
హరిణి
ఎస్.కె., హరిణి జంటగా రూపొందిన చిత్రం ‘పిచ్చెక్కిస్తా’. శ్రీకాంత్‌రెడ్డి దర్శకుడు. నటరాజ్ కొత్తూరి, రాజశేఖర్ లంక నిర్మాతలు. ఈ నెల 18న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని దర్శకుడు చెప్పారు. తుఫాన్ బాధితుల సహాయార్థం పాతిక వేల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్‌కి అందించనున్నామనీ నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: మిర్రర్ మీడియా.