matrimonial ad
-
అటు అమ్మాయి, ఇటు వ్యాపారం, ఇలాంటి పెళ్లి ప్రకటన ఎపుడైనా చూశారా?
పెళ్లి చేసి చూడు.. ఇల్లు కట్టు చూడు అన్నది మనం ఎప్పటినుంచో వింటున్న సామెత. కానీ ఒక యువకుడు తన పెళ్లి కోసం వినూత్నంగా ప్రయత్నించాడు. కూటికోసం కాదు.. కాదు.. కళ్యాణం కోసం కోటి విద్యలు అన్నట్టు మ్యాట్రిమోనియల్ సైట్లో ఒక ప్రకటన ఇచ్చాడు. తనవ్యక్తిగత వివరాలతోపాటు, ఆదాయం గురించి చెప్పాడు. అంతేకాదు ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఇది నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన 26 ఏళ్ల ఇన్వెస్టర్ పెళ్లి ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయిఒడ్డూ పొడుగు, ఇతర వివరాలతో పాటు తాను సంవత్సరానికి 29 లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే తన ఆదాయం ప్రతీ ఏడాదీ 54 శాతం వృద్ధి చెందుతోందన్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. తాను స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెట్టి బాగా లాభాలు ఆర్జిస్తున్నట్టు చెప్పుకొస్తూ తాను ఆర్థికంగా ఎలా నిలదొక్కుకున్నదీ వెల్లడించాడు. సేఫ్ ఇన్వెస్టింగ్ సంబంధించిన విజ్ఞానాన్ని స్వయంగా నేర్చుకున్నానని చెప్పాడు.అలా స్వీయ అనుభవంతో తన పెట్టుబడులు బాగా పెరిగాయని చెప్పాడు. ఆగండి.. స్టోరీ ఇక్కడితో అయిపోలేదు. మంచి లాభాలు సాధించాలంటే తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా నా దగ్గర ఉందంటూ ఊరించాడు. "సురక్షిత పెట్టుబడి"కి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటూ ఆఫర్ చేశాడు. ఆసక్తి ఉన్న ఎవరికైనా 16-స్లయిడ్ ప్రెజెంటేషన్ వాట్సాప్ ద్వారా పంపిస్తానని ప్రకటించాడు.What all bull market does to people. Rough calculations show that he was 10 year old when 2008 GFC hit us. @ActusDei - maybe someone from your team should reach out to him. Not for matrimonial but for that ppt! 😉 pic.twitter.com/9jAquIy1co— Samit Singh (@kumarsamit) October 6, 2024మాజీ-బ్యాంకర్ సమిత్ సింగ్ ఎక్స్‌లో ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. దీంతో నెటిజన్లు అంతా బిజినెస్ భాషలోనే కమెంట్లు వెల్లువెత్తాయి. "షార్ట్ సెల్లర్ (స్టాక్మార్కెట్లో షేర్ నష్టపోతుంది తెలిసి ముందే అమ్మేయడం) ఇన్వెస్టర్లా కనిపిస్తున్నాడు అని ఒకరు, విన్-విన్ సిట్యువేషన్‌ని టార్గెట్ చేసినట్టున్నాడు, అటు అమ్మాయిని వెదుక్కోవడం ఇటు, తన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్‌ను కూడా ప్రచారం చేసుకోవడం రెండూ ఒకేసారి చేస్తున్నాడు అంటూ మరొకరు కమెంట్ చేశారు. ‘‘అమ్మో..ఇతగాడు తొందర్లోనే వారెన్ బఫెట్ అయిపోయేలా ఉన్నాడు’’, ‘‘అమ్మాయి లక్షణాలకు సంబంధించిఎలాంటి డిమాండ్ లేదట.. అంటే కాల్ ఆప్షన్’’ అన్నమాట, ‘‘ఇదేదో మోసంలా ఉంది, జాగ్రత్తగా ఉండాలి..’’ఇలా రకరకాల కమెంట్స్ పోస్ట్ చేశారు. మొత్తానికి పీపీటి కమ్, మేట్రిమోనియల్యాడ్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. -
రీల్స్ చేసే భర్త కావాలి.. వైరలవుతున్న యువతి మ్యాట్రిమోనీ ప్రకటన
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు ఏడడుగులు వేసి ఒక్కటవుతున్నారు. పెళ్లి అంటే ఎన్నో పనులు ఉంటాయి. ఇందులో ముందుగా వరుడు, వధువును ఎంపిక చేసుకోవడం పెద్ద టాస్క్. ప్రేమ పెళ్లిలో ఈ ఇబ్బంది ఉండదు కానీ.. పెద్దలు కుదిర్చిన వివాహంలో అబ్బాయి లేదా అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఒకప్పుడు బంధువులు, పెళ్లిళ్ల పేరయ్యలు, తెలిసిన వాళ్లు సంబంధాలు తెచ్చేవారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చ్చిన అమ్మాయి, అబ్బాయి కావాలని పేపర్, మ్యాట్రిమోని వెబ్సైట్లలో ప్రకటనలు ఇచ్చే వరకు వచ్చింది. ఈ క్రమంలో ఓ యువతి తనకు కావాల్సిన వరుడి విషయంలో కొంచెం కొంచెం వింత నిబంధనలు పెట్టింది. ఇన్ఫ్లుయెన్సర్గా చేసే ఒక అమ్మాయి పెళ్లి కోసం ఇచ్చిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన రియా అనే యువతి వరుడు కావలెను అంటూ యాడ్ ప్రచురణ ఇచ్చింది. ఇందులో తనకు సరిపోయే రీల్ భాగస్వామి + పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్నానని తెలిపింది.. అతనికి కెమెరా ముందు సిగ్గు ఉండకూడదని, తనలో కలిసి కపుల్/రిలేషన్ రీల్స్ చేయాలని పేర్కొంది. కొత్త ఆలోచనలు MOI MOI లాంటి ట్రెండింగ్ మ్యూజిక్ రీల్స్‌కు ఆలోచనలు ఇవ్వాలని, అతడు జాయింట్ ఫ్యామిలీ అయ్యి ఉండకూడదని చెప్పింది తనను కలుసుకునే ముందు.. అమెజాన్ మినీ టీవీలో స్ట్రీమ్ అవుతున్న హాఫ్ లవ్ హాఫ్ అరెంజ్డ్ చూసి నాకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడో తెలుసుకోవాలని పేర్కొంది. అతడికి నా రీల్స్ / వ్లాగ్స్ ఎడిట్ చేయడానికి ప్రీమియర్ ప్రో వచ్చి ఉండాలి అని తెలిపింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. -
వైరల్ అవుతున్నపెళ్లి ప్రకటన
కోల్‌కతా: పెళ్లి చూపులు అనగానే మన పెద్దలు ఒక మాట చెప్పేవారు అటు, ఇటు ఏడు తరాల చూడాలి అని. అంటే అన్ని విషయాలు పూర్తిగా ఆరా తీయాలని. అయితే కాలం మారుతున్న కొద్ది అన్ని విషయాల్లో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు పెళ్లాయ్యక ఆడపిల్ల ఇంటి పట్టునే ఉండి, కుటుంబాన్ని చూసుకోవాలని కోరేవారు. నేడు ఇద్దరు జాబ్ చేస్తే బెటర్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి వధువు కావాలంటూ ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అతడి యాడ్ చూసిన వారంతా ‘నీకు ఈ జన్మలో పెళ్లి కాదు’ అని కుండ బద్దలు కొడుతున్నారు. మరి అంత వింత కోరిక ఏం కోరాడబ్బ అని ఆలోచిస్తున్నారు. ఏం లేదు సోషల్ మీడియాకు అడిక్ట్ అవ్వని అమ్మాయిని వధువుగా కోరాడు. దాంతో నెటిజన్లు నీకు పెళ్లి అవ్వడం.. నేను ప్రధాని కావడం రెండు ఒకటే అంటూ కామెంట్ చేస్తున్నారు. (పదేళ్లుగా లవర్ కోసం వెతుకులాట..) Prospective brides/grooms please pay attention. Match making criteria are changing 😌 pic.twitter.com/AJZ78ARrHZ — Nitin Sangwan, IAS (@nitinsangwan) October 3, 2020 నితిన్ సాంగ్వాన్ అనే ఐఏఎస్ అధికారి వధువు / వరుడు విషయంలో ఆలోచనలు మారుతున్నాయి అంటూ పేపర్లో వచ్చిన ఓ యాడ్‌ని ట్విట్టర్లో షేర్ చేశాడు. పశ్చిమ బెంగాల్ కమర్పూర్‌కు వ్యక్తి ‘చటర్జీ 37/5’7” యోగా ప్రాక్టీషనర్, అందమైన, ఎటువంటి దురలవాట్లు లేని, హైకోర్టులో న్యాయవాది, పరిశోధకుడు. ఇళ్లు, కారు ఉన్నాయి. తల్లిదండ్రులు ఉన్నారు. కమర్పుకుర్‌లో మరో ఇల్లు, కట్నం అడగని వరుడికి అందమైన, పొడవైన, సన్నని వధువు కావాలి.. ముఖ్యంగా ఆమె సోషల్ మీడియాకు బానిస కాకూడదు’ అంటూ ఇచ్చిన ప్రకటన ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిపై నెటిజనులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు నీకు ఇక ఈ జన్మలో పెళ్లి కాదు అని కామెంట్ చేస్తుండగా మరి కొందరు మాత్రం ఇదేం వివక్ష.. మహిళలకు సోషల్ మీడియా చూసే స్వేచ్ఛ కూడా లేదా అని మండి పడుతున్నారు. -
'మా అబ్బాయికి తగిన వరుడు కావలెను'
ముంబై: ఇదో వివాహ ప్రకట. ఇదేంటి పొరపాటుగా ప్రకటన ఇచ్చారని అనుకుటున్నారా? కావాలనే నిజంగా ఇచ్చారు. సాధారణంగా అబ్బాయికి వధువు కావాలని ప్రకటన ఇస్తారు. కానీ ముంబైకు చెందిన ఓ మహిళ తమ అబ్బాయికి పెళ్లి చేసేందుకు వరుడు కావాలని ప్రకటన ఇచ్చారు. అతను గే కావడమే ఇందుకు కారణం. ఈ ప్రకటనకు సోషల్ మీడియాలో విశేష స్పందన వచ్చింది. చాలామంది నుంచి ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. ముంబై ఎల్జీబీటీ (స్వలింగ సంపర్కం, గే, ఉభయ సంపర్కం, లింగమార్పిడి) సమాజంలో హరీష్ అయ్యర్ పేరు సుపరిచితం. గేల హక్కుల కోసం పోరాడుతుంటారు. హరీష్ కోసం ఆయన తల్లి పై వివాహ ప్రకటన ఇచ్చారు. తాను చనిపోయేలోపు తమ అబ్బాయికి తగిన వరుడిని చూసి పెళ్లి చేయాలని హరీష్ తల్లి చెప్పారు. స్వలింగ వివాహాలు సృష్టికి విరుద్ధమని సంప్రదాయవాదులు వాదిస్తుండగా, మరి కొందరు వీటికి మద్దతు ఇస్తున్నారు. స్వలింగ వివాహాలను కొన్ని దేశాలు చట్టబద్ధం చేస్తున్నాయి. ఇటీవల లక్సెంబర్గ్ ప్రధాని జేవియర్ బిటెల్ గే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. -
పెళ్లికూతుర్ని చూద్దామని వెళ్లి బుక్ అయ్యాడు..
చెన్నై: మలి వయసులో తోడు కోసం పెళ్లి ప్రకటన ఇచ్చిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి చేదు అనుభవం ఎదురైంది. ఏదో అనుకుంటే ....ఇంకేదో అయిందన్నది ఈ పెద్దాయనకు సరిగ్గా అతికినట్టు సరిపోతుంది. చివరికి సమయస్ఫూర్తిగా వ్యవహరించి పెళ్లి మాట దేవుడెరుగు .. బతుకు జీవుడా అనుకుంటూ పెద్ద ప్రమాదం నుంచి బైటపడ్డ వైనం చైన్నై తాంబరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒంటరిగా ఉండలేక పెళ్లి చేసుకుందాం అనుకున్నారు చెన్నైకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రామ్మూర్తి. భార్యనుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న ఆయనకు..ఆలోచన వచ్చిందే తడవు...వధువు కావాలి అని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. అనుకున్నట్టుగానే స్పందన కూడా బాగానే వచ్చింది. వైష్టవి అనే 35ఏళ్ల మహిళ ఫోన్ చేసి.. కోయంబేడు బస్‌స్టాప్‌కు రమ్మని ...మిగతా వివరాలు మాట్లాడుకుందామని చెప్పింది.. ఇంతవరకు బాగానే ఉన్నా..ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్.. పెళ్లికూతుర్ని చూడాలని ఆతృతగా వెళ్లిన రామ్మూర్తితో వైష్ణవి కలిసి మాటలు కలిపింది. వారిద్దరూ మాట్లాడుకుంటుండగానే ఇంతలో నలుగురు యువకులు హఠాత్తుగా చుట్టుముట్టి రామ్మూర్తిపై దాడి చేశారు. నిమిషాల్లో వైష్ణవితోపాటు, ఆ నలుగురు యువకులు ఆయన్నిఎత్తి కారులో వేశారు. రెండు రోజులు నగరమంతా తిప్పారు. చివరికి ఒక బ్యాంక్ దగ్గరికి తీసుకువెళ్లి రామ్మూర్తి ఖాతాలో ఉన్న రూ.35 లక్షలు డ్రా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో అప్రమత్తమైన రామ్మూర్తి తెలివిగా వ్యవహరించి తాను కిడ్నాప్ అయిన విషయాన్ని బ్యాంక్ అధికారుల చెవిన వేశాడు. వెంటనే అప్రమత్తమైన బ్యాంక్ సిబ్బంది తాంబరం పోలీసులకు సమాచారమందించారు. హుటాహుటిన పోలీసు బృందం స్పాట్‌కు చేరుకుంది. అయితే దీన్ని గమనించిన ఆ ముఠా ..వైష్ణవితో పాటు అక్కడ నుంచి ఉడాయించింది. దాంతో బతుకు జీవుడా అనుకున్న రామ్మూర్తి ..అక్కడ నుంచి బయటపడ్డాడు.