Former New Zealand Cricketer Heath Davis Reveals That He Is Gay, Details Inside - Sakshi
Sakshi News home page

నేను స‍్వలింగ సంపర్కుడిని: సంచలన ప్రకటన చేసిన కివీస్‌ మాజీ క్రికెటర్‌

Published Tue, Aug 2 2022 11:49 AM | Last Updated on Tue, Aug 2 2022 12:12 PM

Former New Zealand Cricketer Heath Davis Reveals That He Is Gay - Sakshi

హీత్‌ డెవిస్‌(PC: Twitter)

న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ హీత్‌ డెవిస్‌ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలక ప్రకటన చేశాడు. తాను స్వలింగ సంపర్కుడినని వెల్లడించాడు. ఈ విషయం ఆక్లాండ్‌ దేశవాళీ క్రికెట్‌ జట్టులోని ప్రతి ఒక్కరికి తెలుసనని, అయినప్పటికీ తన పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదని చెప్పుకొచ్చాడు. 

ఇన్నాళ్లు ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా గోప్యంగా ఉంచానని.. అయితే దీని కారణంగా కాస్త మానసిక ఒత్తిడికి గురైనట్లు డెవిస్‌ తెలిపాడు. తాను ‘గే’ను అని ఇక దాచిపెట్టడం ఇష్టలేకనే ఈ విషయం బయటపెడుతున్నట్లు పేర్కొన్నాడు.

వాళ్లు నన్నేమీ అనలేదు!
ఈ మేరకు 50 ఏళ్ల హీత్‌ డెవిస్‌ ఆన్‌లైన్‌ మ్యాగజీన్‌ ది స్పిన్‌ఆఫ్‌తో మాట్లాడుతూ.. ‘‘నా జీవితంలోని ఈ విషయం గురించి దాచిపెడుతున్నాననే భావన ఉండేది. నిజానికి ఇది నా వ్యక్తిగతం.. అయినా ఎందుకో దాచిపెట్టాలనిపించలేదు. బయటి ప్రపంచానికి చెప్పాలనుకున్నా. ఆక్లాండ్‌లో జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి నేను గే అని తెలుసు. అయినా వాళ్లు దీనిని పెద్ద సమస్యగా భావించలేదు. నన్ను నాలా స్వేచ్ఛగా ఉండనిచ్చారు’’ అని చెప్పుకొచ్చాడు. 

రెండో ఇంటర్నేషనల్‌ క్రికెటర్‌.. మొదటి కివీస్‌ ఆటగాడు..
కాగా మహిళా క్రికెటర్లలో చాలా మంది ఇప్పటికే తమ సహచర ప్లేయర్లను ప్రేమించి స్వలింగ సంపర్క వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, పురుష క్రికెటర్లలో ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లలో.. ఇంగ్లండ్‌ క్రికెటర్‌ స్టీవెన్‌ డేవీస్‌ మాత్రమే తాను గే అని 2011లో బహిరంగంగా ప్రకటించాడు. అతడి తర్వాత ఇలాంటి సంచలన ప్రకటన చేసిన రెండో పురుష క్రికెటర్‌గా హీత్‌ డెవిస్‌ నిలిచాడు. 

ఇక న్యూజిలాండ్‌ అంతర్జాతీయ క్రికెటర్లలో గే అని చెప్పుకొన్న మొదటి ఆటగాడు ఇతడే కావడం విశేషం. కాగా న్యూజిలాండ్‌లో స్వలింగ సంపర్కం నేరం కాదన్న విషయం తెలిసిందే. అదే విధంగా స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్దత ఉంది. ఇదిలా ఉంటే.. కివీస్‌ తరఫున 1994, ఏప్రిల్‌లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో పేసర్‌ హీత్‌ అడుగుపెట్టాడు.

ఆ తర్వాత అదే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే పెద్దగా విజయవంతం కాని హీత్‌ డెవిస్‌ 1997లో తన చివరి వన్డే, టెస్టు మ్యాచ్‌ ఆడాడు. టెస్టుల్లో మొత్తంగా 17, వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. అనంతరం 2003లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లి అక్కడ కోచ్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో 2008లో ఆక్సిడెంట్‌ కారణంగా అతడి ఎడమకాలి పాదం కోల్పోయాడు.

చదవండి: Rohit Sharma: అందుకే ఆవేశ్‌ చేతికి బంతి! ఇదొక గుణపాఠం... మా ఓటమికి ప్రధాన కారణం అదే!
SuryaKumar Yadav: అయ్యో.. సూర్యకుమార్‌కు ఎంత కష్టం!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement