రాణి గారి వర్క్‌ రిపోర్ట్‌ Queen Elizabeth Work Report In Family | Sakshi
Sakshi News home page

రాణి గారి వర్క్‌ రిపోర్ట్‌

Published Thu, Jan 2 2020 12:30 AM | Last Updated on Thu, Jan 2 2020 12:30 AM

Queen Elizabeth Work Report In Family - Sakshi

రాజైనా పేదైనా పని చెయ్యాలి. పని చేస్తేనే గౌరవం. రాజు పెద్ద కావచ్చు. పేద చిన్న కావచ్చు. పనిలో మాత్రం చిన్నా పెద్ద తేడాలు ఉండవు. బ్రిటన్‌లో ప్రతి ఏడాది చివరా.. రాజ కుటుంబం ఆ ఏడాది ఎన్ని రోజులు పని చేసిందనే దానిపై లెక్కలు విడుదలౌతాయి! ఆ లెక్కల ప్రకారం.. 2019లో ఆ కుటుంబం మొత్తం పని చేసిన రోజులు సగటున 84.5. ఎలిజబెత్‌ రాణి గారు పని చేసిన రోజులు 67 కాగా, రాణి గారి కుమార్తె ప్రిన్సెస్‌ యాన్‌ పని చేసిన రోజులు 167. ఆ కుటుంబంలో ఎక్కువ రోజులు పని చేసింది ఈవిడే. రాణి గారి కుమారుడు ప్రిన్స్‌ చార్లెస్‌ పని చేసిన రోజులు 125. ఇంతకీ తక్కువ పని చేశారా, ఎక్కువ పని చేశారా? తక్కువ ఎక్కువల్ని పక్కన పెడితే.. బ్రిటన్‌లో గత ఏడాది పని దినాల సంఖ్య 253.ఇంతకీ రాచకుటుంబానికి ఏం పని ఉంటుంది అనేనా మీ సందేహం. అధికారిక పత్రాలపై సంతకం పెట్టడం కూడా పనే కదా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement