గుర్మీత్ అనుచరులు చంపేస్తారేమో!
గుర్మీత్ అనుచరులు చంపేస్తారేమో!
Published Fri, Aug 25 2017 8:51 PM | Last Updated on Sat, Jul 28 2018 8:43 PM
ఛండీగఢ్: పదిహేనేళ్ల రేప్ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు డేరా అనుచరుల్లో ఆగ్రహ జ్వాలలు రగల్చింది. ఓవైపు మృతుల సంఖ్య పెరిగిపోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వ్యాపిస్తుండటంతో ఉత్తర భారతావనిలో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలో అత్యాచార బాధితురాళ్ల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ అత్యాచారానికి పాల్పడ్డారంటు చెబుతున్న ఇద్దరు సాధ్వీలు ప్రస్తుతం ఉన్నారన్నది ఎవరికీ తెలీదు. ఈ విషయంపై నోరు మెదిపేందుకు వాళ్ల తరపు న్యాయవాది కూడా సుముఖంగా లేదు. తాజా పరిస్థితుల్లో వారి ప్రాణాలకు ముప్పు ఉండటంతో ఎలాంటి సమాచారం బయటకు పొక్కనీయటం లేదు.
‘గత కొద్దిరోజులుగా వాళ్లలో భయాందోళనలు కనిపిస్తున్నాయి. ప్రాణ భయంలో బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఒకవేళ కేసులో ఆయన్ను(గుర్మిత్) నిర్దోషిగా ప్రకటిస్తే తాము వేరే రాష్ట్రానికి వెళ్లిపోతామని వాళ్లు తనతో మొరపెట్టుకున్నట్లు‘ న్యాయవాది తెలిపారు. మరోవైపు ఈ కేసులో పారదర్శకత కోసం హర్యానాలో కాకుండా వేరే రాష్ట్రంలో వాదనలు వినిపించాలని ఆయన వాదనల సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది.
ఇక తీర్పు వెలువడే ముందే బాధితురాల్లో ఒకరు ఓ జాతీయ మీడియాతో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. తాను పెను పెద్ద ప్రమాదంలో ఉన్నానని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. తాను స్వేచ్ఛగా తిరగలేకపోతున్నానని, నిజాయితీ పరులైన అధికారుల వల్లే తమకు న్యాయం చేకూరుతుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపిందంట. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితుల మధ్య వాళ్లు సురక్షితంగా ఉంటారా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
2002లో ఓ లేఖ ద్వారా ఈ వ్యవహారం మొదలైంది. మూడు పేజీల ఆ లేఖ అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్, కేంద్ర హోం మత్రి మరియు హైకోర్టు, ఇతరుల పేర్లను ప్రస్తావిస్తూ తనపై గుర్మీత్ అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. తనని గుఫాగా అభివర్ణిస్తూ గుర్మిత్ తన డెన్‌లో పక్కనే గన్ పెట్టుకుని బెదిరిస్తూ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు లేఖలో ఉంది. ఆ లేఖ ఆధారంగా సీబీఐ దర్యాప్తునకు ఛండీగఢ్ హైకోర్టు ఆదేశించింది.
సీబీఐ విచారణలో మరో సాధ్వీపై కూడా అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ లెటర్ వెలుగులోకి రావటానికి కారణమైన వ్యక్తి హత్యకు గురయ్యాడు కూడా. 2008లో సీబీఐ కోర్టు రామ్ రహీమ్ మీద అత్యాచార ఆరోపణలను నమోదు చేసింది. 15 ఏళ్ల తర్వాత చివరకు గుర్మీత్ ను దోషిగా పేర్కొంటూ తీర్పు వెలువరించింది.
Advertisement