యాపిల్ సీఈవో టీమ్‌కుక్
న్యూయార్క్ : స్వలింగ సంపర్కడి(గే)గా ఉండటం తనకు దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నానని ఐటీ దిగ్గజం యాపిల్ సీఈవో టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు. సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను గే అయినందుకు గర్వపడుతున్నాను. నేను గే అని ప్రపంచానికి తెలిసాక చాలా మంది నాకు ఉత్తరాలు రాసి వారి బాధలు చెప్పుకున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు వారి ఆవేదనను పంచుకున్నారు. నేను గే అని తెలిసాక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన నుంచి చాలా మంది బయటపడ్డారు. అలాంటి వారిలో ధైర్యం నింపెందుకు నేను ప్రయత్నిస్తున్నాను. స్వలింగ సంపర్కులైనా జీవితంలో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయవచ్చు.’ అని తెలిపారు.
కాగా 2014లో టిమ్‌కుక్ తాను స్వలింగ సంపర్కుడినంటూ బహిరంగ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇంటర్వ్యూలో పన్నులకు సంబంధించి అమెరికా ప్రధాని డోనాల్డ్ ట్రంప్ పాలసీలను సైతం ప్రస్తావించారు. కార్పోరేట్ పన్ను కోతలపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కుక్ ప్రశంసించారు. ఇది అమెరికాలో మరిన్ని పెట్టుబడులకు సహాయపడుతుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment