cake slice auctioned
-
77 ఏళ్ల నాటి కేకు ముక్క..!
బ్రిటిష్ రాణి ఎలిజబెత్ పెళ్లి కేకు ముక్క ఇది. ఎలిజబెత్ పెళ్లి 1947 నవంబర్ 20న జరిగింది. ఆ వేడుక కోసం తయారు చేసిన కేకులో ఒక ముక్కను గడచిన డెబ్భయి ఏడేళ్లుగా పదిలంగా భద్రపరచి ఉంచారు. బ్రిటిష్ రాచదంపతులు అప్పట్లో ఈ కేకు ముక్కను ఒక పెట్టెలో ఉంచి, ఎడిన్‌బర్గ్‌లోని హోలీరూడ్ హౌస్‌ను పర్యవేక్షించే మారియన్ పోల్సన్‌కు కానుకగా పంపారు. నాటి నుంచి పెట్టెతో సహా ఈ కేకు ముక్కను భద్రంగా దాచారు. బ్రిటిష్ రాచదంపతుల నుంచి ఈ కేకు ముక్కలు అప్పట్లో మరికొందరికి కూడా కానుకగా అందాయి. వాటిలో కొన్నింటిని దశాబ్దాల పాటు దాచి, తర్వాతి కాలంలో వేలంలో అమ్ముకున్నారు. ఇటీవల ఈ కేకు ముక్క కూడా వేలానికి వచ్చింది. రీమన్ డెన్సీ వేలంశాల నిర్వహించిన వేలంలో ఈ కేకు ముక్కకు 2,200 పౌండ్లు (సుమారు రూ.2.40 లక్షలు) ధరకు అమ్ముడుపోయింది. (చదవండి: కోడిపుంజులాంటి హోటల్..!) -
కేకు ముక్క ఖరీదు.. రూ. 1.33 లక్షలు!
విక్టోరియా మహారాణి పెళ్లినాటి కేకు ముక్కను వేలం వేస్తే.. ఏకంగా రూ. 1.33 లక్షలు పలికింది. అది 19వ శతాబ్దం నాటి కేకు ముక్క కావడం, అది కూడా రాణీగారి పెళ్లి కేకు కావడంతో ఈ స్థాయిలో ధర వచ్చింది. యువరాజు ఆల్బర్ట్‌తో విక్టోరియా మహారాణి పెళ్లి 1840లో జరిగింది. దీన్ని డేవిడ్ గైన్స్బరో రాబర్ట్స్ వేలానికి పెట్టారు. దాన్ని ప్యాక్ చేసిన ప్రజంటేషన్ బాక్సుమీద ''రాణీగారి పెళ్లి కేకు బకింగ్‌హామ్ ప్యాలెస్, ఫిబ్రవరి 10, 1840'' అని చెక్కి ఉంది. రాజముద్ర ఉన్న కాగితం మీద విక్టోరియా మహారాణి సంతకం కూడా ఆ కేకుతో పాటు ఉంచారు. లండన్‌లోని క్రిస్టీస్ వేలం శాలలో మోనార్క్ నిక్కర్లు, టైటానిక్ తాళాలు, విన్స్టన్ చర్చిల్ టోపీ కూడా వేలానికి వేశారని బీబీసీ తెలిపింది. అండర్‌వేర్‌కు రూ. 14.42 లక్షల రేటు పలికింది. నిజానికి దీనికి మహా అయితే 88 వేల నుంచి 1.6 లక్షల వరకు మాత్రమే వస్తుందని అంచనా వేశారు. జీవితాంతం అరుదైన వస్తువులను సేకరిస్తూ వచ్చిన రాబర్ట్స్ (70).. ఇప్పుడు వాటిని వేలం వేసి లక్షలకు లక్షలు ఆర్జిస్తున్నారు.