
సాక్షి, హైదరాబాద్ : తండ్రి పిల్లల ఆలనా పాలన చూసుకోనే వ్యక్తి. తనకు ఎంత కష్టం వచ్చిన పిల్లలకు ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా సంతోషంగా చూసుకొనేవాడు. పిల్లల సంతోషమే తన సంతోషంగా భావించే మహోన్నతమైన వ్యక్తి. కానీ చైనాలో ఓ వ్యక్తి మాత్రం నాన్న పదానికి మచ్చ తెచ్చేలా ప్రయత్నించాడు. కన్నకూతురు అని చూడకుండా దారుణంగా హింసించాడు. ప్రతిఫలంగా కటకటాల పాలయ్యాడు.
వివరాల్లోకి వెళ్తే.. చైనాలోని ఘ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన వియ్ తన 10ఏళ్ల కూతురుని దారుణంగా హింసించాడు. తన బైక్ వెనుక పడుతోందని కాళ్లు చేతులు కట్టేసి కర్రతో చితక బాదాడు. ఆదెబ్బలకు ఆ చిన్నారి రోదిస్తున్న పక్కన ఉన్న వారి మనసు కరగలేదు. ఆ తండ్రిని అడ్డుకొనే ప్రయత్నం కూడా చేయలేదు. కొంచెం కూడ మనసులేని వియ్ అంతటితో ఆగకుండా కూతురుని తాడుతో బైక్‌కు కట్టేసి రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లాడు.
అయితే ఈ దారుణాన్ని గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీసి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు 20 నిమషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. బాలల వేధింపుల చట్టం కింద వియ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment