
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల బాలుడిపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితుడి తల్లి వీణారెడ్డి శుక్రవారం మీడియా ముందుకు వచ్చింది. గోనె భరత్‌రెడ్డి హోమో సెక్సువల్ కావడం వల్ల వేధింపులతోనే దూరంగా ఉంటున్నానని తెలిపింది. కామంతో కళ్లు మూసుకుపోయిన తన భర్త సొంత కుమారుడినే చెరపట్టాడని మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యింది. భార్యాభర్తలుగా మేము విడిపోయి ఉంటున్న క్రమంలో భరత్‌రెడ్డి తనను మభ్యపెట్టి కుమారుడిని అతని వద్దే ఉండేలా చేసుకున్నాడని వీణారెడ్డి ఆరోపించింది. తన కొడుకుపై కర్కషంగా వ్యవహరించిన గోనె భరత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీణారెడ్డి డిమాండ్ చేసింది.
చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment