విదేశాంగ మంత్రి అయిన ఆమె దేశంలోనే తొలి మహిళా గే పార్లమెంటేరియన్‌గా ఆశ్చర్యపరిచింది. ఇలా తాను స్వలింగ సంపర్కురాలిని అని బహిరంగ పర్చడమే గాకుండా తన చిరకాల భాగస్వామిని పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఎవరంటే ఆమె..
ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ దేశంలోనే తొలి స్వలింగ మహిళా పార్లమెంటేరియన్. ఆమె తన భాగస్వామి సోఫీ అల్లౌచెతో దాదాపు రెండు దశాబ్దాలుగా కలిసే ఉంటోంది. ఇక తమ బంధాన్ని పెళ్లితో మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించుక్నునట్లు పేర్కొంది వాంగ్. తన కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో విదేశాంగ మంత్రి వాంగ్ స్వలింగ వివాహం చేసుకున్నారు.
ఇలా తమ వివాహం తమ కుటుంబ సభ్యుల సమక్షంలో జరగడం మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందని తెలిపింది వాంగ్. అందుకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ జంట దక్షిణ ఆస్ట్రేలియా రాజధాని అడిలైడ్‌లోని వైనరీలో గత రెండు దశాబ్దాలుగా కలిసి ఉన్నారని, శనివారమే పెళ్లితో ఒక్కటయ్యారని స్థానిక మీడియో పేర్కొంది. ఇక వాంగ్ సెనేట్‌లో దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
2002 నుంచి లేబర్ సెనేటర్‌గా ఆస్ట్రేలియా క్యాబినేట్ పదవిని పొంది తొలి ఆసియా వ్యక్తిగా వాంగ్ నిలిచింది. అయితే 2017లో ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహం చట్టబద్ధం అయింది. ఈ నేపథ్యంలో తమ వివాహాన్ని బహిరంగంగా వెల్లడించింది వాంగ్. ఆస్ట్రేలియాలో దాదాపు 1997 వరకు అన్ని రాష్ట్రాల్లో స్వలింగ సంపర్కంని నేరంగా భావించేది.
(చదవండి: పద్నాలుగేళ్ల వయసులోనే దేశాధ్యక్షుడు)
Comments
Please login to add a commentAdd a comment