పట్టుబట్టలతోనే కాదు మనవైన సంప్రదాయ దుస్తులతోనూ వెలిగిపోవచ్చు. మోడ్రన్ షేర్వాణీలను ధోతీ ప్యాంట్లతో మ్యాచ్ చేయచ్చు. పర్యావరణ అనుకూలమైన డ్రెస్సులను ఎంచుకోవచ్చు. పాత కాలం నాటి ప్రింట్లు, హ్యాండ్‌మేడ్ డిజైన్స్‌కి ప్రాధాన్యం ఇవ్వచ్చు. ఎవర్‌గ్రీన్ లుక్‌తో రాబోయే రోజులను ప్రకాశవంతంగా మార్చడానికి ఈ దీపావళి నుంచే మొదలుపెట్టవచ్చు. పండగ రోజున దీపాలనే కాదు సరికొత్త ట్రెండ్‌తో వార్డ్ రోబ్‌లను కూడా వెలిగించవచ్చు. ప్రతి వేడుకలోనూ మెరిసిపోవచ్చు.
నియో–సంప్రదాయం
పాతకాలం నాటి కుర్తాలు, షేర్వాణీలు ఇప్పుడు కొత్తగా రూపాంతరం చెందాయి. ఈ దీపావళికి ఇవి ఎంతో అందంగా ఉంటాయి. అలాగే, లేయర్డ్ షేర్వాణీలు, ధోతీ ప్యాంట్‌లను ధరించవచ్చు. వీటిని మోడర్న్ డిజైన్, ఓల్డ్ ట్రెడిన్ తో మిళితం చేయచ్చు. ఈ మిక్స్ అండ్ మ్యాచ్ వల్ల సొగసైన రూపాన్ని పొందవచ్చు. ఇక నియాన్ కలర్స్ ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. వీటిలో బ్లూ, రెడ్, గ్రీన్, ఎల్లో కలర్స్ చాలా ప్రకాశవంతంగా ఉంటాయి. ఇవి సాధారణ రంగుల నుండి కాంతివంతంగా కనిపిస్తాయి.
పర్యావరణ అనుకూలం
సరైన అవగాహనతో ఫ్యాష పర్యావరణ అనుకూల బట్టల వైపు మొగ్గు చూపుతోంది. సేంద్రియ పత్తి, వెదురు, జనపనార బట్టలు స్థిరంగా ఉండటమే కాకుండా మట్టి సొబగులను కూడా వెదజల్లుతాయి. సురయ్యా, ఇతర ప్రముఖ బ్రాండ్‌లు ఈ ట్రెండ్‌లో ముందంజలో ఉన్నాయి.
చేతితో తయారు చేసిన పాదరక్షలు
పాదరక్షల్లో మన దేశీయ హస్తకళా నైపుణ్యం తనదైన ముద్ర వేస్తోంది. జూతీలు, కొల్హాపురీ, ఎంబ్రాయిడరీ ఇతర అలంకారాలతో చేతితో తయారు చేసిన పాదరక్షలలో దేనిని ఎంపిక చేసుకున్నా పండగ కళ కనిపిస్తుంది. ఇవి కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా ఉండటమే కాకుండా, వేడుకలో ప్రత్యేకమైన టచ్‌ను అందిస్తాయి.పేస్టల్స్ పెరుగుదల
దీపావళి ప్రకాశవంతమైన రంగులకు పర్యాయపదంగా ఉన్నప్పటికీ, లావెండర్, మింట్, బేబీ పింక్ పేస్టెల్ కలర్స్ పండుగ కళను పెంచుతాయి. ఈ రంగులు ప్రశాంతతతోపాటు రిచ్‌నెస్‌ను కళ్లకు కడతాయి.
డిజిటల్ ప్రింట్లు
సాంప్రదాయ మూలాంశాలు
సాంకేతికత మన జీవితంలోని ప్రతి రంగాన్నీ ప్రభావితం చేస్తున్నప్పుడు ఫ్యాషన్‌ను మాత్రం ఎందుకు వదిలివేయాలి... అందుకే, లోటస్ లేదా పీకాక్ ఫెదర్స్‌తో కూడిన భారతీయ సంప్రదాయ మూలాంశాలను ప్రదర్శించే డిజిటల్ ప్రింట్లు గొప్పగా కనిపిస్తున్నాయి. ఈ ప్రింట్లు, డిజైన్లు సంప్రదాయానికి ఆధునిక టచ్‌ను అందిస్తున్నాయి.
పాతకాలపు డిజైన్ల పునరుద్ధరణ
బనారసీ సిల్క్స్, చికంకారి ఎంబ్రాయిడరీ, బంధని వంటి పాతకాలపు వస్త్రాల ఆకర్షణ మళ్లీ మళ్లీ ఆకట్టుకుంటుంది. డిజైనర్లు ఈ సంప్రదాయ వస్త్రాలను ఆధునిక దుస్తులలో డిజైన్ చేస్తున్నారు. మనదైన గొప్ప వారసత్వాన్ని దేశీయ కళాకారులు కాపాడుతున్నారు.
(చదవండి: అందాల చందమామ కాజల్ ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!)
Comments
Please login to add a commentAdd a comment