పెరంబూరు: తనను ఇంటి నుంచి వెళ్లిపోవాలని బెదిరిస్తున్నట్టు నటి సంగీతపై ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి సంగీత తల్లి పేరు భానుమతి. ఈమె స్థానిక వలసరవాక్కంలో నివశిస్తున్నారు. ఆ ఇల్లు తన మామగారి నుంచి ఆమె కు వచ్చింది. ఇంట్లో కింద భాగంలో భానుమతి నివశిస్తుండగా పైభాగంలో నటి సంగీత, క్రిష్ దంపతులు నివశిస్తున్నారు. ఇల్లు ప్రస్తుతం నటి సంగీత పేరుతో ఉంది. ఆ ఇంటిని వదిలి వెళ్లిపోవలసిందిగా సంగీత తల్లిపై ఒత్తిడి చేస్తోంది.
దీనిపై భానుమతి ఇటీవల తమిళనాడు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సంగీత ఇంటిని తన అన్నా, తమ్ముడు అపహరిస్తారనే భయంతో తనను ఇల్లు వదిలి వెళ్లిపోమని ఒత్తిడి చేస్తోందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సంగీత తమ్ముడు ఆ మధ్య మరణించారు. భానుమతి అవసాన దశలో ఉన్నారు. ఇలాం టి పరిస్థితుల్లో తాను ఇల్లు విడిచి ఎక్కడికి పోవాలి అని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సంగీతకు కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో ముడు రోజుల క్రితం సంగీత భర్త క్రిష్‌తో కలిసి కమిషన్ ఎదుట హాజరయ్యారు. అనంతరం ఈ వ్యవహారంపై ప్రశ్నించిన మీడియాతో సినిమాల గురించి అడగండి చెబుతాను, ఇది వ్యక్తిగత వ్యవహారం. దీని గురించి తానేం మాట్లాడను అని సంగీత బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment