లైంగిక వేధింపుల కేసులో డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం సోమవారం పదేళ్ల కఠిన కారాగార శిక్ష జైలు శిక్ష విధించింది. తీర్పు సందర్భంగా న్యాయమూర్తి పలు అంశాలు ప్రస్తావించారు. ఇది క్షమించరాని నేరమని పేర్కొన్నారు. తనను నమ్మి వచ్చిన అమాయకులపై అత్యాచారానికి పాల్పడడం దారుణమని వ్యాఖ్యానించారు. గుర్మీత్ రాం రహీమ్ సింగ్‌కు జీవితఖైదు విధించాలని బాధితురాలు కోరినట్టు వెల్లడించారు.