mother complaint
-
తల్లితో ప్రేమ పెళ్లి.. కుమార్తెను కూడా పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి..
విజయనగరం: తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె కుమార్తెపై కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి తిరుపతి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి తల్లికి ఫోన్ చేసి బాలికను పెళ్లాడతానని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. చేసేది లేక ఆ తల్లి వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి పోలీసులు శనివారం తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన నక్కాన లక్ష్మికి 14ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. 17ఏళ్ల కుమార్తె ఉంది. కేటరింగ్‌లో పని చేస్తూ కుటుంబ పోషణ చేస్తున్న సమయంలో సురేష్ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించి, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో ఉన్న కుమార్తెపైన మోజుపడిన సురేష్, బాలికను వంచించాడు. డ్రైవర్‌గా పని చేస్తున్న సురేష్ తిరుపతి బేరంపైన వెళ్తున్నానని, ఒక టికెట్ ఖాళీగా ఉందని లక్ష్మికి నమ్మబలికి కుమార్తెను తీసుకెళ్లిపోయాడు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత లక్ష్మికి ఫోన్ చేసి తామిద్దరం పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆమె వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వన్‌టౌన్ సీఐ మురళి కిడ్నాప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉప్పల్‌లో దారుణం: నా భర్త కామపిశాచి.. కన్నకొడుకుపై కర్కషంగా..
సాక్షి, హైదరాబాద్: నాలుగేళ్ల బాలుడిపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితుడి తల్లి వీణారెడ్డి శుక్రవారం మీడియా ముందుకు వచ్చింది. గోనె భరత్‌రెడ్డి హోమో సెక్సువల్ కావడం వల్ల వేధింపులతోనే దూరంగా ఉంటున్నానని తెలిపింది. కామంతో కళ్లు మూసుకుపోయిన తన భర్త సొంత కుమారుడినే చెరపట్టాడని మీడియా ఎదుట కన్నీటిపర్యంతమయ్యింది. భార్యాభర్తలుగా మేము విడిపోయి ఉంటున్న క్రమంలో భరత్‌రెడ్డి తనను మభ్యపెట్టి కుమారుడిని అతని వద్దే ఉండేలా చేసుకున్నాడని వీణారెడ్డి ఆరోపించింది. తన కొడుకుపై కర్కషంగా వ్యవహరించిన గోనె భరత్‌రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీణారెడ్డి డిమాండ్ చేసింది. చదవండి: (Hyderabad: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్) -
అమ్మా నీకో దండం!
పెరంబూరు: నా విషయంలో ఒక తల్లి ఏమేం చేయకూడదో అవన్నీ చేశావు. అమ్మా నీకో దండం అని నటి సంగీత ఆవేదనను వ్యక్తం చేశారు. దక్షిణాది భాషల్లో కథానాయకిగా పలు చిత్రాల్లో నటించిన సంగీతపై ఆమె తల్లి భానుమతి ఇటీవల తమిళనాడు మహిళా పోలీస్ కమిషన్‌లో ఫిర్యాదు చేసి కలకలానికి దారి తీసిన విషయం తెలిసిందే. తన కూతురు తన ఇంటిని అపహరించడానికి ప్రయత్నిస్తోందని, అవసాన దశలో ఉన్న తనను ఇంటి నుంచి బయటకు పొమ్మంటోంది లాంటి ఆరోపణలను ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నటి సంగీతకు నోటీసులు జారీ చేయడం, ఆమె తన భర్త క్రిష్‌తో కలిసి పోలీస్ కమిషనర్ ముందు హాజరవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో నటి సంగీత తన తల్లిపై ఆరోపణలు గుప్పిస్తూ తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అందులో ప్రియమైన అమ్మకు నన్ను ఈ లోకానికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు. నా పాఠశాల చదువును నిలిపేసి 13 ఏళ్లకే పనికి పంపావే అందుకు కృతజ్ఞతలు. ఖాళీ చెక్కులపై నీవు చెప్పినట్టల్లా సంతకాలు చేయించుకున్నావే అందుకు కృతజ్ఞతలు. పనికే వెళ్లకుండా, శ్రమ అన్నది తెలియని నీ కొడుకులకు మద్యం కోసం, డబ్బు కోసం నన్ను తప్పుడు పనులకు వాడుకున్నావే అందుకు కృతజ్ఞతలు. అందుకు నేను వ్యతిరేకించినప్పుడు సొంత ఇంటిలోనే నిర్భంధించావే అందుకూ కృతజ్ఞతలు. నేను గొడవ చేసి బయటకు వచ్చే వరకూ నాకు పెళ్లి చేయలేదే అందుకూ కృతజ్ఞతలు. నా భర్తపై ఒత్తిడి చేశావు, నా కుటుంబానికి సంతోషాన్ని దూరం చేసినందుకూ చాలా చాలా కృతజ్ఞతలు. ఒక తల్లి ఎలా ఉండకూడదో అలాంటి చేసి నాకు ఉదాహరణగా ఉన్నావు అందుకూ కృతజ్ఞతలు. చివరిగా నాపై అసత్యపు ఫిర్యాదు చేశావు అందుకూ కృతజ్ఞతలు. ఎందుకంటే నువ్వు ఒక మైనముద్రలో ఉన్న నన్ను పోరాడే ధైర్యవంతురాలిగా మారడానికి, ఆరితేరడానికి కారణం అయ్యావు. ఈ ఒక్క కారణంగానే నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనూ ఉంటాను. మోహం నుంచి నువ్వు ఒక రోజు బయటపడి నన్ను చూసి గర్వపడతావు అని నటి సంగీత పేర్కొంది. -
నటి సంగీతపై తల్లి ఫిర్యాదు
పెరంబూరు: తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నట్టు నటి సంగీతపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి సంగీత తల్లి పేరు భానుమతి. ఈమె స్థానిక వలసరవాక్కంలో నివశిస్తున్నారు. ఆ ఇల్లు తన మామగారి నుంచి ఆమె కు వచ్చింది. ఇంట్లో కింద భాగంలో భానుమతి నివశిస్తుండగా పైభాగంలో నటి సంగీత, క్రిష్ దంపతులు నివశిస్తున్నారు. ఇల్లు ప్రస్తుతం నటి సంగీత పేరుతో ఉంది. ఆ ఇంటిని వదిలి వెళ్లిపోవలసిందిగా సంగీత తల్లిపై ఒత్తిడి చేస్తోంది. దీనిపై భానుమతి ఇటీవల తమిళనాడు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సంగీత ఇంటిని తన అన్నా, తమ్ముడు అపహరిస్తారనే భయంతో తనను ఇల్లు వదిలి వెళ్లిపోమని ఒత్తిడి చేస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సంగీత తమ్ముడు ఆ మధ్య మరణించారు. భానుమతి అవసాన దశలో ఉన్నారు. ఇలాం టి పరిస్థితుల్లో తాను ఇల్లు విడిచి ఎక్కడికి పోవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సంగీతకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో ముడు రోజుల క్రితం సంగీత భర్త క్రిష్‌తో కలిసి కమిషన్ ఎదుట హాజరయ్యారు. అనంతరం ఈ వ్యవహారంపై ప్రశ్నించిన మీడియాతో సినిమాల గురించి అడగండి చెబుతాను, ఇది వ్యక్తిగత వ్యవహారం. దీని గురించి తానేం మాట్లాడను అని సంగీత బదులిచ్చారు. -
ప్రయోజకుడిని చేస్తే పట్టించుకోవడం లేదు
గన్నవరం: నవమాసాలు మోసి కని, పెంచి ప్రయోజకుడిని చేసిన ఒక్కగానొక్క కొడుకు విదేశాలకు వెళ్లి పట్టించుకోవడం లేదు...నమ్మిన బంధువులు ఆస్తులు కాజేసి నట్టేట ముంచారు..భర్తను కొల్పోయిన తాను నిలువనీడ లేక వృద్ధాప్యంలో రోడ్డున పడ్డానని ఓ వృద్ధురాలు బోరున విలపించడం చూపరులకు కంటతడి పెట్టించింది. జన్మనిచ్చిన తల్లి అనాథగా మరణించకుండా కనీసం వృద్ధాశ్రమంలోనైన చేర్పించే విధంగా తన కుమారుడితో మాట్లాడి న్యాయం చేయాలని ఆమె పోలీసులను శుక్రవారం వేడుకుంది. బాధిత వృద్ధురాలు తెలిపిన వివరాలు.. స్థానిక సొసైటీపేటకు చెందిన మరిమెళ్ల సత్యనాగకుమారి భర్త సుమారు 17 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఆయన మరణంతో వచ్చిన ప్రమాద బీమా నగదు రూ.6 లక్షలతో కొడుకుని లండన్‌లో ఎంఎస్ చదివించింది. చదువు అనంతరం అతను ప్రేమ వివాహం చేసుకుని ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. అదే సమయంలో ఆమె సోదరుడైన ఫణింద్రకు వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావడంతో దివాల తీశాడు. అతను చేసిన అప్పులకు తను హామీగా చెక్కులు ఇచ్చింది. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువైంది. అంతే కాకుండా పుట్టింటివారు ఇచ్చిన ఇంటిని జప్తు చేసేందుకు ప్రయత్నించడంతో వియ్యంకుడు ఒత్తిడి మేరకు తన కోడలు దీప్తి పేరున ఆస్తి రాసింది. కుమారుడు పట్టించుకోకపోవడంతో బంధువుల ఇంటి వద్ద తలదచుకుంటుంది. అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నానని, తన కుమారుడితో మాట్లాడి వృద్ధాశ్రమంలోనైన చేర్పించాలని సీఐ రవికుమార్ ఎదుట తన గోడు విన్నవించుకుంది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన సీఐ విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. -
ఆటోడ్రైవర్ బలవన్మరణం
కొవ్వూరు: పట్టణంలో బ్రిడ్జిపేటకి చెందిన ఓ వ్యక్తి భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. బ్రిడ్జిపేటలో నివాసముంటున్న పైలా శ్రీను (30) ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య కువైట్‌లో ఉంటూ ఇటీవల స్వదేశం వచ్చింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 6 గంటలకు శ్రీను ఆటో తీసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. 8.30 గంటల సమయంలో తిరిగి వచ్చాడు. తన భార్య కువైట్ నుంచి వచ్చిందని, అమ్మగారింట్లోనే ఉంటానని చెప్పిందని తల్లి పైడమ్మకు చెప్పాడు. రాత్రి 10 గంటల సమయంలో గదిలో లైటు వెలుగుతుందని కిటికీలో నుంచి తల్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. స్థానికులు సాయంతో తల్లి శ్రీనును ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. భార్య కాపురానికి రావడానికి నిరాకరించడంతో మనస్తాపం చెంది శ్రీను ఆత్మహత్యకు పాల్పడ్డాడని తల్లి పైడమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ పి.ప్రసాదరావు తెలిపారు.