గుర్మీత్‌కు వ్యతిరేకంగా నాతో వాంగ్మూలం ఇప్పించాడు | Woman testimony against Gurmeet was Foceble | Sakshi
Sakshi News home page

డేరా హత్య కేసుల్లో కీలక పరిణామం

Published Sat, Nov 18 2017 4:34 PM | Last Updated on Mon, Jul 30 2018 8:51 PM

Woman testimony against Gurmeet was Foceble - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : డేరా సచ్ఛా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌పై దాఖలైన హత్య కేసుల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గుర్మీత్‌కు వ్యతిరేకంగా వాంగ్ములం ఇచ్చిన మహిళ సంచలన ప్రకటన చేసింది. డేరాను అభాసుపాలు చేసేందుకే డేరా బాబా మాజీ డ్రైవర్‌ ప్రయత్నిస్తున్నాడని పేర్కొంది. 

సిర్సాకు చెందిన జర్నలిస్ట్‌ రామ్‌ చందర్‌ ఛత్రపతి, డేరా మాజీ మేనేజర్‌ రంజిత్‌ హత్యకేసులకు సంబంధించి గుర్మీత్‌ మాజీ డ్రైవర్‌ ఖట్టా సింగ్ ఫిర్యాదు మేరకు కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలు సమర్థించేలా కౌర్‌ అనే మహిళతో అతను అతను వాంగ్మూలం కూడా ఇప్పించాడు. అయితే ఆ మహిళ మాత్రం ఇప్పుడు తాను ఇష్టపూర్వకంగా ఆ స్టేట్‌మెంట్ ఇవ్వలేదని అంటోంది. డేరాను, గుర్మీత్ బాబాను అభాసుపాలు చేసేందుకే ఖట్టా సింగ్‌ ఈ ఆరోపణలు చేస్తున్నాడని ఆమె చెబుతోంది. 

బాబాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పకపోతే ఖట్టాసింగ్‌ తనను చంపేస్తానని బెదిరించాడని.. చివరకు తనను కిడ్నాప్‌ చేసేందుకు కూడా యత్నించారని ఆమె తెలిపింది. ప్రస్తుతం జంట హత్యల కేసు విచారణ చివరిదశలో ఉన్న తరుణంలో కౌర్‌ వ్యాఖ్యలు కీలకంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇద్దరు సాధ్వీలను అత్యాచారం చేశాడన్న ఆరోపణలపై గుర్మీత్‌కు పంచకుల ప్రత్యేక న్యాయస్థానం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించగా.. ప్రస్తుతం  రోహ్‌తక్‌ సునరియా జైలులో గుర్మీత్‌ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement