
టీనేజ్ బాలుడిని లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నప్రముఖ హాలీవుడ్ నటుడు కేవిన్ స్పెసీ క్షమాపణలు చెప్పారు. ఈ ఆరోపణలు తనను తీవ్ర భయోతాత్పానికి గురిచేశాయని చెప్పారు. ‘స్టార్ ట్రెక్: డిస్కవరీ’ నటుడు ఆంటోనీ ర్యాప్ ఇటీవల ఓ వెబ్‌సైట్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ కేవిన్ తనపై అఘాయిత్యాన్ని చేయబోయాడని వెల్లడించాడు.
1986లో కేవిన్ తనపై లైంగిక అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడని తెలిపాడు. ఆ సమయంలో ఇద్దరం బ్రాడ్‌వే షోలలో కలిసి పనిచేసేవాళ్లమని, తన ఇంటికి పార్టీకోసం కేవిన్ తనను పలిచాడని, అప్పుడు తన వయస్సు 14 ఏళ్లుకాగా, కేవిన్ వయస్సు 26 ఏళ్లు అని చెప్పాడు. పార్టీ ముగిసిన తర్వాత మద్యం మత్తులో ఉన్న కేవిన్ తనను బ్రెడ్‌రూమ్‌కు ఎత్తుకెళ్లి.. తనపై కూర్చున్నాడని, అతను ఏం చేస్తున్నాడో కూడా తనకు అప్పుడు అర్థం కాలేదని ర్యాప్ వివరించాడు. అతను ప్రవర్తన తనకు అర్థం కాకపోయినా.. అతను లైంగికంగా తనపై అఘాయిత్యం చేసేందుకు ప్రయత్నించాడని అతని తీరును బట్టి అర్థమైందని చెప్పాడు. ర్యాప్ ఆరోపణలపై కేవిన్ స్పందించాడు. మద్యం మత్తులో ఆ రోజు జరిగిందో తెలియదని, కానీ, ఆ రోజు జరిగిందానికి క్షమాపణ చెప్తున్నానని కేవిన్ తన ట్విట్టర్ పేజీలో పేర్కొన్నారు. తాను ప్రస్తుతం స్వలింగ సంపర్కుడి (గే)గా కొనసాగుతున్నట్టు చెప్పాడు. ప్రముఖ నిర్మాత వెయిన్‌స్టీన్ పలువురు మహిళలు, నటీమణులపై సాగించిన లైంగిక దాడులు హాలీవుడ్‌లో దుమారం రేపుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
హాలీవుడ్ నటుడు కేవిన్ స్పెసీ
Comments
Please login to add a commentAdd a comment