తల్లితో ప్రేమ పెళ్లి.. కుమార్తెను కూడా పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి.. | woman Complains On Husband Bullying Marriage To Daughter Vizianagaram | Sakshi
Sakshi News home page

తల్లితో ప్రేమ పెళ్లి.. కుమార్తెను కూడా పెళ్లి చేసుకుంటున్నానని చెప్పి..

Published Sun, Feb 13 2022 1:18 PM | Last Updated on Sun, Feb 13 2022 1:22 PM

woman Complains On Husband Bullying Marriage To Daughter Vizianagaram - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

విజయనగరం: తల్లిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమె కుమార్తెపై కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పి తిరుపతి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి తల్లికి ఫోన్‌ చేసి బాలికను పెళ్లాడతానని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. చేసేది లేక ఆ తల్లి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనికి సంబంధించి పోలీసులు శనివారం తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన నక్కాన లక్ష్మికి 14ఏళ్ల క్రితం భర్త చనిపోయాడు. 17ఏళ్ల కుమార్తె ఉంది. కేటరింగ్‌లో పని చేస్తూ  కుటుంబ పోషణ చేస్తున్న సమయంలో సురేష్‌ అనే వ్యక్తితో ప్రేమాయణం సాగించి, ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో ఉన్న కుమార్తెపైన మోజుపడిన సురేష్, బాలికను వంచించాడు.

డ్రైవర్‌గా పని చేస్తున్న సురేష్‌ తిరుపతి బేరంపైన వెళ్తున్నానని, ఒక టికెట్‌ ఖాళీగా ఉందని  లక్ష్మికి నమ్మబలికి కుమార్తెను తీసుకెళ్లిపోయాడు. తీరా అక్కడకు వెళ్లిన తర్వాత లక్ష్మికి ఫోన్‌ చేసి తామిద్దరం పెళ్లి చేసుకుంటున్నామని చెప్పి ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశాడు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో  ఆమె వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  వన్‌టౌన్‌ సీఐ మురళి కిడ్నాప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement