Dera violence
-
అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష
-
అత్యాచారం కేసులో గుర్మీత్‌కు కఠిన శిక్ష
- 20 ఏళ్ల కారాగారశిక్ష విధించిన సీబీఐ కోర్టు రోహ్తక్: అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. రోహ్తక్ జైలులో చేపట్టిన ప్రత్యేక విచారణలో సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జగ్దీప్ సింగ్.. తుది తీర్పును వెలువరించారు. ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ దోషిగా ఇదివరకే నిర్ధారించిన కోర్టు.. ఆ మేరకు సోమవారం కఠిన శిక్షను ఖరారు చేసింది. బోరున విలపించిన గుర్మీత్: తనకు 20 ఏళ్ల శిక్ష పడగానే డేరా చీఫ్ గుర్మీత్ సింగ్ ఒక్కసారిగా బోరున విలపించారు. తాను ఏ తప్పూ చేయలేదని, నిరపరాదినని ఏడుస్తూ జడ్జికి మొరపెట్టుకున్నారు. రంగురంగుల దుస్తులు మాయం: శిక్ష ఖరారైన తర్వాత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు జైలులోనే వైద్య పరీక్షలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం ఆయనకు సెల్‌ను కేటాయించి, శిక్షఖైదీలకు ఇచ్చే తెల్లటి దుస్తులను అందించారు. ఇన్నాళ్లూ కళ్లుమిరుమిట్లు గొలిపేలా రంగురంగుల దుస్తులేసుకున్న బాబా మరో 10 ఏళ్లపాటు వాటికి దూరంగా ఉండాల్సిందే. శిక్షకు ముందు 10 నిమిషాలు: గతవారం సీబీఐ కోర్టు గుర్మీత్‌ను దోషిగా నిర్ధారించిన అనంతరం హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో శిక్ష ఖరారుకు సంబంధించిన విచారణ రోహ్తక్ జైలులోనే జరిగింది. జడ్జి జగ్దీప్ సింగ్ ఆదేశాల మేరకు అధికారులు జైలులోనే ఏర్పాట్లుచేశారు. చివరిసారిగా ఇరుపక్షాలూ చెరో 10 నిమిషాలు వాదించేందుకు జడ్జి అవకాశం కల్పించారు. దేశానికి గుర్మీత్ ఎంతో సేవచేశారు: డేరా బాబా గొప్ప సామాజిక సేవకుడని, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తించైనా నిరపరాధిగా విడిచిపెట్టాలని లేదా శిక్షను తగ్గించాలని డిఫెన్స్ న్యాయవాది వాదించారు. సీబీఐ వాదన: అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్‌కు 10 ఏళ్లు తక్కువ కాకుండా శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జడ్జికి విన్నవించారు. -
రాహుల్గాంధీలాగే ఆయన కూడా....
న్యూఢిల్లీ: హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మాదిరే హూడా కూడా అజ్నానంతో మాట్లాడుతున్నాడంటూ స్వామి విరుచుకుపడ్డారు. ‘అధికారం, పరిజ్నానం రెండూ లేకపోవటం మూలంగానే హూడా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రపతి పాలన విధించటం అంటే ఆషామాషీ కాదు. రాహుల్ గాంధీలాగానే హూడా కూడా అజ్నానంతో మాట్లాడుతున్నారు. బాంబే తీర్పును ఓసారి పరిశీలిస్తే విషయం అర్థమవుతుంది’ అంటూ స్వామి మాజీ సీఎంకు చురకలంటించారు. హరియాణాలో గుర్మీత్ దోషిగా తీర్పు, ఆపై డేరా అనుచరుల హింస దృష్ట్యా ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలంటూ శనివారం భూపిందర్ సింగ్ కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సుబ్రహ్మణ్య స్వామి ఇలా స్పందించారు. మరోవైపు రాష్ట్రం రావణ కాష్టంలా తగలబడుతుంటే సహకరించాల్సింది పోయి రాజకీయాలు చేస్తున్నారంటూ హూడాపై హరియాణా బీజేపీ నేత ఎస్ ప్రకాశ్ మండిపడ్డారు. డేరా సచ్చా సౌదా భూపిందర్ సింగ్ హుడా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకున్న విషయాన్ని గుర్తుచేస్తూ ఒకరకంగా ఈ హింసాకాండకు మీరు(హూడా) కూడా బాధ్యులేనని ప్రకాశ్ ధ్వజమెత్తారు. -
ఖట్టర్ వైఫల్యంపై బీజేపీ మౌనం.. ఇందుకేనా?
సాక్షి, న్యూఢిల్లీ: అత్యాచారం కేసులో గుర్మీత్ రామ్ రహీ సింగ్‌ను దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో హరియాణాలోని పంచకుల తగులబడడానికి కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అసమర్థతే కారణమని హరియాణా, పంజాబ్ హైకోర్టు తీవ్రంగా మందలించిన విషయం తెల్సిందే. ఇప్పటికీ కొనసాగుతున్న ఈ విధ్వంసకాండలో 31 మంది మరణించడం, 200 మందికిపైగా గాయాలపాలవడం అత్యంత విషాధకరం. ఇలాంటి సందర్భాల్లో ఆయన అసమర్థత బయట పడడం ఇదో మొదటి సారి కాదు. మూడుసార్లు ఆయన వైఫల్యం చెందారు. అయినప్పటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంగానీ, బీజీపీ అధిష్టానంగానీ ఆయన్ని ఏమీ అనదు. ఎందుకు? ఆయన వెనుక ఉన్నది ఎవరు? 2014లో జరిగిన అసంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ పేరు అనూహ్యంగా ముందుకు వచ్చింది. అప్పటికే హరియాణ ఆరెస్సెస్ ప్రచారక్‌గా ఖట్టర్ పనిచేస్తున్నప్పటికీ పార్టీకి వెలుపల ఆయనెవరో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు పార్టీలోగానీ, ప్రభుత్వంలోగానీ ఆయన ఏ పదవిని నిర్వహించలేదు. సరాసరి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత నెల రోజులకే, అంటే 2014, నవంబర్ నెలలో ఆయన అసమర్థత మొదటిసారి బయట పడింది. హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న బాబా రాంపాల్‌ను అరెస్ట్ చేసి తీసుకరావాల్సిందిగా కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడానికి పోలీసులు బర్వాలాలోని ఆయన ఆశ్రమానికి వెళ్లినప్పుడు భక్తులను అడ్డంపెట్టుకొని తప్పించుకునేందుకు బాబా రాంపాల్ ప్రయత్నించారు. అప్పుడు కూడా ఖట్టర్ ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. చివరకు రాంపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ జరిగిన ఘర్షణల్లో ఆరుగురు అమాయక భక్తులు మరణించారు. ఆ తర్వాత 2016లో ఉద్యోగ, విద్యారంగాల్లో తమకూ రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్లు చేసిన ఆందోళనను అరికట్టడంలోనూ మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం విఫలమైంది. హింసా, విధ్వంసకాండలో అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. సైన్యం రంగంలోకి దిగాకనే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇప్పుడు రామ్ రహీమ్ సింగ్ అరెస్ట్ కారణంగా పంచకుల అంటుకోవడంతో కాంగ్రెస్, జాతీయ లోక్‌దళ్ పార్టీలు మనోహర్ రాజీనామాను డిమాండ్ చేస్తున్నాయి. బీజేపీ నేతలు కూడాడిమాండ్ చేస్తున్నారుగానీ వారు పేరు బహిర్గతం చేయడానికి ఇష్టం పడడం లేదు. ముఖ్యమంత్రి విధి నిర్వహణలో తన సలహాదారులు, సన్నిహిత ఆరెస్సెస్ నేతల సలహాలను తప్ప ఎవరి మాట వినిపించుకోరని బీజేపీ నేతలు వాపోతున్నరు. ఆరుసార్లు శాసన సభ్యుడిగా విజయం సాధించిన రామ్ విలాస్ శర్మ, నాలుగు సార్లు ఎన్నికైన అనుల్ విజ్ లాంటి అనుభవజ్ఞులను వదిలేసి మనోహర్‌ను ఎందుకు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారో అర్థం కావడం లేదని స్థానిక నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని 1996లో హర్యానా పార్టీ ఇంచార్జీగా పార్టీ అధిష్టానం పంపించినప్పుడు పంచకులలో మోదీకి బస ఏర్పాటు చేసినదీ, ఆయనతోపాటు బసలో ఉన్నది మనోహర్ లాల్ ఖట్టర్ అనే విషయం గుర్తొస్తే ఆయన నియామకం వెనక ఎవరి హస్తం ఉన్నదో ఊహించడం పెద్ద కష్టం కాదు. -
హరియాణా సీఎం రాజీనామా చేయాలి: సురవరం
హైదరాబాద్: హరియాణా హింసాత్మక ఘటనలపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) ఘాటుగా స్పందించింది. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తక్షణమేరాజీనామా చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హింసాత్మక ఘటనలను అదుపు చేయటంతో ఖట్టర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సురవరం ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కొనసాగటానికి ఆయనకు ఎటువంటి అర్హత లేదని అన్నారు. జాట్ రిజర్వేషన్ ఉద్యమ సందర్భంలోనూ ఆయన ఇలాగే వైఫల్యం చెందారని విమర్శించారు. పంజాబ్, హరియాణాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసహనం పెరిగిపోయిందని అమాయకులపై దాడులు ఎక్కువయ్యాయని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. -
సీఎం ఖట్టర్ తొలగింపు: బీజేపీ క్లారిటీ
న్యూఢిల్లీ: గుర్మీత్ రాం రహీం సింగ్ మద్దతుదారుల విధ్వంసం నేపథ్యంలో హరియాణ ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్‌పై బీజేపీ అధిష్టానం వేటు వేయనుందని వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. హరియాణ సీఎంగా ఖట్టర్‌ను తొలగించే ప్రసక్తే లేదని బీజేపీ అధినాయకత్వం స్పష్టం చేసింది. హరియాణ బీజేపీ జనరల్ సెక్రటరీ డాక్టర్ అనిల్ జైన్, సీనియర్ నేత కైలాశ్ విజయ్వార్గియాతో భేటీ అయిన పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మేరకు స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా తాజా విధ్వంసం నేపథ్యంలో ఖట్టర్‌ను ఢిల్లీకి పిలిపించి.. వివరణ కోరే అవకాశం కూడా లేదని షా క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రాంరహీం సింగ్‌కు రేప్ కేసులో శిక్షపడటంతో ఆయన మద్దతుదారుల దాడులు, విధ్వంసంతో హరియాణ అట్టుడికిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హింస తలెత్తడంతో హైకోర్టు సైతం సీఎం ఖట్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం పంచకుల తగలబడుతున్న చూస్తూ మిన్నకుండిపోయారని ఖట్టర్‌ను హైకోర్టు మందలించింది. అయినప్పటికీ ఖట్టర్‌పై చర్య తీసుకోరాదని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది. డేరా స్వచ్ఛ సౌదాకు భారీ మద్దతు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున హింస తలెత్తకుండా ఖట్టర్ ప్రభుత్వం నియంత్రించగలిగిందని షా అభిప్రాయపడినట్టు సమాచారం. -
‘డేరా’ హింసాకాండ..
-
‘డేరా’ హింసాకాండ.. అనూహ్య మలుపు
ఛండీగఢ్: అత్యాచారం కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్‌కు అన్యాయం జరిగిందంటూ ఆయన భక్తులు, డేరా స్వచ్ఛ సౌదా కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఉత్తరభారతంలోని హరియాణా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విధ్వంసకాండ సృష్టించి, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే, ఈ ఘటనల్లో ధ్వంసమైన ఆస్తుల విలువను డేరా సంస్థ నుంచే ముక్కుపిండి వసూలు చేయాలని కోర్టు ఆదేశించడం గమనార్హం. పంజాబ్, హరియాణా హైకోర్టు శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా వెలువరించిన ఆదేశాల్లో.. డేరా సంస్థకు చెందిన అన్ని ఆస్తులను తక్షణమే జప్తు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. సీబీఐ కోర్టు తీర్పు అనంతరం డేరాలు విధ్వంసం చేసిన ఆస్తుల విలువను.. వారి సంస్థ నిధుల నుంచే వసూలు చేయాలని సూచించింది. పెద్ద ఎత్తున ఆస్తుల విధ్వంసమేకాక హింసాకండలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం మధ్యాహ్నం సంచలన తీర్పు వెలువరించింది. తనను తాను దేవుడి అవతారంగా చెప్పుకునే గుర్మీత్ సింగ్ అలియాస్ బాబా గుర్మీత్ సింగ్ రాం రహీంను దోషిగా తేలారు. 2002లో గుర్మీత్ తన ఆశ్రమంలో సాధ్విలుగా ఉన్న ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు సాక్ష్యాధారాలున్నాయన్న కోర్టు.. అతను ముమ్మాటికీ శిక్షార్హుడేనని పేర్కొంది. గుర్మీత్‌కు విధించే శిక్షలను సోమవారం ఖరారు చేయనున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. 'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల ‘డేరా’ విధ్వంసం.. రాష్ట్రపతి ఖండన రేప్ కేసులో దోషిగా తేలిన గుర్మీత్ సింగ్ -
‘డేరా’ విధ్వంసం.. రాష్ట్రపతి ఖండన
- హింసకు పాల్పడవద్దని కోవింద్ పిలుపు - నాలుగు రాష్ట్రాలు ఆగ్రహజ్వాలలు..28 మంది మృతి న్యూఢిల్లీ: డేరా స్వచ్ఛ సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌పై కోర్టు తీర్పు అనంతరం ఉత్తరాదిలోని పలు రాష్ట్రాల్లో ఆయన అనుచరులు విధ్వంసకాండకు పాల్పడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి హరియాణా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్‌లలో పలుచోట్ల ప్రభుత్వ కార్యాలయాలు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు ఒక దశలో కాల్పులు జరిపారు. అల్లర్లలో ఇప్పటివరకు 28 మంది చనిపోగా, వందలమంది గాయపడ్డారు. కాగా, కోర్టు తీర్పు అనంతరం చెలరేగిన హింసాకాండను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఖండించారు. హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తిచేశారు. ‘‘ ఇవాళ్టి కోర్టు తీర్పుపై హింస చెలరేగడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వసం చేయడం నూటికినూరుపాళ్లూ ఖండనీయం. శాంతి నెలకొనేలా ప్రజలంతా సహకరించాలి’’ అని రాష్ట్రపతి తన అధికార ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. హరియాణా, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్లలోని పలు ప్రాంతాల్లో డేరా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బీభత్సం సృష్టించడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని సున్నిత ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించారు. అత్యాచారం కేసులో గుర్మీత్ సింగ్‌ను పంచకుల సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. గుర్మీత్‌కు విధించే శిక్షను సోమవారం(ఆగస్టు 28న) వెల్లడించనున్నట్లు కోర్టు పేర్కొంది. తీర్పు అనంతరం దోషిని అంబాలా జైలుకు తరలించారు. 'డేరా' దమనకాండ.. ఉత్తరాది విలవిల