
గుర్మీత్‌కు జైలు: అనూహ్య మలుపు
రోహతక్: డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్ కేసు తీర్పులో మరో ట్విస్ట్. లైంగిక వేధింపుల కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనకు పదేళ్ల జైలు శిక్ష విధించినట్టు మీడియా ప్రచారం చేసింది. అయితే ఆయనకు 20 ఏళ్లు జైలు శిక్ష విధించినట్టు తేలింది. రెండు కేసుల్లో దోషిగా తేలిన ఆయనకు ఒక్కో కేసులో కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిందని సీబీఐ అధికార ప్రతినిధి అభిషేక్ దయాళ్ వెల్లడించారు. ఈ రెండు శిక్షలు దాని తర్వాత ఒకటి అమలు చేస్తారని వెల్లడించారు.
ఈ విషయాన్ని గుర్మీత్ సింగ్ తరపు న్యాయవాదులు కూడా ధ్రువీకరించారు. అయితే రెండు శిక్షలు ఒకేసారి అమలవుతాయని గుర్మీత్ సింగ్ తరపు లాయర్ ఎస్‌కే నార్వానా అన్నారు. శిక్షతో పాటు రూ.15 లక్షల చొప్పున మొత్తం రూ. 30 లక్షల న్యాయస్థానం జరిమానా విధించిందని తెలిపారు. రూ. 14 లక్షల చొప్పున మొత్తాన్ని ఇద్దరు బాధితురాళ్లకు ఇవ్వాలని కోర్టు ఆదేశించినట్టు చెప్పారు. తీర్పు పాఠం పూర్తిగా చదివిన తర్వాత ఉన్నత న్యాయస్థానాల్లో కచ్చితంగా అప్పీలు చేస్తామని ప్రకటించారు.
15 ఏళ్ల క్రితం తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలను అత్యాచారం చేసిన కేసులో గుర్మీత్ దోషిగా ఇదివరకే నిర్ధారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. ఆ మేరకు సోమవారం మధ్యాహ్నం కఠిన శిక్షను ఖరారు చేసింది. తీర్పు సందర్భంగా గుర్మీత్ చేతులు కట్టుకుని తనను క్షమించి వదిలేయాలని న్యాయమూర్తిని వేడుకున్నారు.
ప్రాథమిక కథనాలు: