'మా అబ్బాయికి తగిన వరుడు కావలెను'
ముంబై: ఇదో వివాహ ప్రకట. ఇదేంటి పొరపాటుగా ప్రకటన ఇచ్చారని అనుకుటున్నారా? కావాలనే నిజంగా ఇచ్చారు. సాధారణంగా అబ్బాయికి వధువు కావాలని ప్రకటన ఇస్తారు. కానీ ముంబైకు చెందిన ఓ మహిళ తమ అబ్బాయికి పెళ్లి చేసేందుకు వరుడు కావాలని ప్రకటన ఇచ్చారు. అతను గే కావడమే ఇందుకు కారణం. ఈ ప్రకటనకు సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చింది. చాలామంది నుంచి ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి.
ముంబై ఎల్జీబీటీ (స్వలింగ సంపర్కం, గే, ఉభయ సంపర్కం, లింగమార్పిడి) సమాజంలో హరీష్ అయ్యర్ పేరు సుపరిచితం. గేల హక్కుల కోసం పోరాడుతుంటారు. హరీష్ కోసం ఆయన తల్లి పై వివాహ ప్రకటన ఇచ్చారు. తాను చనిపోయేలోపు తమ అబ్బాయికి తగిన వరుడిని చూసి పెళ్లి చేయాలని హరీష్ తల్లి చెప్పారు.
స్వలింగ వివాహాలు సృష్టికి విరుద్ధమని సంప్రదాయవాదులు వాదిస్తుండగా, మరి కొందరు వీటికి మద్దతు ఇస్తున్నారు. స్వలింగ వివాహాలను కొన్ని దేశాలు చట్టబద్ధం చేస్తున్నాయి. ఇటీవల లక్సెంబర్గ్ ప్రధాని జేవియర్ బిటెల్ గే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.