బ్రిటిష్ రాణి ఎలిజబెత్ పెళ్లి కేకు ముక్క ఇది. ఎలిజబెత్ పెళ్లి 1947 నవంబర్ 20న జరిగింది. ఆ వేడుక కోసం తయారు చేసిన కేకులో ఒక ముక్కను గడచిన డెబ్భయి ఏడేళ్లుగా పదిలంగా భద్రపరచి ఉంచారు. బ్రిటిష్ రాచదంపతులు అప్పట్లో ఈ కేకు ముక్కను ఒక పెట్టెలో ఉంచి, ఎడిన్‌బర్గ్‌లోని హోలీరూడ్ హౌస్‌ను పర్యవేక్షించే మారియన్ పోల్సన్‌కు కానుకగా పంపారు.
నాటి నుంచి పెట్టెతో సహా ఈ కేకు ముక్కను భద్రంగా దాచారు. బ్రిటిష్ రాచదంపతుల నుంచి ఈ కేకు ముక్కలు అప్పట్లో మరికొందరికి కూడా కానుకగా అందాయి. వాటిలో కొన్నింటిని దశాబ్దాల పాటు దాచి, తర్వాతి కాలంలో వేలంలో అమ్ముకున్నారు. ఇటీవల ఈ కేకు ముక్క కూడా వేలానికి వచ్చింది. రీమన్ డెన్సీ వేలంశాల నిర్వహించిన వేలంలో ఈ కేకు ముక్కకు 2,200 పౌండ్లు (సుమారు రూ.2.40 లక్షలు) ధరకు అమ్ముడుపోయింది.
(చదవండి: కోడిపుంజులాంటి హోటల్..!)
Comments
Please login to add a commentAdd a comment