హైదరాబాద్: హరియాణా హింసాత్మక ఘటనలపై కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(సీపీఐ) ఘాటుగా స్పందించింది. ఈ ఘటనలకు బాధ్యత వహిస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తక్షణమేరాజీనామా చేయాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
హింసాత్మక ఘటనలను అదుపు చేయటంతో ఖట్టర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సురవరం ఆరోపించారు. ముఖ్యమంత్రిగా కొనసాగటానికి ఆయనకు ఎటువంటి అర్హత లేదని అన్నారు. జాట్ రిజర్వేషన్ ఉద్యమ సందర్భంలోనూ ఆయన ఇలాగే వైఫల్యం చెందారని విమర్శించారు. పంజాబ్, హరియాణాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసహనం పెరిగిపోయిందని అమాయకులపై దాడులు ఎక్కువయ్యాయని సుధాకర్‌రెడ్డి ఆరోపించారు.
హరియాణా సీఎం రాజీనామా చేయాలి: సురవరం
Published Sat, Aug 26 2017 5:36 PM | Last Updated on Mon, Aug 13 2018 4:30 PM
Advertisement