్రాప్‌అవుట్, మోసగాడు, తాగుబోతు, ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి.. ఇలా ఆ మీడియా తనపై అల్లిన కథనాల జాబితా పెద్దదేనంటూ కోర్టుకు తెలిపారాయన. టీనేజర్‌గా ఉన్నప్పుడు, ట్వంటీస్‌లో ఉన్నప్పుడు.. మీడియా నీచమైన రాతలను తాను చూడాల్సి వచ్చిందంటూ ఆవేదన వ్యక్తం చేశారాయన. ఇదిలా ఉంటే.. బ్రిటన్‌కు చెందిన మిర్రర్ గ్రూప్ రాజకుటుంబం సహా అనేక మంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలను సేకరించేందుకుగానూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. అందులో ఒకటే ఈ ఫోన్ హ్యాకింగ్ కేసు. ప్రిన్స్ హ్యారీతో పాటు పలువురు ప్రముఖులు ఈ వ్యవహారంపై సదరు మీడియా హౌజ్‌ను కోర్టుకు లాగారు. ఇక రాజకుటుంబానికి దూరంగా.. తన భార్య మేఘన్ మర్కెల్, పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్నాడు ప్రిన్స్ హ్యారీ. సోమవారమే లండన్ చేరుకున్నప్పటికీ.. భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం న్యాయస్థానంలో హాజరు అయ్యారు. తన వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు మిర్రర్ గ్రూప్ ఉపయోగించిన మోసపూరిత పద్ధతుల కారణంగా తన జీవితం ఎలా అతలాకుతలం అయ్యిందో హ్యారీ.. న్యాయమూర్తికి వివరించారు. చట్టవ్యతిరేకంగా సేకరించిన వివరాలతో.. 140 ఆర్టికల్స్‌ను ప్రచురించారని, ఒకానొక టైంలో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్లను సైతం ఉపయోగించారని హ్యారీ కోర్టుకు వివరించారు. 130 ఏళ్ల కిందట ఆయన.. బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తులు కోర్టుకు హాజరవ్వడం 130 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు 1870లో ఓ విడాకుల కేసుకు సంబంధించి ఎడ్వర్డ్ VII కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు. ఆ తర్వాత 1891లో ఓ గ్యాంబ్లింగ్ కేసులోనూ ఇంగ్లీష్ హైకోర్టుకు వెళ్లి సాక్ష్యమిచ్చారు. అయితే, ఆయన రాజు కాకమునుపే ఈ రెండూ జరిగాయి. -
దుస్తులకు లింగ భేదం ఏంటీ..! స్కూల్‌కి స్కర్టులతోనే వస్తాం!!
ఈ మధ్య స్పెయిన్‌లో ఓ ఉద్యమం ఊపందుకుంటోంది. ఓ స్కూల్ విద్యార్ధులు, ఉపాధ్యాయులు లింగ సమానత్వం పేరుతో ఓ వినూత్న సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. అది ఓ ఉద్యమంగా అక్కడ కొనసాగుతోంది. Wear a Skirt to School campaign: యూకే మిర్రర్ నివేదిక ప్రకారం.. కొన్ని నెలల ముందు ఎడన్బర్గ్లోని కాసిల్‌వ్యూ ప్రైమరీ స్కూల్‌కి చెందిన 15 ఏళ్ల మైకెల్ గొమెజ్ అనే విద్యార్థి స్కర్టు ధరించి పాఠశాలకు వచ్చినందుకు స్కూల్ యాజమాన్యం బయటికి వెళ్లగొట్టింది. దీంతో ధరించే దుస్తులకు లింగ భేదం ఉండదనే స్లోగన్‌తో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు అందరూ స్కూలుకు స్కర్టులతో రావడం ప్రారంభించారట. ఇదంతా సదరు విద్యార్ధికి మద్ధతు తెల్పాలనే ఉద్దేశ్యంతో ‘వేర్ ఎ స్కర్ట్ టు స్కూల్’ను ఉద్యమంగా చేపట్టారు. మూస పద్ధతులను బద్ధలు కొట్టాలనే నెపంతో ఈ చర్యకు పూనుకున్నట్లు అక్కడి ఉపాధ్యాయులు చెబుతున్నారు. బలవంతంగా స్కర్టులు ధరించమని ఎవ్వరికీ చెప్పం. అది పూర్తిగా విద్యార్ధుల ఇష్టానికే వదిలివేశామని అంటున్నారు. ఐతే ఈ వింత పోకడను కొందరు తల్లిదండ్రులు ప్రశంసిస్తుంటే, మరికొందరేమో బుగ్గలు నొక్కుకుంటున్నారు. చదవండి: 1.5 లీటర్ల కోల్డ్ డ్రింక్ పది నిముషాల్లో తాగేశాడు.. 18 గంటల్లోనే.. -
అందరికీ నచ్చుతుంది
ఎస్.కె., హరిణి జంటగా రూపొందిన చిత్రం ‘పిచ్చెక్కిస్తా’. శ్రీకాంత్‌రెడ్డి దర్శకుడు. నటరాజ్ కొత్తూరి, రాజశేఖర్ లంక నిర్మాతలు. ఈ నెల 18న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. తుఫాన్ బాధితుల సహాయార్థం పాతిక వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందించనున్నామనీ నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: మిర్రర్ మీడియా. -
పాటల రచయిత ఆశయం!
పాటంటే అతనికి ప్రాణం. గేయ రచయితగా మంచి స్థానానికి చేరుకోవాలనే ఆశయంతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెడతాడు. కానీ, అడుగడుగునా ఇబ్బందులపాలవుతాడు. వాటిని అధిగమించి తన ఆశయాన్ని నెరవేర్చుకోగలిగాడా? లేదా అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘కీరవాణి’. మానస్, ఆరాధ్య, గోపీకృష్ణ ముఖ్య తారలుగా రామానుజం .కె. శేఖర్ని దర్శకునిగా పరిచయం చేస్తూ, మిర్రర్ మీడియా పతాకంపై నటరాజ్ కొట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో... ‘‘సంగీత నేపథ్యంలో సాగే చిత్రం ఇది. అందుకే ‘కీరవాణి’ అని టైటిల్ పెట్టాం’’ అని దర్శకుడు చెప్పారు. ఇందులో గేయరచయితగా నటిస్తున్నానని మానస్ తెలిపారు. మా సంస్థలో నిర్మించిన ‘పిచ్చెక్కిస్తా’ని త్వరలో విడుదల చేస్తామనీ, ‘కీరవాణి’ మంచి ఫీల్ గుడ్ మూవీ అని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కథ: సి.ఎమ్. నాయుడు, సంగీతం: చిన్ని చరణ్. కెమెరా: రాఘవ నూలేటి.