బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఓ గే.. | Queen's cousin Lord Ivar Mountbatten says he is gay | Sakshi
Sakshi News home page

బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఓ గే..

Published Mon, Sep 19 2016 9:28 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఓ గే..

బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఓ గే..

లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ సమీప బంధువు (కజిన్) లార్డ్ ఐవర్ మౌంట్బాటెన్  సంచలన విషయం చెప్పాడు. తాను గే అని ఆయన వెల్లడించాడు. ప్రఖ్యాత బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీలో ఇలా గే అని చెప్పిన తొలి వ్యక్తి మౌంట్బాటెనే.  

ఆయనకు మాజీ భార్య పెనెలొపె థామ్సన్ (పెన్నీ) ద్వారా ముగ్గురు సంతానం కలిగారు. లైంగికంగా తాను సమస్యలు ఎదుర్కొన్నానని, ప్రస్తుతం ఓ ఎయిర్లైన్ క్యాబిన్ సర్వీసెస్ డైరెక్టర్ జేమ్స్ కోయ్లెతో కలసి సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఇప్పుడు నిజమైన జీవితాన్ని గడుపుతున్నాని తెలిపాడు. తనకు పెళ్లికాకముందే తాను గే అనే విషయాన్ని పెన్నీకి చెప్పానని వెల్లడించాడు. తాను ఉభయ సంపర్కుడినని (బై సెక్సువల్) పెన్నీకి చెప్పానని, ఆమె ఈ విషయాన్ని అర్థం చేసుకుందని చెప్పాడు. క్వీన్ విక్టోరియాకు మౌంట్బాటెన్ మునిముని మనవడు అవుతాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement