ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన | Apple CEO Tim Cook says he’s proud to be gay | Sakshi
Sakshi News home page

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన

Published Thu, Oct 30 2014 6:43 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన - Sakshi

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన

న్యూయార్క్: తాను స్వలింగ సంపర్కుడినని చెప్పుకోవడానికి గర్వంగా ఉందని ఆపిల్ కంపెనీ సీఈఓ టిమ్ కుక్ సంచలన ప్రకటన చేశారు. ఓ బిజినెస్ మ్యాగజైన్ కు రాసిన వ్యాసంలో 'నేను స్వలింగ సంపర్కుడి' నని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది అని కుక్ వెల్లడించారు. తన లింగత్వంపై వచ్చిన కథనాలను ఎప్పుడూ ఖండించలేదని,  బహిరంగంగా ప్రకటన చేయలేదన్నారు. ఆపిల్ కంపెనీలో చాలా మంది సహచరులకు తాను స్వలింగ సంపర్కుడినన్న విషయం తెలుసన్నారు.
 
స్వలింగ సంపర్కుడినని చెప్పడం అంత సులభం కాలేదని, ఇతరులకు ఉపయోగంగా ఉంటుందని ఈ విషయాన్ని బహిరంగపరిచానని వివరణ ఇచ్చారు. స్వలింగ సంపర్కుడిగా ఉండటం దేవుడు ఇచ్చిన వరంగా భావిస్తానని ఆయన తెలిపారు. ప్రజలందరికి సమాన హోదా ఉండేందుకు పోరాటం చేస్తానన్నారు. అంతేకాకుండా ఉత్తమ సీఈఓగా గుర్తింపు పొందడానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని టిమ్ కుక్ అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement