మృతి చెందిన చిరంజీవి
అన్నానగర్: కరూర్‌లో బుధవారం బెదిరించి స్వలింగ సంపర్కానికి పాల్పడ్డ విషయం కన్నవారికి చెపుతానని చెప్పిన పాఠశాల విద్యార్థిని మినీబస్సు కండక్టర్ హత్య చేశాడు. ఈ ఘటన కరూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. కరూర్ జిల్లా క.పరమత్తి సమీపంలో ఉన్న విసువనాథపురికి చెందిన విశ్వనాథన్ కుమారుడు చిరంజీవి (13). ఇతను అదే ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన చిరంజీవి సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కన్నవారు కుమారుడి కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికారు. అయినా చిరంజీవి ఆచూకీ తెలియలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలో బుధవారం ఎంజీఆర్‌నగర్ కాలువ సమీపంలో ఉన్న సీలైకోడులో ఓ బాలుడి మృతదేహం ఉన్నట్లు స్థానికులు క.పరమత్తి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతి చెందిన విద్యార్థి చిరంజీవి అని తెలిసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కరూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణలో చిరంజీవిని విశ్వనాథపురి సలైవైక్కల్ వీధికి చెందిన ప్రైవేట్ మినీ బస్సు కండక్టర్ ప్రదీప్ (19) మంగళవారం సాయంత్రం తీసుకుని వెళ్లినట్లుగా స్థానికులు తెలిపారు. అనంతరం ప్రదీప్‌ను పట్టుకుని పోలీసులు విచారణ చేయగా దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటకు వచ్చాయి. పాఠశాల ముగిసి ఇంటికి వెళుతున్న చిరంజీవిని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. అతన్ని బెదిరించి స్వలింగ సంపర్కానికి పాల్పడ్డాడు. భయపడిన చిరంజీవి విషయాన్ని తల్లిదండ్రులకు చెపుతానని తెలిపాడు. దీంతో ఆగ్రహం చెందిన ప్రదీప్ చొక్కాతో నోరు, ముక్కు గట్టిగా నులిమి పట్టుకున్నాడు. ఊపిరి ఆడక చిరంజీవి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. పోలీసులు ప్రదీప్‌ను అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment