నా కొడుకు అలాంటివాడు కాదు.. | Father of Orlando shooter says he doesn't believe his son was gay | Sakshi
Sakshi News home page

నా కొడుకు అలాంటివాడు కాదు..

Published Thu, Jun 16 2016 9:05 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM

నా కొడుకు అలాంటివాడు కాదు..

నా కొడుకు అలాంటివాడు కాదు..

వాషింగ్టన్: ఆర్లెండో షూటర్ ఒమర్ మతీన్ స్వలింగ సంపర్కుడనే విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు అతడి తండ్రి సిద్దిఖీ అన్నారు. విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి 40మంది పొట్టన పెట్టుకున్న తన కుమారుడి చర్య క్షమించరానిదన్నారు.  తన కొడుకు ప్రవర్తనపై ఇప్పుడే సందేహం కలుగుతుందన్నారు. అయితే మతీన్ ప్రవర్తనతో పాటు, అతడు ఈ దుర్ఘటనకు పాల్పడతాడని తాము కలలో కూడా ఊహించలేదని సిద్దిఖీ తెలిపారు. ఎలాంటి అనుమానం వచ్చినా ఆపేందుకు ప్రయత్నించేవాళ్లమన్నారు. కాగా ఆర్లెండో మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఈ సందర్భంగా మతీన్ తండ్రి సిద్దిఖీ క్షమాపణ తెలిపారు.

కాగా తన కుమారుడికి స్వలింగ సంపర్కులంటే ద్వేషమని, రోడ్డుపైనే స్వలింగ సంపర్కులైన ఇద్దరు మగవాళ్లు బహిరంగంగా ముద్దు పెట్టుకున్న ఘటనతో మతీన్ కలత చెందే ఈ దారుణానికి పాల్పడినట్లు సిద్దిఖీ గతంలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు స్వలింగ సంపర్కుల క్లబ్‌ పల్స్‌క్లబ్‌కు మతీన్‌ వచ్చేవాడని, అతడిని అక్కడ కనీసం ఓ డజన్ సార్లు అయినా చూసినట్లు ఇతర క్లబ్ సభ్యులు వెల్లడించారు. అతడు ఇటీవలే ఒక గే సభ్యునితో యాప్‌ ద్వారా డేటింగ్‌కు యత్నించినట్టు కూడా తెలుస్తోంది. ఫ్లోరిడా రాష్ట్రం ఆర్లెండోలోని నైట్ క్లబ్లో ఒమర్ మతీన్ జరిపిన కాల్పుల్లో 50 మంది మరణించగా, మరో 50 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement