ప్రియుడి కోసం.. బిడ్డను చంపేశాడు! | gay kills young baby to possess partner | Sakshi
Sakshi News home page

ప్రియుడి కోసం.. బిడ్డను చంపేశాడు!

Published Sat, Mar 21 2015 7:56 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

gay kills young baby to possess partner

సోమందేపల్లి (అనంతపురం) :
అతని ఇద్దరి కూతుళ్లలో ఒకరు అనారోగ్యంతో చనిపోయారు.. మరో కూతురుని కూడా లేకుండా చేస్తే అతను తనవాడవుతాడని భావించి హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. అనంతపురం సోమందేపల్లి మండల పరిధిలోని కదిరేపల్లి శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం వద్ద చిన్నారిని హత్య చేసిన సంఘటనలో నిందితుడు గొల్లపల్లి శివశంకర్‌పై శనివారం కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. మొదట గుప్త నిధుల కోసం హత్య చేసినట్లు భావించినా పోలీసుల విచారణలో అసలు విషయాలు వెల్లడయ్యాయి.

పెనుకొండ డిఎస్పీ సుబ్బారావు అందించిన సమాచారం మేరకు పరిగి మండలం పైడేటికి చెందిన గొల్లపల్లి శివశంకర్ స్వలింగ సంపర్కుడు. ఇతనికి రొద్దం మండలం కలిపిమరువపల్లికి చెందిన నరసింహమూర్తి దూరపు బంధువు. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది. నరసింహ మూర్తి గ్రామంలో పాలు సేకరించి పైడేటి మీదుగా లేపాక్షికి తీసుకెళ్లేవాడు. అప్పుడప్పుడు శివశంకర్ కూడా అతనితో వెళ్లేవాడు. నరసింహమూర్తికి ఇద్దరు కూమార్తెలు. ఒక కుమార్తె ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా, మరో కూతురు హర్షిత (3) అంటే ప్రాణంగా చూసుకుంటున్నాడు. పలుమార్లు లేపాక్షికి వెళుతూ కూతురిని శివశంకర్‌కు అప్పగించి, తిరిగి వచ్చే సమయంలో తీసుకెళ్లేవాడు. శివశంకర్ స్వతహాగా స్వలింగ సంపర్కుడు కావడంతో.. అతడు నరసింహమూర్తిపై ఆశ పడ్డాడు.  

ఎలాగైనా తనవాణ్ణి చేసుకోవాలని భావించాడు. కొన్ని రోజుల క్రితం తనను పెళ్లి చేసుకొమ్మని శవశంకర్ నరసింహమూర్తిని అడిగాడు. ఆడదానిగా మారితే చేసుకొంటానని నరసింహమూర్తి చెప్పాడు. దీంతో గోవా వెళ్లి సెక్స్ మార్పిడి చేయించుకోవాలని శవశంకర్ నిర్ణయించుకొన్నాడు. ఓ గేదెను అమ్మి కొంత సొమ్ము కూడా సిద్ధం చేసుకున్నాడు. కానీ నరసింహమూర్తికి తనమీద కన్నా కూతురు హర్షితపైన ప్రేమ ఎక్కువగా ఉందని, ఎలాగైనా ఆ చిన్నారిని అంతమొందిస్తే తనపైన ప్రేమ పెరగుతుందని భావించాడు. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో నరసింహమూర్తి కూతురుని శివశంకర్‌కు అప్పగించి పాలు తీసుకుని లేపాక్షి వెళ్లాడు. శివశంకర్ వెంటనే ఆపాపను తీసుకుని కదిరేపల్లి వైపు పాపని హింసిస్తూ పాప ఏడుస్తుంటే ఆనందిస్తూ వెళ్లాడు. కదిరేపల్లి వద్దకు రాగానే పాప చనిపోయింది. పాపను ఎక్కడైనా పడేసి వెళ్లాలని అనుకొన్నాడు. ఇంతలోనే గ్రామస్తులకు చిక్కడంతో విషయం బయటపడింది. పోలీసులను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో మొదట గుప్త నిధులు, దొంగ అడ్రస్సులు ఇచ్చాడని డీఎస్పీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement