చంఢీగఢ్ : ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా గుర్మీత్ రాం రహీమ్ సింగ్ రోహ్‌తక్ సునారియా జైలులో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. ఇటీవల జైలునుంచి విడుదలైన ఓ నిందితుడు రాహుల్ జైన్ పలు ఆశ్చర్యకర విషయాలు వెల్లడించాడు. తోటమాలిగా పనిచేస్తున్నందుకు డేరా బాబాకు రోజుకు రూ. 20 చొప్పున ఇస్తున్నామని పోలీసులు చెప్పినదాంట్లో వాస్తవం లేదన్నాడు.
'ముందుగా గుర్మీత్‌కు జైలులో ప్రత్యేక గది ఇచ్చారు. ఆ గది చుట్టుపక్కలకు కూడా ఇతర ఖైదీల్ని అనుమతించేవారు కాదు. ఆపై కావాలసినప్పుడల్లా పాలు, మినరల్ వాటర్, జ్యూస్‌లు అందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే సాధారణ ఖైదీల బంధువులు, సన్నిహితులు జైలుకు వస్తే కేవలం 20 నిమిషాలు మాత్రమే ఖైదీల్ని కలిసేందుకు పర్మిషన్ ఇస్తారు. కానీ డేరా బాబా మాత్రం గంటల తరబడి తనను కలిసేందుకు వచ్చేవారితో ముచ్చటిస్తాడు. అతడు ఏ పని చేయడం లేదని, కానీ తోటమాలిగా చేస్తున్నందుకు రోజుకు 20రూపాయలు గుర్మీత్‌కు ఇస్తున్నట్లు అందర్ని నమ్మిస్తున్నారని' జైలులో ఉన్పప్పుడు గుర్మీత్ తోటి ఖైదీ అయిన రాహుల్ వివరించాడు.
నిన్న (సోమవారం) గుర్మీత్‌ను కలిసేందుకు ఆయన కుటుంబసభ్యులు వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే వారు ఎందుకు కలిశారు, గుర్మీత్‌తో ఏం మాట్లాడారన్న దానిపై పోలీసులు, జైలు అధికారులు నోరు మెదపడం లేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment