తల్లిదండ్రులు సమాజంలో ఎంతటి గొప్ప స్థితిలో ఉన్న వారికి పుట్టే పిల్లలు బాగుండాలని రూల్ లేదు. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. సామరస్య పూర్వకంగా వాస్తవాన్ని అంగీకరిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అంగీకరించేందుకు సిద్ధపడకపోవడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. ఇది వాళ్లకు తెలియకుండానే వారి వాళ్లేనే శత్రువులా చేసి..వారిలోని దుర్మార్గం అనే కోణాన్ని పరిచయం చేస్తుంది.
వివరాల్లోకెళ్తే..గుజరాత్‌కి చెందిన ప్రిన్స్ మన్వేంద్ర సింగ్ గోహిల్ రాజ్‌పిప్లా మహారాజుల వారసుడు. అతను స్వలింగ సంపర్కుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే దీన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కొడుకుకి బ్రెయిన్ శస్త్ర చికిత్స చేయించి.. మాములు వ్యక్తి మాదిరిగా మార్చాలనుకున్నారు. అందుకోసం వైద్యులను సంప్రదించి ఎలక్ట్రిక్ షాక్ థెరపీని ఇప్పించే యత్నం చేశారు. ఇది మన్వేంద్ర సింగ్ మనసుని మెలితిప్పినట్లు అనిపించింది. అయితే అతన తల్లిదండ్రలు తన పట్ల ప్రవర్తించే తీరుని తప్పుపట్ట లేదు.
వైద్యులు కూడా ఇది మాసికి రుగ్మత కాదని ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పడంతో వారి ప్రయత్నాలను విరమించుకున్నారు. బహుశా ఇదే అతనికి స్వలింగ సంపర్కుల కోసం కృషి చేయాలనేందుకు నాంది పలికిందేమో!. ప్రస్తుతం మన్వేంద్ర సింగ్ ఈ విషయమై సుప్రీం కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. తనలా చాలామంది స్వలింగ సంపర్కులు బాధపడుతున్నారని, సమాజానికి భయపడి వారికి ఆపరేషన్‌లు చేయిస్తున్నారంటూ న్యాయం కోసం పోరాడుతున్నాడు.
ఇది అమానుషం, చట్టం విరుద్ధం అని మన్వేంద్ర సింగ్ వాదన. అలాగే ఈ విషయమై తమ పిల్లలను హింసించే హక్కు తల్లిదండ్రలకు లేదంటూ స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడుతున్నాడు. భారత న్యాయవ్యవస్థ చాలా ఉదాసీనతగా ఉందని, కాబట్టి తనకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయంలో నా తల్లిదండ్రులనే కాదు ఇతర వ్యక్తులను కూడా ద్వేషించను. ఎందుకంటే ప్రజకు దీనిపై అవగాహన లేకపోవడమే అందుకు ప్రదాన కారణమని చెబుతున్నాడు.
వారికి వాస్తవాలను వివరించి, అవగాహన కల్పించడమే తన ధ్యేయం అని అంటున్నాడు. 2006లో ఈ యువరాజు మన్వేంద్ర సింగ్ కథ గుజరాత్ న్యూస్ ఛానల్స్ హాట్ టాపిక్‌గా నిలిచింది. అంతేగాదు అతను 2007లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఓప్రా విన్‌ఫ్రే షోకి గెస్ట్‌గా రావడం విశేషం. అతను గుజరాత్‌లో స్వలింగసంపర్కుల ఛారిటీ 'లకీషా'వ్యవస్థాపకుడు కూడా. రాజవంశస్తుడైన తన స్థితిని చూసి భయపడక స్థైర్యంగా బహిరంగంగా చెప్పడమే గాక తనలాంటి వాళ్ల కోసం పాటుపడటం గ్రేట్. 'రాజు' అంటే ఏంటో చూపించాడు మన్వేంద్ర సింగ్ గోపాల్.
Comments
Please login to add a commentAdd a comment