అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. రోహ్‌తక్ జైలులో చేపట్టిన ప్రత్యేక విచారణలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జగ్‌దీప్ సింగ్.. తుది తీర్పును వెలువరించారు. ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ దోషిగా ఇదివరకే నిర్ధారించిన కోర్టు.. ఆ మేరకు సోమవారం కఠిన శిక్షను ఖరారు చేసింది.