Lesibian
-
అతనో రాజవంశస్తుడు..కానీ 'గే' కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..
తల్లిదండ్రులు సమాజంలో ఎంతటి గొప్ప స్థితిలో ఉన్న వారికి పుట్టే పిల్లలు బాగుండాలని రూల్ లేదు. అన్నీ మనం అనుకున్నట్లు జరగవు. సామరస్య పూర్వకంగా వాస్తవాన్ని అంగీకరిస్తే ఎలాంటి సమస్య ఉండదు. కానీ అంగీకరించేందుకు సిద్ధపడకపోవడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. ఇది వాళ్లకు తెలియకుండానే వారి వాళ్లేనే శత్రువులా చేసి..వారిలోని దుర్మార్గం అనే కోణాన్ని పరిచయం చేస్తుంది. వివరాల్లోకెళ్తే..గుజరాత్‌కి చెందిన ప్రిన్స్ మన్వేంద్ర సింగ్ గోహిల్ రాజ్‌పిప్లా మహారాజుల వారసుడు. అతను స్వలింగ సంపర్కుడు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. అయితే దీన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోయారు. కొడుకుకి బ్రెయిన్ శస్త్ర చికిత్స చేయించి.. మాములు వ్యక్తి మాదిరిగా మార్చాలనుకున్నారు. అందుకోసం వైద్యులను సంప్రదించి ఎలక్ట్రిక్ షాక్ థెరపీని ఇప్పించే యత్నం చేశారు. ఇది మన్వేంద్ర సింగ్ మనసుని మెలితిప్పినట్లు అనిపించింది. అయితే అతన తల్లిదండ్రలు తన పట్ల ప్రవర్తించే తీరుని తప్పుపట్ట లేదు. వైద్యులు కూడా ఇది మాసికి రుగ్మత కాదని ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పడంతో వారి ప్రయత్నాలను విరమించుకున్నారు. బహుశా ఇదే అతనికి స్వలింగ సంపర్కుల కోసం కృషి చేయాలనేందుకు నాంది పలికిందేమో!. ప్రస్తుతం మన్వేంద్ర సింగ్ ఈ విషయమై సుప్రీం కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. తనలా చాలామంది స్వలింగ సంపర్కులు బాధపడుతున్నారని, సమాజానికి భయపడి వారికి ఆపరేషన్లు చేయిస్తున్నారంటూ న్యాయం కోసం పోరాడుతున్నాడు. ఇది అమానుషం, చట్టం విరుద్ధం అని మన్వేంద్ర సింగ్ వాదన. అలాగే ఈ విషయమై తమ పిల్లలను హింసించే హక్కు తల్లిదండ్రలకు లేదంటూ స్వలింగ సంపర్కుల హక్కుల కోసం పోరాడుతున్నాడు. భారత న్యాయవ్యవస్థ చాలా ఉదాసీనతగా ఉందని, కాబట్టి తనకు తప్పక న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ విషయంలో నా తల్లిదండ్రులనే కాదు ఇతర వ్యక్తులను కూడా ద్వేషించను. ఎందుకంటే ప్రజకు దీనిపై అవగాహన లేకపోవడమే అందుకు ప్రదాన కారణమని చెబుతున్నాడు. వారికి వాస్తవాలను వివరించి, అవగాహన కల్పించడమే తన ధ్యేయం అని అంటున్నాడు. 2006లో ఈ యువరాజు మన్వేంద్ర సింగ్ కథ గుజరాత్ న్యూస్ ఛానల్స్ హాట్ టాపిక్‌గా నిలిచింది. అంతేగాదు అతను 2007లో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఓప్రా విన్ఫ్రే షోకి గెస్ట్‌గా రావడం విశేషం. అతను గుజరాత్లో స్వలింగసంపర్కుల ఛారిటీ 'లకీషా'వ్యవస్థాపకుడు కూడా. రాజవంశస్తుడైన తన స్థితిని చూసి భయపడక స్థైర్యంగా బహిరంగంగా చెప్పడమే గాక తనలాంటి వాళ్ల కోసం పాటుపడటం గ్రేట్. 'రాజు' అంటే ఏంటో చూపించాడు మన్వేంద్ర సింగ్ గోపాల్. (చదవండి: చీర అందమే అందం! ఇటలీ వాసులనే ఫిదా చేసింది!) -
'ప్రేమంటే ప్రేమే!' ఆ బిల్లుపై తక్షణమే గర్వంగా సంతకం చేస్తా: జో బైడెన్
అమెరికా సెనేట్ స్వలింగ, కులాంతర వివాహాలను రక్షించడానికి సంబంధించిన కీలక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లుకు 12 మంది రిపబ్లికన్లతో సహా 61 మంది సభ్యుల్లో దాదాపు 36 మంది సభ్యుల ఆమోదం లభించింది. ఈ మేరకు సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమేర్ మాట్లాడుతూ...ఈ చట్టం చాలా కాలంగా వస్తోంది కానీ ఇప్పుడే ఆమోదం లభించింది. స్వలింగ, వర్ణాంతర వివాహాలను సమాఖ్య చట్టంలో పొందుపరిచేలా చేసింది ఈ బిల్లు. అమెరికా నిష్కళంకమైన సమానత్వం వైపు అడుగులు వేసేలా కీలకమైన బిల్లును ఆమెదించిందని అన్నారు. ఈ బిల్లు ప్రకారం యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం ఇద్దరు వ్యక్తుల వివాహం చేసుకుంటే అది ఆ రాష్ట్రంలో చెల్లుబాటు అయితే కచ్చితంగా దాన్ని గుర్తించాలి. అలాగే యూఎస్ రాజ్యంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన వివాహాల గుర్తింపుకు పూర్తి హామీ ఇస్తోంది. అంతేగాక యూఎస్ రాష్ట్రాలు తమ చట్టాలకు విరుద్ధంగా వివాహా లైసెన్స్‌ను జారీ చేయాల్సిన అవసరం ఈ బిల్లుకు లేదు. ద్వైపాక్షిక ఎన్నిక ద్వారా ఈ చట్టాన్ని రూపొందించారు. అంతేగాక స్వలింగ వివాహాలను జరుపుకోవడానికి అవసరమయ్యే వస్తువులు లేదా సేవలను అందించడానికి ఇష్టపడని సంస్థలకు మతపరమైన రక్షణను అందించే సవరణ కూడా ఉంది. ఈ బిల్లు మతస్వేచ్ఛ పునరుద్ధరణ చట్టం రక్షణను తగ్గించడం లేదా రద్దు చేయడం వంటివి చేయకుండా నిరోధించే నిబంధనను కలిగి ఉంది. జూలైలో ఆమోదించిన ఈ బిల్లుపై యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ సంతకం చేసే విధంగా ఈ చట్టాన్ని రూపొందించింది. సెనేట్ నవంబర్‌లో ఎన్నికల రోజు, జనవరిలో అధికారం చేపట్టే కొత్త చట్టసభల మధ్య ఈ బిల్లును ఆమోదించింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ....ఈ ద్వైపాక్షిక ఓటును ప్రశంసించడమే కాకుండా సెనేట్ ఈ బిల్లును ఆమోందించనట్లయితే గర్వంగా ఆ బిల్లుపై సంతకం చేస్తాను. స్వలింగ సంపర్కులైన యువత తాము పూర్తి సంతోషకరమైన జీవితాలను గడిపి, స్వంత కుటుంబాలను రూపొందించుకునేలా ఈ బిల్లు చేస్తోంది. సెనేట్ రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ యాక్ట్‌ని ఆమెదించడంతో అమెరికా ఒక ప్రాథమిక సత్యాన్ని పునరుద్ఘాటించే అంచున నిలబడి ఉంది. 'ప్రేమనేది ఎప్పటికే ప్రేమే' అమెరికన్లు తమకు నచ్చిన వారిని వివాహం చేసుకునే హక్కును కలిగి ఉండాలి. అని బైడెన్ అన్నారు. (చదవండి: చిన్నారికి అత్యవసర శస్త్ర చికిత్స...ఆ రక్తం వద్దంటూ కోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు) -
ప్రేమకు లింగ భేదం లేదు!
న్యూఢిల్లీ: ప్రేమకు హద్దులు, అవధులు లేవని.. చట్టాలు కూడా తమను అడ్డుకోలేవని నగరానికి చెందిన ఇద్దరు హోమోసెక్సువల్స్ నిరూపించారు. ఐపీసీ 377 ప్రకారం భారతదేశంలో హోమో సెక్సువల్స్ కు స్వేచ్ఛగా తిరిగే అనుమతి లేకపోయినా, అది చట్ట ఉల్లంఘన అని తెలిసినా.. వాళ్లిద్దరూ తమ ప్రేమయాత్రను ఫోటో షూట్ ద్వారా చిత్రించి ప్రేమోత్సవాన్ని జరుపుకున్నారు. ఎవరిని ప్రేమించాలో నిర్ణయించుకునే శక్తి వారికే ఉందని నమ్మే ఫోటో గ్రాఫర్ ఈ జంటకు దొరకడంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఢిల్లీకి చెందిన ఫోటో గ్రాఫర్ ప్రియమ్ మల్హోత్రా సాయంతో ఆ జంట తమ ప్రేమానుభూతుల క్షణాలను కెమెరాలో బంధించుకున్నారు. ఈ అద్భుత చిత్రాలను మల్హోత్రా 'లవ్ బియండ్ జండర్' పేరుతో ఫేస్ బుక్ లో ఉంచారు. కాగా, కుటుంబాలకు వదిలేసి.. ప్రేమ కోసం బయటకు వచ్చిన ఓ జంట చిత్రాలను తీయడం ఓ గొప్ప అవకాశమని ఆయన అన్నారు. అయితే వీరి ఫోటోలను తీసేపుడు కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయని చెప్పారు. ఫోటో షూట్ కు ఒప్పుకున్నప్పుడు ఫోటోల్లో ఉన్న వ్యక్తులెవరో తెలియకుండా, క్రియేటివ్ గా ఫోటోలను తీయాల్సిన పరిస్థితి వచ్చిందట. , ఒక్కసారి ఈ చిత్రాలను చూస్తే ఆ విషయంలో మల్హోత్రా ఎంతలా విజయం సాధించారో అర్ధం అవుతుంది. ఇందుకోసం ఎక్కువగా రంగులు, లైట్లు, నీడలను ఉపయోగించినట్లు మల్హోత్రా తెలిపారు. ఫోటోలను తీసే సమయంలో కపుల్ చాలా కో-ఆపరేటివ్ గా ఉన్నారని చెప్పారు. ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న లెసిబియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్ జండర్(ఎల్బీజీటీ) కమ్యూనిటీకు మల్హోత్రా పెద్ద సపోర్టర్. కేవలం ఒకే ఒక గంటలో ఫోటో షూట్ ను పూర్తి చేసిన మల్హోత్రా ఎల్జీబీటీ జెండా రంగులన్నింటినీ ఇందుకు ఉపయోగించాడు. దక్షిణ ఢిల్లీలో ఉన్న గ్రాఫిటీని కూడా ఇందుకు వినియోగించుకున్నారు.